రాజధానికి దొనకొండ సరైన ప్రదేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రదేశ ఎంపికపై పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. ఇది ఎవరి కోసమని ఆయన శనివారం అసెంబ్లీలో నిలదీశారు. దీనిపై ఇప్పటికే శివరామకృష్ణన్ కమిటీ పని చేస్తుందని గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. భూముల ధరలు ఆకాశన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానికి దొనకొండే సరైన ప్రదేశమని గొట్టిపాటి సూచించారు. దీనిపై మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ త్వరలోనే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇస్తుందని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.