ఇప్పుడున్న 7.5 శాతంలో ఒక శాతం తగ్గిస్తే ఏమవుతుంది?
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో రెవెన్యూ మంత్రి పొంగులేటి భేటీ
భూముల విలువల సవరణ నేపథ్యంలో ఫీజు తగ్గింపుపై చర్చ
వచ్చే వారం లోపు భూముల విలువల సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును ఒక శాతంమేర తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై నివేదిక సమ ర్పించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారు లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికా రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫీజు తగ్గింపు అంశం చర్చకు వచ్చింది. ఎలాగూ భూముల «విలువలను సవరిస్తున్నందున సామాన్య ప్రజలపై భారం పడకుండా ఒక శాతం ఫీజు తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని చర్చించినట్లు సమాచారం.
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌లతో పాటు పలువురు డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు, భూముల విలువల సవరణ, కొత్త సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం, బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లా డుతూ సామాన్యుడిపై భారం పడకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించాలని, బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా ఈ సవరణ చేపట్టాలని సూచించారు.
వచ్చే వారంలోపు సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సబ్‌రిజిస్ట్రార్లు పనిచేయాలని మంత్రి సూచించారు. త్వరలోనే శాఖ పరిధిలో బదిలీలు జరగనున్నా యని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తా మని, బది లీల కోసం ఎవరూ తన వద్దకు రావ ద్దని, పైరవీలు చేసే వారిపై చర్యలు తీసుకుంటా నని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. ఇక, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి చెట్ల కింద వేచి ఉండే పరిస్థితులు ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని హంగులతో శాశ్వతంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భవనాలు నిర్మించే ప్ర క్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.
సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment