మూడేళ్లలో పాలన అంతా బెజవాడ నుంచే
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఈనెల 27న శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదిక ఇవ్వనుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ తాత్కాలిక రాజధానిలో శాఖాధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. మూడేళ్లలో పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందని ఆయన తెలిపారు.
త్వరలో దేశంలోని నాలుగు రాజధానుల్లో సలహా కమిటీ పర్యటిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన కమిటీ కేవలం సలహాలు మాత్రమే ఇస్తుందని నారాయణ స్పష్టం చేశారు. విజయవాడకు మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తరలించవచ్చని ఆయన చెప్పారు. ప్రజలతో తక్కువ సంబంధం ఉన్న శాఖలను తరలిస్తామని నారాయణ చెప్పారు.