హామీల అమల్లో టీఆర్‌ఎస్ విఫలం
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చింతకాని: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరం గా విఫలమైందని ఖమ్మం ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్‌లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి సమక్షంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వంద కుటుంబాల వారు.. పార్టీ నాయకులు బూరుగడ్డ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎంపీ పొంగులేటి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారుు.
పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన పొం గులేటి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో ఎంపీటీసీ దాసరి సామ్రాజ్యం, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి ఆకుల మూర్తి, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాధు రమేష్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, మధిర నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ తూమాటి నర్సిరెడ్డి, మధిర, చింతకాని మండల క న్వీనర్లు యన్నం కోటేశ్వరరావు, ఎర్రుపాలెం జెడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, కొప్పుల నాగేశ్వరరావు, తూమాటి అనంతరెడ్డి, చెవుల వెంక య్య, కన్నెబోయిన సీతారామయ్య, వాకా వీరారెడ్డి, నెల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.