SivaramaKrishnan committee
-
అమరావతి.. వరదావతే..
విజయవాడను వరద ముంచెత్తడం కంటే రాజధాని అమరావతి వరదలో చిక్కుకుందన్నదే సీఎం చంద్రబాబును ఎక్కువ కలవరపెడుతోంది. తన రియల్ ఎస్టేట్ మాఫియా సామ్రాజ్యంగా ఎంపిక చేసుకున్న అమరావతి ప్రకృతి విపత్తుల నుంచి సురక్షితం కాదన్న అసలు వాస్తవం బట్టబయలు కావడంతో ఆయనకు కంటి మీద కునుకు లేదు. అబ్బే అమరావతికి వరదే రాలేదంటూ చంద్రబాబు అండ్ కో తిమ్మిని బమ్మిని చేసేందుకు నానా తంటాలు పడుతోంది. వరదే లేదన్నట్టుగా భ్రమింపజేయాలన్న టీడీపీ కూటమి పెద్దల యత్నాలు బెడిసికొట్టాయి. వరద ముంపులో చిక్కుకున్న అమరావతి ఫొటోలు అటూ ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. ఎక్కడో ఉన్న బుడమేరుకు వరదొస్తేనే ఇటు అమరావతి మునిగిపోతుంటే... ఇక పక్కనే ఉన్న కృష్ణా నదికి వరద పోటెత్తితే అమరావతి గతేమిటన్నది యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆందోళనకుగురి చేస్తోంది. – సాక్షి, అమరావతిచంద్రబాబు బుకాయింపు ఇదీ..అమరావతిని వరద ముంచెత్తడంతో ఆ అక్కసునంతా చంద్రబాబు మీడియాపై చూపిస్తున్నాటరు. మీడియా ప్రతినిధులపై ఆయన మంగళవారం చిందులు తొక్కారు. అసలు అమరావతికి వరద ఎక్కడ వచ్చిందని దబాయించేశారు. ‘రాజధాని నిర్మాణానికి అమరావతి అత్యంత సురక్షితమైన ప్రదేశం. అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు అమరావతి పరిధిలోని గ్రామాల్లోకి వరద నీరే రాలేదు. నీటి చుక్కే లేదు’.. ఇలా సాగింది చంద్రబాబు కవరింగ్ డ్రామా. చంద్రబాబు ఎంతగా బుకాయిస్తున్నా రాజధాని అమరావతిని వరద ముంచెత్తిందన్నది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఆ విషయాన్ని అంగీకరిస్తూ హైకోర్టుకు లేఖ కూడా రాసింది. మరోవైపు మూడు రోజులుగా అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు వరద భయంతో బిక్కుబిక్కుముంటున్నారు. అమరావతిలో పొంచి ఉన్న వరద ముప్పును వెల్లడిస్తున్న ఉదంతాలు ఇలా ఉన్నాయి..29 గ్రామాలకు నష్టంభారీ వర్షాలకు రాజధానిలో 31.15 కిలోమీటర్లు ప్రవహిస్తున్న కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్‌లోని ఉండవల్లి అవుట్‌పాల్ స్లూయిజ్‌ల ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. ఉద్దండరాయునిపాలెం, పెద్దలంక, హరిశ్చంద్రాపురం, రాయపూడి లంక, మత్స్యకార కాలనీ తదితర గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. ఆ గ్రామాల పరిధిలో 2 వేల మందికిపైగా ప్రజలు ఉన్నా ప్రభుత్వం కేవలం 50 మందినే పునరావాస కేంద్రాలకు తరలించింది. ఏ క్షణంలోనైనా కృష్ణా కరకట్ట తెగవచ్చని అధికార యంత్రాంగం గుర్తించినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం. దాంతో ఆ గ్రామాల ప్రజలు కరకట్ట వెంబడి పహారా కాశారు. కానీ అమరావతి గ్రామాలకు వరద ముప్పే లేదంటూ చంద్రబాబు దబాయిస్తుండటం విడ్డూరమే.ఐఐటీ నిపుణుల కమిటీదీ ఇదే అభిప్రాయం?కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు మద్రాస్ ఐఐటీ నిపుణులను రప్పించింది. వారు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేల నివాస భవనాలు మొదలైనవాటిని పరిశీలించారు. ఏకంగా కృష్ణా నదిలో బోట్లలో ప్రయాణిస్తూ మరీ చంద్రబాబు కరకట్ట బంగ్లా, తదితర భవనాలను కూడా çపరిశీలించింది. కృష్ణా నది కరకట్ట మీద చంద్రబాబు బంగ్లాతోపాటు పలు నిర్మాణాలు అక్రమంగా నిర్మించిన విషయాన్ని ఆ బృందం గుర్తించింది. ఆ అక్రమ నిర్మాణాల వల్ల నది కరకట్ట దెబ్బతింటోందని కూడా కమిటీ సభ్యులు గుర్తించినట్టు సమాచారం. ఇక అమరావతిలో నేల స్వభావం భారీ భవనాల నిర్మాణానికి సరిపోదని ఆ నిపుణులు ఆంతరంగిక చర్చల్లో అభిప్రాయపడ్డారు. అమరావతిలో నిర్మాణాలపై నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ఆ తరువాత ఈ విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కమిటీని పక్కనపెట్టేసినట్టు సమాచారం.సచివాలయం హుటాహుటిన ఖాళీఅమరావతిని వరద ముంచెత్తుతుండటంతో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తారు. ముప్పును గుర్తించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సచివాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. దాంతో అధికారులు, ఉద్యోగులు హుటాహుటిన సచివాలయాన్ని వీడి విజయవాడ, గుంటూరుకు తరలివచ్చేశారు. మూడు రోజులుగా రాష్ట్ర సచివాలయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అంటే.. సచివాలయానికి తాత్కాలికంగా తాళాలు వేశారు. ఎమ్మెల్యే క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు, పలు ప్రభుత్వ భవనాల వద్ద ఇంకా వరద నీరు నిలిచే ఉంది. అయినా అమరావతికి వరదే లేదని దబాయించడం చంద్రబాబుకే చెల్లింది.స్తంభించిన హైకోర్టు కార్యకలాపాలురాజధానికి వరద ముంచెత్తుతుండటంతో హైకోర్టులో రెండు రోజులుగా కార్యకలాపాలు స్తంభించాయి. సోమవారం కేసుల విచారణ ప్రారంభమైన కాసేపటికే కరకట్ట వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రిజిస్ట్రార్లు న్యాయమూర్తులకు నివేదించారు. దాంతో కేసుల విచారణను వాయిదా వేసి న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది వెనక్కి వెళ్లిపోయారు. మరోవైపు వరదముప్పు ముంచుకొస్తున్నందున హైకోర్టు కార్యకలాపాలు రెండు రోజులు నిలిపివేయాలని ప్రభుత్వమే అధికారికంగా హైకోర్టుకు సూచించింది. ఈమేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు.కరకట్ట బంగ్లా ఖాళీస్వయంగా చంద్రబాబు నివాసముంటున్న అక్రమ నిర్మాణం కరకట్ట బంగ్లాలోకి వరద నీరు ముంచెత్తిన వాస్తవాన్ని కూడా కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి దూరం నుంచి కూడా ఆ బంగ్లాను ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయకుండా కాపలా కాస్తున్నారు. కరకట్ట బంగ్లాలోకి వరద నీరు రాకుండా వేల సంఖ్యలో ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేస్తున్నారు. ఆ పక్కనే ఉన్న మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరు వచ్చింది. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట దిగువన ఉన్న 34 భవనాలూ నీట మునిగాయి. అయినా అమరావతికి వరద ముప్పు లేదనడం చంద్రబాబు వితండవాదానికి నిదర్శనం.రాజధానిగా ఈ ప్రాంతం పనికిరాదని విస్పష్టంగా చెప్పిన శివరామకృష్ణన్ కమిటీఅమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి ఏమాత్రం పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ ఆనాడే తేల్చి చెప్పిన విషయం ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ప్రాంతం ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. దేశంలోనే అత్యుత్తమ నిపుణులతో కూడిన ఆ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అధ్యయనం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములు ఉండటం, లోతట్టు ప్రాంతం, నేల స్వభావం దృష్ట్యా అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించవద్దని స్పష్టంగా చెప్పింది. ఇక్కడి నేలలో భారీ భవనాల నిర్మాణం ప్రమాదకరమని కూడా వెల్లడించింది. ఏటా వరద ముప్పు ఉంటుందని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయవద్దని నివేదించింది. అయినా చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ మాఫియా కోసం అమరావతిని ఏకపక్షంగా రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారు. -
రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ కేంద్రం స్పష్టం చేసిందని ఏపీ పరిపాలన వికేంద్రీకరణ సాధన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం ప్రకటనను వక్రీకరిస్తూ కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 5, 6, 94లలో పేర్కొన్న అంశాలను వక్రీకరిస్తూ అమరావతే ఏకైక రాజధాని అని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన గురువారం ఖండించారు. కొత్త రాజధానిలో హైకోర్టు, రాజ్‌భవన్, ఇతర కార్యనిర్వాహక హెచ్వోడీలు ఏర్పాటు చేయాలని.. ఆ చట్టంలోని సెక్షన్ 94(3)లో పేర్కొన్నారన్నారు. ఈ అంశాలను సెక్షన్ 6లో పేర్కొన్న అంశాలతో సమన్వయపరిచి చూడాలన్నారు. రాజదాని ఏర్పాటు కోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను పరిశీలించి.. నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని.. సెక్షన్ 6లో స్పష్టం చేశారన్నారు. ఆ ప్రకారం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో అధికార వ్యవస్థలను వికేంద్రీకరణ విధానంలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారన్నారు. ఆ ప్రకారమే వెనుకబడిన ఉత్తరాంధ్రలో పరిపాలన రాజదాని ఏర్పాటుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించాలన్నారు. -
