సాక్షి, వరంగల్: టీఆర్‌ఎస్ శ్రేణులు మరోసారి రెచ్చిపోయారు. దీంతో, వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేరవాన్‌కు నిప్పంటించడం కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. చెన్నారావుపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ షర్మిల కేరవాన్‌కు నిప్పు అంటించారు. కొన్ని వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. కాగా, నిన్న(ఆదివారం) నర్సంపేట సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దారుణానికి ఒడిగట్టాయి.
ఇక, ఈ ఘటనపై వైఎస్ షర్మిల స్పందించారు. తమ పాదయాత్రను అడ్డుకునేందుకు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి కుట్రపూరింతంగా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇలా చేశారని షర్మిల ఆరోపించారు. అలాగే, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇక, టీఆర్‌ఎస్ శ్రేణుల చర్యతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, ప్రస్తుతం లంచ్ బ్రేక్ అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య షర్మిల పాదయాత్ర కొనసాగే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో షర్మిలను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment