
నందిగామలో టీడీపీ ఘనవిజయం
74,827 ఓట్ల మెజారిటీతో తంగిరాల సౌమ్య గెలుపు
ప్రతిపక్షం పోటీ చేయకపోవడంతో అధికార పార్టీకి భారీ మెజారిటీ
నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి తంగి రాల ప్రభాకర్‌రావు ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగిన విషయం తెలి సిందే. అయితే.. గత సంప్రదాయాలను అనుసరించి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవతా దృక్పథంతో ఈ ఉప ఎన్నికలో పోటీ చేయలేదు. టీడీపీ అభ్యర్థిగా తం గిరాల సౌమ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు, స్వతంత్ర అభ్యర్థులుగా కటారపు పుల్లయ్య, మాతంగి పుల్లారావులు పోటీ చేశా రు. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన ఎన్నికల కమిషన్.. మంగళవారం ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి 99,748 ఓట్లు రాగా.. కాం గ్రెస్ అభ్యర్థికి 24,961 ఓట్లు వచ్చి డిపాజిట్ దక్కించుకున్నారు. ఇటీవల సాధారణ ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన టీడీపీకి.. ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పోటీలో లేకపోవటంతో ఈసారి భారీ మెజారిటీ లభించింది.
మా పనితీరును ప్రజలు ఆమోదించారు: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పరిపాలనపై ప్రజా తీర్పుకు కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపే నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివర్ణించారు.