Nageswara
-
డిజిటైజేషన్ అంటే నియంత్రణల ఎత్తివేత కాదు
ముంబై: డిజిటైజేషన్ అంటే నియంత్రణల తొలగింపు అన్న తప్పుడు అభిప్రాయం అధికార యంత్రాంగంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్(Ananth Nageswaran) అన్నారు. ప్రత్యామ్నాయ పెట్టుబడుల (ఏఐ) పరిశ్రమ లాబీ గ్రూప్ ఐవీసీఏ ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగేశ్వరన్ మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల్లో ఒక తప్పుడు అభిప్రాయం నెలకొంది. వారు ఏదైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఉంచారంటే, దాన్ని నియంత్రణ తొలగింపుగా భావిస్తున్నారు. కానీ అది నియంత్రణల తొలగింపు కాదు. ఆఫ్‌లైన్ బదులు ఆన్లైన్లో ఉంచారంతే. అభివృద్ధి చెందాలనుకునే ఏ దేశమైనా చిన్న వ్యాపారాలపై దృష్టి సారించాలి. నియంత్రణల వంటి సవాళ్లను తొలగించాలి. దాంతో నిబంధనల అమలుపై వనరులు వృధా కాబోవు’’అని స్పష్టం చేశారు. ప్రపంచీకరణ స్థానంలో కొత్త నమూనా రానున్న రోజుల్లో భారత్ దేశీ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడడం ద్వారానే మరింత వృద్ధి సాధించగలదన్నారు నాగేశ్వరన్. గ్లోబలైజేషన్ (ప్రపంచీకరణ) గతంలో మాదిరిగా ప్రయోజనాలను అందించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీ గ్లోబలైజేషన్ (దేశాల మధ్య అనుసంధానం తగ్గిపోవడం) ధోరణి వంద సంవత్సరాలకు పైగా చూస్తున్నదేనంటూ.. ప్రస్తుత నమూనాలో పరిమితుల దృష్ట్యా కొత్త ధోరణి అవతరించొచ్చన్నారు. రూపాయి ఏటా 3 శాతం క్షీణత ద్రవ్యోల్బణాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న 4–5 శాతం శ్రేణి నుంచి 3–4 శాతం శ్రేణికి పరిమితం చేస్తే రూపాయి విలువ క్షీణతను అడ్డుకోవచ్చన్న అభిప్రాయాన్ని అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఏటా 3 శాతం క్షీణించొచ్చని (డాలర్‌తో పోల్చితే) చెప్పారు. ఇంధన భద్రత విషయంలో భారత్ రాజీపడకూడదన్నారు. చైనా పాలసీపై సమీక్ష లేదు.. చైనా పెట్టుబడులపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధాన్ని సమీప కాలంలో భారత్ సమీక్షించకపోవచ్చని నాగేశ్వరన్ అన్నారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాల ప్రాముఖ్యతను గుర్తించినట్టు చెప్పారు. వాణిజ్య అసమానతలపై రెండు దేశాలు సంప్రదింపులు నిర్వహిస్తున్నాయని, పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. -
విద్యుధ్ఘాతానికి రైతు బలి
మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు(45) అనే రైతు ఈ రోజు ఉదయం బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి దారుణ హత్య
పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో నాగేశ్వర రావు(40) అనే వ్యక్తి ప్రత్యర్థులు హత్యచేశారు. నాగేశ్వర రావును ప్రత్యర్థులు గొడ్డలితో నరికి చంపారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు
నందిగామ : ఉప ఎన్నికల కౌంటింగ్ సమర్థంగా నిర్వహిం చేందుకు కౌంటింగ్ విధులు నిర్వహించే వారు అధికారులకు సహకరించాలని నియోజవకర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు పలు శాఖల అధికారులకు సూచించారు. నందిగామ కేవీఆర్ కళాశాలలో మంగళవారం జరిగే కౌంటింగ్‌లో అధికారులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహించేటప్పుడు అధికారులందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న ఈవీఎంలు లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చేటప్పుడు, లెక్కించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నందిగామ తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావుతో పాటు ఎంపీడీవో పి.సుశీల పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన భూతగాదా
దాయాదుల ఘర్షణ నాటు తుపాకీతో గిరిజనుని కాల్చివేత క్షణికావేశంలో హత్యలు జి.మాడుగుల : క్షణికావేశంలో ఏజెన్సీలో హత్యలు చోటుచేసుకుంటున్నాయి. చిన్న చిన్న తగాదాలకూ ఒకరినొకరు చంపుకోవడం ఇక్కడ సాధారణమవుతోంది. మన్యంలోని పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల ప్రాంతాల్లోఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. శుక్రవారం జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ గనెల్బలో చోటుచేసుకున్న సంఘటన ఈ కోవకే చెందుతుంది. జి.మాడుగుల ఎస్ఐ శేఖరం అందించిన వివరాలిలా ఉన్నాయి. కోరాపల్లి పంచాయతీ మారుమూలగ్రామం గనెల్బకు చెందిన నాగేశ్వరరావు, ఈశ్వరరావులు దాయాదులు. ఈ రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూతగాదా ఉంది. కిట్లంగి నాగేశ్వరరావు కొన్నాళ్ల క్రితం 25సెంట్లు భూమిని రూ.3వేలుకు ఈశ్వరరావుకు తనఖా పెట్టాడు. భూమిని తిరిగి తనకు అప్పగించాలని నాగేశ్వరరావు కోరాడు. దానికి రూ.8వేలు చెల్లించాలని ఈశ్వరరావు డిమాండ్ చేశాడు. గొడవ పంచాయతీకి చేరడంతో 10 రోజుల క్రితం పంటలో సగం, రూ. 3 వేలు ఈశ్వరరావుకు ఇవ్వాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు. అంతవరకు భూమి అతని అధీనంలో ఉండాలన్నారు. ఇందుకు విరుద్ధంగా నాగేశ్వరరావు, అతని భార్య బంగారమ్మ, కొడుకు గోవింద్ వివాదాస్పద భూమిలో శుక్రవారం పనులు చేపట్టారు. ఇది చూసిన ఈశ్వరరావు కోపంగా ఇంటికి వెళ్లి నాటుతుపాకీ తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. దీంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య బంగారమ్మ ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.