నారాయణ సంస్థలపై సీఐడీ దాడులు.. సంచలన విషయాలు వెలుగులోకి!
ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖవిద్యా సంస్థల అధినేత పి.నారాయణకు చెందిన సంస్థలపై సీఐడీ అధికారులు చేసిన దాడులలో సంచలన విషయాలే వెలుగులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. నిజానికి ఎప్పుడో వీరు కనిపెట్టి ఉండాల్సింది. అయినా న్యాయపరమైన చిక్కులు, తెలుగుదేశం పార్టీకి ఉన్న మేనేజ్ మెంట్ స్కిల్స్ నేపథ్యంలో సీఐడీ స్లో గా వెళుతోందనినుకోవాలి. చాలా కాలం క్రితమే రాజధాని భూముల కుంభకోణంపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా కేసు పెట్టినా, దానిని ముందుకు తీసుకువెళ్లడానికి పోలీసులు వెనుకాముందాడుతున్నారని చెప్పాలి. ఆయనకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. తాజాగా నారాయణకు చెందిన ఎన్స్పైర్ అనే సంస్థలో పోలీసులు సోదాలు జరపగా, ఆయన నడుపుతున్న షెల్ కంపెనీల బాగోతం కూడా బయటపడిందట. రెండు కంపెనీల పేరుతో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎన్ స్పైర్లో పెట్టారట. అక్కడ నుంచి ఆ డబ్బు నారాయణ బంధువుకు చెందిన రామకృష్ణ హౌసింగ్‌కు బదలాయించారు. ఇదంతా అస్సైన్డ్ భూముల కొనుగోలులో వెచ్చించారట.. ఇదంతా బ్లాక్ మనీగా భావిస్తున్నారు. అస్సైన్డ్ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. ఆ పాయింట్ ఆధారంగా నారాయణ బినామీలు పెద్ద ఎత్తున బలహీనవర్గాలను భయపెట్టి ఉండాలి. ఆ తర్వాత తాము ఇంత మొత్తం ఇస్తామని చెప్పి వారికి ఆశ కల్పించి ఆ భూములను పొందారన్నది సమాచారం. తదుపరి ఆ భూముల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చారు. తద్వారా అస్సైన్డ్ భూములు వారు స్వాధీనం చేసుకోగలిగారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు విచారణ చేపట్టిన సిఐడికి పలు సంచలన విషయాలు తెలిశాయి. ఇందులో పెద్ద ఎత్తున నల్లధనం వెచ్చించారని కనుగొన్నారు. నిజానికి అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్ లోనే ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎకరా పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఉండేది. పచ్చటి పొలాలు ఉన్న భూములు. ఏడాదికి మూడు పంటలు పండుతాయి. అలాంటి భూములలో రాజధాని పెట్టవద్దని కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటి స్పష్టంగా సూచించినా, చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా భూ సమీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీశారు. అందులో భాగంగా ప్రభుత్వ భూమి ఇరవై ఏకరాలతో పాటు ప్రైవేటు భూములు ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించారు. అందుకు ప్రతిఫలంగా సంబంధిత రైతులకు వారి అర్హతను బట్టి ఎకరాకు యాభై వేల రూపాయల కౌలు, 1450 గజాల వరకు స్థలం కేటాయింపు వంటివి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఒప్పందం ఆధారంగా అనేక మంది రైతులు తమకు వచ్చే ప్లాట్లను ముందుగానే అమ్ముకున్నారు. కొంతమంది తమ పొలాలను అమ్ముకోగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి వారు ప్లాట్లు పొందడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం రోడ్లు,డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చవలసి ఉంటుంది. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలను వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినది కాదు. స్థోమతకు మించిన పని . రాజధాని కి సంబందించిన కార్యాలయాలు అది కూడా అసెంబ్లీ, సచివాలయం వంటివి తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించారు. ఇదిలా ఉండగా, రాజదాని గ్రామాలలో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ సైడ్ ట్రేడింగ్ తో పలువురు టిడిపి నేతలు ఈ భూములను ముందుగానే కొనుగోలు చేసి లాభాలు పొందడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా వీరిలో అత్యధికులు నల్లధనాన్నే ఎక్కువగా వెచ్చించారు. ఒక పక్క ఎకరా భూమి కోటి రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయలకు పెరిగిందని ఘనంగా చంద్రబాబు, మంత్రి నారాయణ వంటివారు చెబుతుండేవారు. అంటే దాని అర్దం ఏమిటి? ఒకపక్క రాజధాని గ్రామాలలో భూముల రిజిస్ట్రేషన్ విలువ గజం ఐదువేల రూపాయలు కాగా, మార్కెట్ విలువ మాత్రం నలభై,ఏభై వేలకు ఉండేది. దాంతో సుమారు ముప్పైవేల నుంచి ముప్పై ఐదు వేల మేర బ్లాక్ మనీని చెల్లించి భూములు కొన్నారన్నమాట. పైగా భూములు అమ్మిన రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడానికి వీలుగా కేంద్రాన్ని ఒప్పించారు. ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని వేల కోట్ల నల్లధనం చలామణి అయిందని అంచనా. ఆ విషయాలు అన్నీ అప్పుడే అందరికి తెలుసు. చంద్రబాబు అప్పట్లో మోదీ ప్రభుత్వం నియమించిన నల్లధనం వ్యతిరేక కమిటీకి ఆధ్వర్యం కూడా వహించారు. చిత్రం ఏమిటంటే అమరావతిలో మొత్తం నల్లధనం వ్యాపారాన్ని ఆయనే ప్రోత్సహించారు. ఇప్పుడు సిఐడి విచారణలలో ఆధార సహితంగా బయటకు వస్తున్నాయి. ఒక్క నారాయణకు చెందిన షెల్ కంపెనీలే ఈ అస్సైన్డ్ భూములలో వెయ్యి కోట్ల నల్లధనం ఖర్చు చేసిందని అంచనా. ఈ లెక్కన మొత్తం జరిగిన లావాదేవీలలో ఎన్నివేల కోట్ల నల్లధనం చలామణి అయి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంతలో ప్రభుత్వం మారడంతో మొత్తం కధ అడ్డం తిరిగింది. వైసిపి ప్రభుత్వం అమరావతి భూ సమీకరణలో , ఇన్ సైడ్ ట్రేడింగ్ లో పెద్ద స్కామ్ లు జరిగాయని కేసులు పెట్టడం, టిడిపి నేతలు కోర్టు నుంచి రక్షణ పొందడం జరిగింది. గత మూడేళ్లుగా ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన టీడీపీ నేతలకు ఇది జీర్ణించుకోలేని విషయంగానే ఉంది. దానికి తోడు ఈ నల్లధనం వ్యవహారం ముందుకు వస్తే అది ఎటువైపు దారితీస్తుందన్న భయం వారిలో ఉంది. దానికి తగ్గట్లే నారాయణ సంస్థల బినామీ బాగోతాన్ని సిఐడి కనుగొంది. ఈ కేసు ముందుకు వెళుతుందా? లేక యధాప్రకారం కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటారా అన్నది చూడాల్సిందే. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
వేల ఎకరాల భూములు కొంతమంది చేతుల్లోనే: మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పూర్తిగా పక్కపెట్టేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. అక్కడ టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కొంతమంది చేతుల్లోనే పదివేల ఎకరాల అమరావతి భూములు ఉన్నాయని తెలిపారు. పరిటాల, పయ్యావుల, ధూళిపాళ్ల, కంభంపాటి సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు సేకరించారని పేర్కొన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కూడా 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని వెల్లడించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అప్పటి ప్రభుత్వం తిరస్కరించిందని వ్యాఖ్యానించారు. అమరావతిలోవి తాత్కాలిక నిర్మాణాలు.. వేల ఎకరాల భూములు కొంతమంది చేతుల్లోనే ఉన్నాయన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దళితులను భయపెట్టి అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు. కొందరి ఆస్తి విలువ పేంచేందుకు రాష్ట్ర మొత్తం పన్ను కట్టాలా? అని నిలదీశారు. అమరావతిలోఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బుగ్గన అన్నారు. బిల్డింగులు కడితే పరిపాలన సాగుతుందా అని ప్రశ్నించారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో భూముల కొనుగోలు జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పాదయాత్రలో స్థానికులు లేరని, రియల్ ఎస్టేట్ బ్యాచ్ చేస్తున్న పాదయాత్ర ఇదని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేదే సీఎం జగన్ ఆకాంక్ష అని తెలిపారు. చదవండి: (అశ్వనీదత్, రాఘవేంద్రరావు కోరుకున్న చోట భూములు: కొడాలి నాని) -
