ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు | Counting by-election today | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు

Published Tue, Sep 16 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

Counting by-election today

నందిగామ : ఉప ఎన్నికల కౌంటింగ్ సమర్థంగా నిర్వహిం చేందుకు కౌంటింగ్ విధులు నిర్వహించే వారు అధికారులకు సహకరించాలని నియోజవకర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు పలు శాఖల అధికారులకు సూచించారు. నందిగామ కేవీఆర్ కళాశాలలో మంగళవారం జరిగే కౌంటింగ్‌లో అధికారులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  

కౌంటింగ్ నిర్వహించేటప్పుడు అధికారులందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న ఈవీఎంలు లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చేటప్పుడు, లెక్కించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నందిగామ తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావుతో పాటు ఎంపీడీవో పి.సుశీల  పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement