
'చంద్రబాబుది రహస్య ఎజెండా'
అనంతపురం: తాత్కాలిక రాజధానికి తాము వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. చంద్రబాబు రహస్య ఎజెండా అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బుసంచులు మోసినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకుండానే రాజధానిపై ఎందుకు తొందరపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పంటల భూముల్లో రాజధాని ఏర్పాటు మంచిదికాదని హితవు పలికారు. రాజధాని ఎంపిక విషయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలని రఘువీరారెడ్డి సూచించారు.