అది వంద మందిదే.. అందరిదీ కాదు.. ఢిల్లీ ఎక్కడుంది
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): అన్ని వర్గాల భాగస్వామ్యం లేని అమరావతి రాజధాని ఎలా అవుతుందని రాయలసీమ మేధావుల ఫోరం ప్రశ్నించింది. రాజధాని ఏర్పాటు సమయంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను గత సర్కారు విస్మరించిందని పేర్కొంది. అమరావతిలో 50 నుంచి వంద మంది వ్యక్తం చేసే అభిప్రాయం రాçష్టం మొత్తానికి వర్తిస్తుందా? అని నిలదీసింది. అమరావతి రైతుల పేరుతో చేపట్టిన ఉద్యమంలో నిజాయితీ లేదని, కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే ఉందని ఫోరం స్పష్టం చేసింది. అది ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నాయకులు, ప్రజాభిమానాన్ని కోల్పోయిన పార్టీలు నడిపిస్తున్న పెయిడ్ ఉద్యమమని విమర్శించింది. అమరావతి రైతుల పేరిట రాయలసీమ వాసులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించింది. రాయలసీమకు హైకోర్టు వద్దని అడ్డుపడుతున్న వారు ఎస్వీయూలో బహిరంగ సభ నిర్వహిస్తామంటే ఎలా అనుమతిస్తామని సూటిగా ప్రశ్నించింది. తిరుపతిలో సభ నిర్వహించేందుకు వీలు లేదని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఫోరం ప్రకటించింది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అందరూ స్పందించాలని, ఈ అంశంపై బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్తామని ఫోరం ప్రకటించింది. శ్రీకాళహస్తి, పుత్తూరు, ఎస్వీ యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను జాగృతం చేస్తామని స్పష్టం చేసింది. ‘ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచన – రాయలసీమ ప్రజల మనోగతం’ అనే అంశంపై రాయలసీమ మేధావుల ఫోరం మంగళవారం ఎస్వీయూలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీ ఎక్కడుంది? ‘రాజధాని నడిబొడ్డున ఉండాలన్న నిబంధన ఎక్కడుంది? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉందా?’ అని ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆధారంగా ఏమూల నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. తమిళనాడు నుంచి రాయలసీమకు వస్తున్న పెట్టుబడులను గత ప్రభుత్వం అడ్డుకుని అమరావతిలోనే పెట్టాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసని చెప్పారు. డబ్బులు వెదజల్లి రెచ్చగొట్టే యత్నాలు.. అమరావతి ఒక వర్గానికి సంబంధించిన రాజధాని అని ప్రొఫెసర్ ఎ.సుధాకరయ్య పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఉంటే అమరావతి రైతులకు వచ్చే నష్టం ఏమిటని ప్రొఫెసర్ నాగోలు కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరిట డబ్బులు వెచ్చించి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు జరుగుతున్న కుట్రని చెప్పారు. రాయలసీమలో ఎక్కడ సభ తలపెట్టినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటును ఏనాడు ప్రశ్నించలేదని ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. కోస్తా ప్రజలకు రాజధాని అడిగే హక్కు న్యాయపరంగా, నైతికంగా లేదన్నారు. తాము ఉత్తరాంధ్రతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామన్నారు. సీమవాసుల మద్దతు దుష్ప్రచారమే.. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులు అమరావతికి మద్దతిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీమ ప్రజలు తమ ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నట్లు నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తిరస్కరించిన ఒకరిద్దరు నాయకులు మినహా ఎవరూ అమరావతి ఉద్యమాన్ని అంగీకరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే మోసానికి గురై మద్రాస్, కర్నూలు నుంచి రాజధాని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే దక్కాలని స్పష్టం చేశారు. ఇక్కడ గ్రామీణ వాతావరణం గల పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి రైతులు రాజధానికి భూములు త్యాగం చేశారని కొందరు నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, వ్యాపారమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావాలని గతంలో బీజేపీ, వామపక్షాలు ఒప్పుకున్నాయని, రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గత సర్కారు పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలోసీమకు మెడికల్ సీట్లు రాకుండా నష్టం కలిగించిందని, దీనిపై ఉద్యమిస్తే అడ్డుకుందని గుర్తు చేశారు. -
అమరావతిని నిర్ణయించింది రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు
సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక, శాసన, న్యాయ రాజధానుల ఏర్పాటు నిర్ణయం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టుకు నివేదించారు. ప్రజాప్రయోజనాల నిమిత్తం రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం తగదన్నారు. ఈ నిర్ణయాన్ని ఆపే దిశగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్ధించారు. పలు రంగాల్లో నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి, వారిచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కానీ అమరావతిని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కలసి రాజధానిగా నిర్ణయించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధానిపై ఏర్పాటైన మంత్రి నారాయణ కమిటీలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, అధికారులు తప్ప.. నిపుణులు లేనేలేరన్నారు. ఏపీ పునర్విభజన చట్టప్రకారం నిపుణులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని, కానీ గత ప్రభుత్వం ఈ చట్టబద్ధ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకుందని వివరించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికివ్వడానికి ముందే.. అమరావతిని రాజధానిగా నిర్ణయించేసిందన్నారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న దుష్యంత్ దవే.. బుధవారం రెండోరోజు తన వాదనలు కొనసాగించారు. రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వాల పరిధిలోనిదని, ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధముండదని వివరించారు. గతంలో ఏర్పాటైన రాజధానుల విషయంలో కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. కోర్టులు ఇందులో జోక్యం చేసుకుంటే.. అది రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడమే అవుతుందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ గుంటూరు–కృష్ణా జిల్లాల మధ్య రాజధాని వద్దని స్పష్టంగా చెప్పిందని దవే తెలిపారు. అయితే ఈ కమిటీ సిఫారసుల్ని బేఖాతరు చేస్తూ గత ప్రభుత్వ పెద్దలు తమ స్వప్రయోజనాలకోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. నిపుణులతో కూడిన కమిటీ రాజధానిని నిర్ణయించివుంటే.. పరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు కలసి రూ.లక్ష కోట్ల రాజధానిని నిర్ణయించారన్నారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించేందుకు సహేతుక కారణాలు ఏవీ లేవన్నారు. అమరావతి నిర్ణయం ఎలా జరిగిందో కోర్టు తెలుసుకోవాలి... అనంతరం ఏజీ శ్రీరామ్ వాదనలు ప్రారంభిస్తూ.. అమరావతి పట్టణానికి, రాజధానిగా నిర్ణయించిన అమరావతికి సంబంధం లేదన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. అసలు అమరావతి నిర్ణయం ఎలా జరిగిందో, అందులో ఎవరెవరు పాలుపంచుకున్నారో ఈ కోర్టు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. ఏజీ తదుపరి వాదనల నిమిత్తం ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
అమరావతి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధా?
