మంత్రులకు ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తూ సీఎం కేసీఆర్ గురువారం నిర్ణయం తీసుకున్నారు.
వరంగల్ ఉప ఎన్నికను టీఆర్ ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ మంత్రులకు ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ ఉప ఎన్నిక అన్ని పార్టీల మధ్య పోటా పోటీగా సాగ నుండటంతో.. టీఆర్ఎస్ అధినేత అభ్యర్థి ఎన్నిక నుంచి.. ప్రచారం వరకూ ప్రతి అంశంపై స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ గడ్డమీద విజయ కేతనం ఎగరేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే... అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా.. మంత్రులకు ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లకు వరంగల్ తూర్పు , వరంగల్ పశ్చిమ నియోజక వార్గాల ఇన్ చార్జిలుగా బాధ్యతలు ఇచ్చిన కేసీఆర్.. పరకాల నియోజక వర్గాన్ని ఈటల, భూపాల్ పల్లి నియోజక వర్గాన్ని పోచారం శ్రీనివాస్, వర్ధన్న పేట నియోజక వర్గాన్ని జోగు రామన్నల కు అప్పగించారు. ఇక స్టేషన్ ఘన్పూర్ కి ఇంద్రకరణ్ రెడ్డి, పాలకుర్తికి జగదీష్ రెడ్డిలు పార్టీ ఎన్నికల ఇచ్ చార్జ్ లుగా వ్యవహరిస్తారు.