సాక్షి, అమరావతి: కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి ఎలా అవుతుందని, ఈ విషయంలో చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాదులు యర్రంరెడ్డి నాగిరెడ్డి, చొక్కారెడ్డి శివారెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. అమరావతి అభివృద్ధిని రాష్ట్రాభివృద్ధిగా చెప్పుకుంటూ పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను వ్యతిరేకించే వారు రాష్ట్రాభివృద్ధి నిరోధకులు అవుతారన్నారు. రాజధాని పేరుతో గత సర్కారు అభివృద్ధిని మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతం చేసిందని, దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ తీవ్రంగా ప్రభావితమయ్యాయని కోర్టుకు నివేదించారు. ఏపీ పునర్విభజన చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఉత్తరాంధ్ర, రాయలసీమను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధి కోసం పలు సూచనలు, సిఫారసు చేసిందని తెలిపారు. గత సర్కారుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటుతనం కనిపించలేదని, శివరామకృష్ణన్ కమిటీ సూచనలను బుట్ట దాఖలు చేసిందని నివేదించారు. కమిటీ నివేదికను అమలు చేసి ఉంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేదన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలతో పాటు ఇతర అంశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఇందులో తమను ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలంటూ రాయలసీమకు చెందిన హైకోర్టు న్యాయవాది చొక్కారెడ్డి శివారెడ్డి, శ్రీకాకుళంకు చెందిన న్యాయవాది పీసా జయరాం, మరికొందరు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా శివారెడ్డి, నాగిరెడ్డిలు తమ వాదనలను వినిపించారు. ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు ఇవీ.. ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా గత సర్కారు వ్యవహరించింది. సారవంతమైన భూములున్న కృష్ణా–గుంటూరు మధ్య రాజధాని వద్దని చెప్పినందుకే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గత ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయాలని, అమరావతిని రాజధానిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో గతంలో దాఖలైన పిల్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. సుప్రీంకు గత సర్కారు తప్పుడు అఫిడవిట్.. గత సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్ కారణంగా నేడు న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైకోర్టు భవన నిర్మాణం పూర్తైందంటూ ఇచ్చిన తప్పుడు అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు విశ్వసించి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.తీరా హైకోర్టు విభజన జరిగిన తరువాత విజయవాడలోని ఓ చిన్న భవనంలో హైకోర్టును ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. ఆ తప్పిదాలను ఈ ప్రభుత్వం సరిదిద్దుతోంది... గత సర్కారు చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దే చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తెచ్చింది. ఒకవేళ వీటిని న్యాయస్థానం కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే రెండు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ప్రభావితమై నష్టపోతారు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో మమ్మల్ని ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలని అభ్యర్థిస్తున్నాం. మధ్యలో జోక్యం చేసుకోవద్దు..! విచారణ సందర్భంగా కొందరు న్యాయవాదులు పదే పదే జోక్యం చేసుకుంటుండటంతో.. చేతులు వంచి దండం పెడతామని, ఇలా మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, లేదంటే ఈ వ్యాజ్యాల్లో విచారణ ముందుకెళ్లడం సాధ్యం కాదని ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌కు నోటీసులు... అమరావతి కోసం ఇప్పటి వరకు చేసిన వ్యయాల వివరాలను అందచేసేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని హైకోర్టు అనుమతిస్తూ నోటీసులు జారీ చేసింది. ఓ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్, పలువురు మంత్రులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. శుక్రవారానికి వాయిదా వేసిన పలు వ్యాజ్యాలపై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
‘అమరావతి’ నిర్ణయం ఏకపక్షం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధానిని నిర్ణయించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనల కింద అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను గత తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కిందని న్యాయవాది శివారెడ్డి హైకోర్టుకు నివేదించారు. విజయవాడ–గుంటూరులో రాజధాని వద్దని ఆ కమిటీ చెప్పినప్పటికీ, టీడీపీ సర్కారు మాత్రం ఏకపక్షంగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించిందని వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కోరలేదన్నారు. రాజధాని కోసం మంచి పంటలు పండే భూములు తీసుకోవద్దని, ప్రభుత్వ భూములను మాత్రమే రాజధాని కోసం వినియోగించాలని అప్పటి ప్రతిపక్ష నేత అసెంబ్లీ వేదికగా నాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. అవసరం లేకున్నా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా 34 వేల ఎకరాలను సమీకరించిందని శివారెడ్డి అందులో వివరించారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ కూడా పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలంటూ శివారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆది నుంచి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే వస్తోందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. రాయలసీమ వాణిని పట్టించుకోలేదు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంతవాసులు, న్యాయవాదుల ఆందోళనలను గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయనన్నారు. అప్పటి ప్రభుత్వం హడావుడిగా రాజధానిని, హైకోర్టును అమరావతికి తరలించి, తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలను ప్రారంభించడం చట్ట నిబంధనలకు విరుద్ధమే కాక, ఏకపక్ష నిర్ణయమన్నారు. కేవలం రెండు జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధిని విస్మరించడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం పాలనా వికేంద్రీకరణ బిల్లులను తీసుకొచ్చిందని శివారెడ్డి అందులో వివరించారు. అందులో భాగంగానే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం సంకల్పించిందన్నారు. రాయలసీమ వాసిగా పాలనా వికేంద్రీకరణవల్ల తాను లబ్ధి పొందుతానని.. అందువల్ల ఈ వ్యాజ్యంలో తన వాదనలు వినాల్సిన అవసరముందని ఆయన వివరించారు. మెమోలు దాఖలు చేసిన కేంద్రం మరోవైపు.. రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వ్యవహారమే తప్ప, అందులో తమకు ఎటువంటి పాత్ర లేదంటూ తాము దాఖలు చేసిన కౌంటర్‌ను అన్ని వ్యాజ్యాలకు అన్వయింపజేస్తున్నామని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ మెమోలు దాఖలు చేశారు. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఈ మెమోలు దాఖలు చేసింది. -
వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం
సాక్షి, అమరావతి: ‘‘పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రం సర్వ సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. సమగ్రాభివృద్ధి అంటే.. ఒకే చోట మహానగరాలు నిర్మించడం కాదు.. రక్షిత తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం.. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను పూర్తిగా రూపుమాపవచ్చు.. ఇది అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలలో, రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీలు ఉన్నాయి.’’ ఇవి చెప్పింది ఒకటి కాదు రెండు కాదు మూడు కమిటీలు. శివరామకృష్ణన్ కమిటీ, జీఎన్.రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) ఇవే విషయాలను నివేదికల రూపంలో అందించాయి. మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో ఆ కమిటీలు చెప్పిన ముఖ్యమైన అంశాలను ఓ మారు పరిశీలిద్దాం.. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే.. విభజన తర్వాత రాష్ట్ర రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది. పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తుందని తేల్చిచెప్పింది. కమిటీ సిఫార్సులివి.. ► రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్న నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైనది కాదు. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. ► శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి. ► విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం వాటిల్లుతుంది. పర్యావరణానికీ విఘాతం కలుగుతుంది. ► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే ప్రతికూల పరిణామాలనెదుర్కోవాల్సి ఉంటుంది. ► విజయవాడ–గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కూడా. నేల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. జీఎన్ రావు కమిటీ ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేయడానికి రిటైర్డు ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదిక ఇచ్చింది. జీఎన్ రావు కమిటీ చేసిన సిఫార్సులు ఇవీ.. ► శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలి. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. ► అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. ► అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. ► అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే వి«షయాన్ని ప్రభుత్వానికి సూచించాం. ► రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. ► రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బీసీజీ ఏం చెప్పిందంటే సీఎం వైఎస్ జగన్‌కు నివేదిక అందిస్తున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ► ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉంటేనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. ► చాలా మంది ప్రజలు మండలం దాటి సచివాలయానికి రారు. సచివాలయానికి వచ్చే వారిలో పైరవీలు లేదా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారే ఎక్కువ. (ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తదు) ► ఆంధ్రప్రదేశ్ అప్పు ఇప్పటికే 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల కోట్ల నుంచి 1.20 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది భారం. ► అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95 శాతంపైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాలి. ఇందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతలా అప్పు చేయడం వల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు నిధులుండవు. ► అమరావతి నగరంలో రూ.లక్ష కోట్లు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటికి పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. ► ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కూడా విఫలం చెందాయి. ఇందులో కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50 శాతం సాధించాయి. మిగతా మెగా సిటీలన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయి. -
మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) నివేదికలన్నీ పరిపాలన వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపాయి. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థలు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశాయి. గత ప్రభుత్వం రూపొందించిన అమరావతి మెగా సిటీ నిర్మాణం సాధ్యం కాదని, మెగా సిటీల నిర్మాణం కాన్సెప్ట్ ప్రపంచంలో విఫలమైందని ఉదాహరణలతో వివరించాయి. అమరావతి మెగా సిటీ నిర్మాణ ప్రణాళిక కూడా విఫల ప్రయోగమేనని స్పష్టం చేశాయి. అత్యధిక శాతం ప్రజలు పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్న తరుణంలో మూడు కమిటీల సిఫార్సులు క్లుప్తంగా.. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులు - రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది. ఏకైక అతిపెద్ద రాజధాని నగరం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కాదని స్పష్టం చేసింది. గ్రీన్ సిటీ నిర్మాణం సాధ్యాసాధ్యాల మీదా విస్తృతంగా పరిశీలించింది. గ్రీన్ సిటీ నిర్మాణం రాష్ట్రానికి భారంగా పరిణమిస్తుందని అభిప్రాయపడింది. పాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. ఈ కమిటీ ఇంకా ఏమి సిఫారసు చేసిందంటే.. - విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. - ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. - శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి. - విజయవాడ – గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం కలుగుతుంది. పర్యావరణానికీ ఇబ్బంది కలుగుతుంది. - స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. జీఎన్ రావు కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు.. - శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళంలో ఉండే పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ సమస్యా ఉండదు. - అమరావతి ప్రాంతంలో కొంత వరద ముంపునకు గురవుతుంది. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. - మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ పరంగా సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్టుమెంట్లు నిర్మించాలి. - అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటిని మార్చి, ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యాకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంభించాలి. - రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలి. - రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరులను పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. - వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించరాదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు సిఫార్సులు.. - పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులభంగా పౌర సేవలు అందుతాయి. - ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. సచివాలయానికి ఏడాదిలో మొత్తం లక్ష మంది వస్తే అందులో 75 శాతం మంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు. మిగతా వారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు, బిల్లులకోసం వచ్చే వారే. - ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15–16 శాతం జనాభా వృద్ధి చెందితేనే 2045 నాటికి అమరావతి నుంచి రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌లలో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధి రేటు 2 నుంచి 7 శాతం మాత్రమే ఉంది. - ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 సంవత్సరం వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ విఫలమయ్యాయి. కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50% సాధించాయి. మిగతావన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతం కూడా చేరుకోలేదు. - అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు పోలవరం – బొల్లాపల్లి– బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా 90 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. అదే జరిగితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.150 లక్షల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. -
వికేంద్రీకరణే మేలు.. ఎలుగెత్తిన గళాలు
-
వికేంద్రీకరణే మేలు.. ఎలుగెత్తిన గళాలు
‘అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలా.. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా.. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధికి బాటలు పడుతుంటే అడ్డుకుంటారా.. మీ స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం కావాలా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలు విరుచుకుపడ్డారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, బీఎన్ రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు మేలు కలుగుతుందని నినదిస్తూ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అంతా ఒక్కటై కదం తొక్కారు. శనివారం పలుచోట్ల ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఒంగోలు సిటీ: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, శివరామకృష్ణన్, బీఎన్ రావు కమిటీలతోపాటు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను అమలు చేయాలని కోరుతూ ఒంగోలు ప్రజలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చారు. ర్యాలీకి సంఘీభావం తెలిపిన రాష్ట్ర ఇంధన, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాజధానిని అమరావతికే పరిమితం చేయాలంటూ రైతులను, ప్రజలను రెచ్చగొట్టి కపట నాటకాలు ఆడుతున్న చంద్రబాబు వాటికి ఇకనైనా తెరదించాలని సూచించారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు. కదం తొక్కిన గిరిజనులు పాయకరావుపేట/పాడేరు: విశాఖ జిల్లా పాయకరావుపేట, పాడేరులో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక కేంద్రం ఏర్పాటును స్వాగతించాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా అందరి పైనా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, పాడేరు మండలం వనుగుపల్లిలోనూ గిరిజనులు భారీ ర్యాలీ జరిపారు. ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్బ నరసింగరావు పాల్గొన్నారు. ఆస్తుల్ని కాపాడుకునేందుకే చంద్రబాబు రాద్ధాంతం మదనపల్లె/నగరి (చిత్తూరు జిల్లా): అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా మదనపల్లె, నగరిలో మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. వారికి ఎమ్మెల్యే నవాజ్‌బాషా, సినీ దర్శకులు, ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమరావతిలో రైతులను మోసగించి కొన్న భూములు, ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్ జగన్ ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు. సెల్వమణి మాట్లాడుతూ గతంలో రాజధాని పేరిట మద్రాసు, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందన్నారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని జిల్లాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి హిందూపురం: పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని మహిళలు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు నినదించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ వికేంద్రీకరణ చేస్తేనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని నిపుణుల కమిటీలు, విశ్లేషకులు చెబుతున్నారని, ఆ దిశగానే ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని వివరించారు. అమరావతిలో టీడీపీ నేతలు సాగించిన రియల్ బాగోతం త్వరలోనే బట్టబయలవుతుందన్నారు. ‘సీమ ద్రోహులను అడుగుపెట్టనివ్వం’ కర్నూలు (సెంట్రల్): అమరావతి పేరుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎవరైనా యాత్రలంటూ రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు రవికుమార్ హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. లక్షల కోట్లు దోచుకుని జోలె పడతారా.. శ్రీకాకుళం: శ్రీకాకుళం, టెక్కలి, శ్రీకాకుళం, జి.సిగడాం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడిచినా ఉత్తరాంధ్ర నేటికీ వెనుకబడి ఉందన్నారు. రూ.లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు రాజధాని పేరుతో జోలెపట్టి భిక్షాటన చేయడం సిగ్గు చేటన్నారు. ర్యాలీల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ పాల్గొని మద్దతు తెలిపారు. సమతుల అభివృద్ధి కోరుతూ.. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: నిపుణుల కమిటీల సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమతుల అభివృద్ధి చెందేలా వికేంద్రీకరణ చేపట్టాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లాలో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. కాకినాడలో ప్రదర్శనకు ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని బాలాంత్రం గ్రామం, కాకినాడ భానుగుడి సెంటర్, అనపర్తి తదితర ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. సాగర తీరంలో కదం తొక్కిన విద్యార్థులు బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని విద్యార్థులు నినదించారు. హార్బర్ ఇంటర్నేషనల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు సాగర తీరంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల రాజధానులతో పోటీపడే స్థాయి మన రాష్ట్రంలో విశాఖపట్నానికి మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు. మేధావుల నిర్ణయం మేరకే వికేంద్రీకరణ సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తణుకు, అత్తిలి, ఇరగవరం ప్రాంతాల్లో శనివారం ప్రదర్శనలు జరిగాయి. కొవ్వూరులో కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరై మద్దతు తెలిపారు. తణుకు, ఇరగవరంలో నిర్వహించిన ర్యాలీల్లో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అనువైనది విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన చర్చాగోష్టిలో మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అనువైనదని వక్తలు పేర్కొన్నారు. పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో జరిగిన ర్యాలీలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మద్దతు ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్య వేదిక విజయనగరం కోట జంక్షన్లో ర్యాలీ నిర్వహించింది. మూడు రాజధానుల విషయంలో అడుగులు ముందుకే..: మంత్రి కొడాలి నాని గుడివాడ: చంద్రబాబు, ఎల్లో మీడియా డాంబికాలకు భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. స్థానిక కే కన్వెన్షన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలన వికేంద్రీకరణ విషయంలో మూడు కమిటీల అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని, ఇక అడుగులు ముందుకే పడతాయని స్పష్టం చేశారు. రైతులు చర్చలకు సిద్ధమైతే తాను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి నష్టం జరగకుండా చూస్తానన్నారు. విభజన సమయంలో రాష్ట్రం రూ.90 వేల కోట్ల అప్పుల్లో ఉందని, చంద్రబాబు పాలనలో మరో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాజధాని పేరుతో చంద్రబాబు ఒక కులాన్ని, వర్గాన్ని, డబ్బా మీడియాను వెనకేసుకుని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం ఉంది కదా అని అభివృద్ధిని అమరావతికే పరిమితం చేసి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి సీఎం వైఎస్ జగన్‌పై పడిందన్నారు. సమావేశంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమంగా అభివృద్ధి చెందుతాయి. రాజధాని ఒక ప్రాంతంలోనే ఉంటే అభివృద్ధి మొత్తం ఆ ప్రాంతానికే పరిమితమవుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఒక్కచోటే పోస్తే మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. ప్రభుత్వ నిర్ణయానికి ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఉంటుంది. – చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, ఏపీ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సీమ అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదు పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. చంద్రబాబు హయాంలో సీమ అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలంకాదని పలువురు నిపుణులు చెప్పినా.. పెడచెవిన పెట్టారు. అక్కడే రాజధాని ఏర్పాటు చేసి.. నేడు కొందరికి మద్దతు తెలపడం శోచనీయం. పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. –బొజ్జ దశరథరామిరెడ్డి, జాతీయ రైతు సంఘాల సమాఖ్య కార్యదర్శి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపుతూ చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టారు. కక్ష పూరిత చర్యలతో మరోసారి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడడం చంద్రబాబు రాజనీతికి నిదర్శనం. పాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. సీమ వాసిగా ఉండి తన 15 ఏళ్ల పాలనలో సీమ అభివృద్ధికి ఏనాడూ చర్యలు తీసుకోని బాబు.. నేడు రాయలసీమలో రాజధానులపై ర్యాలీ చేయడం విడ్డూరం. –డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉండదు. పరిపాలనా వికేంద్రీకరణను వేళ్ల మీద లెక్కించే కొందరే వ్యతిరేకిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారే ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మద్దతిస్తోంది. – చల్లా జయశంకరరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు సీఎం నిర్ణయం అభినందనీయం రాష్ట్రంలో మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకోవడంతో పాటు హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం హర్షణీయం. విశాఖలో సుమారు రెండు లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.. వీరిలో ఎవరికైనా హైకోర్టులో అప్పీల్ చేయాల్సి వస్తే ఇక్కడ హైకోర్టు బెంచ్ అవసరం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలనా వికేంద్రీకరణకు పూనుకోవడం అభినందనీయం. – ప్రభుత్వ నిర్ణయానికి సంఘీభావ సభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు పెంటకోట చంద్రరావు -
రాజధానికి దూరమైనా.. అభివృద్ధికి దగ్గరే
రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలంటూ విష ప్రచారం చేస్తున్న కొందరికి.. అసలు దేశ రాజధాని ఎక్కడుందో? ఏయే రాష్ట్రాలకు ఎంత దూరంలో ఉందో తెలుసా? పక్కనున్న మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల రాజధానులు ఆయా జిల్లా కేంద్రాలకు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసా? అంతెందుకు మొన్నటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని హైదరాబాద్‌కు, శ్రీకాకుళానికి మధ్య దూరం ఎంతో గుర్తుందా? సెకన్ల వ్యవధిలో ఖండాంతరాలు దాటేలా సమాచార విప్లవం ఇవాళ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇ–ఫైళ్లు, ఇంటర్నెట్, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్.. ఇలా పేరేదైనా కావచ్చు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్, ప్రైవేట్ కార్యాలయాలు క్షణాల్లో సమాచారాన్ని అటూ ఇటూ.. ఇటూ అటూ బట్వాడా చేసేస్తున్నాయి. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య దూరం అనేది అభివృద్ధిపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. మౌలిక వసతుల కల్పన, ప్రకృతి వనరుల సద్వినియోగంపై మాత్రమే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుందని ఎన్నో నగరాల చరిత్ర చెబుతోంది. మన పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోని అత్యధిక జిల్లాలు రాజధాని నగరానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో పయనిస్తుండటం గమనార్హం. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో సత్వర ప్రాంతీయ సమగ్రాభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులు వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశాయి. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాయి. శాసన, న్యాయ, పరిపాలన రాజధానులు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పరచవచ్చని నివేదించాయి. దీనిపై ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు నానా యాగీ చేస్తున్నాయి. ప్రజల్ని తప్పుదారి పట్టించి ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించేందుకు కుట్రకు తెరతీశాయి. మరోవైపు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉండాలని వితండవాదనను లేవనెత్తుతున్నాయి. అసలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? దేశ రాజధానికి దగ్గరగా ఉండటానికి – అభివృద్ధికి సంబంధం ఉందా? అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దేశ రాజధానికి ఎంత దూరంలో ఉన్నాయి? అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అత్యధిక జిల్లాలకు ఆ రాష్ట్ర రాజధాని ఎంత దూరంలో ఉంది? మొదలైన అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సూచీ నివేదిక కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని సమీపంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆ నివేదిక తేల్చి చెప్పింది. దేశ రాజధానికి దూరంగా ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీకి సమీపంలో ఉన్న రాష్ట్రాలు వెనుకబడే ఉన్నాయి. మరోవైపు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మెజార్టీ జిల్లాలు ఆ రాష్ట్రాల రాజధానులకు దూరంగానే ఉండటం గమనార్హం. – సాక్షి, అమరావతి నంబర్ వన్ కేరళ.. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సూచీ నివేదిక–2019 ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఢిల్లీకి 2,814 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం రాజధానిగా ఉన్న కేరళ సమగ్రాభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఢిల్లీకి కేవలం 497 కిలోమీటర్ల దూరంలో లక్నో రాజధానిగా ఉన్న ఉత్తరప్రదేశ్ 23వ స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఢిల్లీకి దూరంగా ఉన్న తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. వాటికంటే దేశ రాజధానికి ఎంతో సమీపంలో ఉన్న బిహార్ చిట్టచివరి స్థానానికి పడిపోయింది. సమగ్రాభివృద్ధి సూచీ టాప్–10 జాబితాలో ఢిల్లీకి సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క హిమాచల్‌ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు చోటే లేకుండాపోయింది. దేశ రాజధానికి అత్యంత దూరంలో ఉండే సిక్కిం.. పెద్ద రాష్ట్రాలను తోసిరాజని ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆ రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్ ఢిల్లీకి 1,598 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి రాజధానికి దగ్గరగా ఉన్నామా.. దూరంగా ఉన్నామా.. అన్నదానికీ, అభివృద్ధికి సంబంధం లేదని నీతి ఆయోగ్ నివేదికే స్పష్టం చేస్తోంది. పరిపాలనా దక్షత, నిబద్ధత ఉంటే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరిస్తోంది. ఐక్యరాజ్య సమితి ప్రమాణాల ప్రాతిపదికగా నీతి ఆయోగ్ నివేదిక సమగ్రాభివృద్ధికి ఐక్యరాజ్యసమితి(ఐరాస) నిర్ణయించిన 17 ప్రమాణాల ఆధారంగా నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ప్రధానంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల ప్రాతిపదికన గరిష్టంగా 100 పాయింట్లతో సమగ్రాభివృద్ధి సూచీని నిర్ణయించారు. అందులో 65 నుంచి 99 మధ్య పాయింట్లు సాధించిన రాష్ట్రాలు ప్రగతిపథంలో ముందుండగా, 50 నుంచి 64 పాయింట్లు సాధించిన రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనపరిచినవిగా.. .0 నుంచి 49 పాయింట్లు సాధించిన రాష్ట్రాలు ఆశావహ (అంటే ఇంకా పనితీరు మెరుగుపరచుకోవాల్సిన) రాష్ట్రాలుగా నిర్ణయించింది. కేరళ 70 పాయింట్లు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. 69 పాయింట్లతో హిమాచల్‌ప్రదేశ్ రెండో స్థానంలో, 67 పాయింట్లతో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. కర్ణాటక 66 పాయింట్లతో నాలుగో స్థానం, గోవా, సిక్కిం 65 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా మహారాష్ట్ర, గుజరాత్ 64 పాయింట్లతో ఆరో స్థానం సాధించాయి. సమగ్రాభివృద్ధి సూచీలో అగ్ర స్థానంలో ఉన్న పది రాష్ట్రాల్లో తొమ్మిది అంటే కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్ దేశ రాజధాని ఢిల్లీకి దూరంగా ఉన్నవే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్క హిమాచల్‌ప్రదేశ్ మాత్రమే సమీపంలో ఉంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్ 23వ స్థానంలో, బిహార్ చివరి స్థానంలో ఉండటం గమనార్హం. నీతి ఆయోగ్ నివేదిక మరికొన్ని అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించింది. పేదరిక నిర్మూలనలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం మెరుగైన పనితీరు కనబరిచాయని పేర్కొంది. ఇక జీరో హంగర్ (ఆకలి సమస్యను పరిష్కరించడం)లో గోవా, మిజోరం, కేరళ, నాగాలాండ్, మణిపూర్ మొదటి స్థానంలో నిలిచాయి. ఈ రాష్ట్రాలన్నీ ఢిల్లీకి దూరంగా ఉన్నవే కావడం గమనార్హం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి దేశంలో అభివృద్ధి పథంలో ముందున్న అత్యధిక రాష్ట్రాల్లో రాజధానులు ఆ రాష్ట్రాల్లోని మెజార్టీ జిల్లాలకు దూరంగానే ఉన్నాయన్నది అక్షర సత్యం. యావత్ రాష్ట్రం అభివృద్ధికి చోదకశక్తిగా పని చేసేందుకు అత్యంత అనుకూలంగా ఉన్న నగరాలనే రాజధానులుగా ఎంపిక చేశారు. అంతేగానీ రాష్ట్రానికి మధ్యలో ఉందా.. అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉందా.. అని స్కేల్ పట్టుకుని కొలిచి రాజధానులను నిర్ణయించలేదని పరిశీలకులు చెబుతున్నారు. అప్పటికే తగిన మౌలిక వసతులతో ఉన్న నగరాలను రాజధానులుగా చేసుకుని రాష్ట్రం మొత్తం అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కృషి చేశారు. అంతేగానీ ఎక్కడో ఖాళీ భూముల్లో రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పేరిట భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ లేదు. తమిళనాడుకు ఉత్తరాన చిట్టచివరన ఆ రాష్ట్ర రాజధాని చెన్నై ఉండగా అత్యధిక జిల్లాలు ఆ నగరానికి సుదూరంగా ఉన్నాయి. కర్ణాటకలో తూర్పు దిశలో ఏపీ సరిహద్దుకు సమీపంలో ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు ఉండగా మెజార్టీ జిల్లాలు పశ్చిమ వైపున దూరంగా అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్రలో మెజార్టీ జిల్లాలు ఆ రాష్ట్రానికి మధ్య, దక్షిణ, తూర్పు దిక్కున ఉండగా రాజధాని ముంబై మాత్రం పశ్చిమాన చిట్టచివరగా అరేబియా సముద్ర తీరంలో ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురం ఆ రాష్ట్రానికి దక్షిణాన చిట్టచివరలో అరేబియా సముద్ర తీరంలో ఉండగా.. మెజార్టీ జిల్లాలు ఉత్తర, పశ్చిమాలుగా విస్తరించి ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. సమగ్రాభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కాబట్టి రాజధాని అన్నది అన్ని జిల్లాలకు సమాన దూరంలో రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలనడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉన్న మధ్యప్రదేశ్, లక్నో అభివృద్ధి సాధించలేకపోయాయని కూడా గుర్తు చేస్తున్నారు. వికేంద్రీకరణతో సొంతూళ్లలోనే సమస్యల పరిష్కారం సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల ద్వారా సొంతూళ్లోనే సమస్యలు పరిష్కారమవుతున్నప్పుడు ఎవరికైనా అదే పనిగా రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? అలాగే ముఖ్యమంత్రి, మంత్రులు, సచివాలయం, హెచ్‌వోడీ(విభాగాధిపతుల కార్యాలయాలు)ల వద్ద సాధారణ ప్రజలకు పని ఉండే అవకాశాలు చాలా తక్కువ..! ఈ నేపథ్యంలో సదుపాయాలను బట్టి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా ప్రజలెవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని సామాజికవేత్తలు, మేధావులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ కేపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడీషియల్ కేపిటల్), అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్లను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకు పరిపాలన వికేంద్రీకరణ జరిగి సమ న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. అమరావతిలో ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడటం ద్వారా.. తక్కువ ధరలకే కాజేసిన వేలాది ఎకరాల భూముల ధరలు పెంచుకోవడానికే పచ్చదండు రాజధాని గ్రామాల రైతుల పేరుతో ఉద్యమాలను చేస్తోందని విమర్శిస్తున్నారు. రాజధాని, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై పశ్చిమతీరాన అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుంది. ఆ రాష్ట్రంలో గోండియా జిల్లా కేంద్రానికి ముంబైకి మధ్య దూరం 1,060 కి.మీలు. గడ్చిరోలి జిల్లా కేంద్రానికీ ముంబైకి మధ్య దూరం 942 కి.మీలు. తమిళనాడు రాజధాని చెన్నైకి ఆ రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన కన్యాకుమారి మధ్య ఉన్న దూరం 718 కి.మీలు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో రాజధాని నగరాలకు కొన్ని జిల్లాలకు మధ్య దూరం ఎక్కువ. కానీ ఆ రాష్ట్రాల్లో రాజధాని అంశంపై సామాన్య ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతగానీ, ఇబ్బందులుగానీ ఉత్పన్నం అయిన దాఖలాలు లేవని మేధావులు గుర్తు చేస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ.. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరించిన విషయం తెలిసిందే. దాదాపు 534 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించడానికి శ్రీకారం చుట్టారు. అంటే.. గ్రామాల్లో నివసించే ప్రజలు సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకే వెళ్లాల్సిన అగత్యం ఇక ఉండదు. పట్టణ ప్రజలూ అంతే. అలాంటప్పుడు సమస్యల పరిష్కారం కోసం రాజధానికి వెళ్లాల్సిన అవసరం వారికి ఏముంటుందని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. -
పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి
-
అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు
‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? సామాజిక న్యాయం జరగకూడదనుకుంటున్నారా? అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలన్నదే మీ ఉద్దేశమా? వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందంటే అడ్డుపడతారా? మీ స్వార్థం కోసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అభివృద్ధి అంతా అమరావతిలోనే జరగాలనడం న్యాయమా? ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ మీరు చేసిందేమిటి? రాష్ట్రాభివృద్ధి గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? గ్రాఫిక్స్‌తో చుక్కలు చూపించడం తప్ప ఏం చేశారు? ఇన్సైడర్ ట్రేడింగ్‌తో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సృష్టించుకోవడం తప్ప సామాన్య ప్రజానీకానికి ఏ విధంగానైనా లబ్ధి కలిగించారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయనకు వంతపాడుతున్న ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, జీఎన్‌రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘మీ హయాంలో ఎవరికీ మేలు చేయలేదు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుణ్యమా అని మేలు జరగబోతుంటే సైంధవుడిలా అడ్డుపడుతున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. బాబు తీరును నిరసిస్తూ అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. తీరు మారకపోతే మా ప్రాంతాల్లో అడుగు పెట్టలేరంటూ హెచ్చరించారు. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం సబబుకాదని హితవు పలికారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేయాలన్న నినాదాలు హోరెత్తాయి. నగరంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు జిల్లా అంతటా శుక్రవారం భారీ ర్యాలీలు జరిగాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ అన్నివర్గాల ప్రజలు నినదించారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలు ర్యాలీ జరిపారు. అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, గాజువాక, మాడుగుల నియోజకవర్గాల్లో ప్రజలు కదం తొక్కారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పరిసరాల్లో తన బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి వదరయ్యపాళెం/పలమనేరు/శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా సత్యవేడులో మహిళలు, విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మూడు రోడ్ల కూడలిలోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పూతలపట్టు తదితర నియోజకవర్గాల్లో ర్యాలీలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. సత్యవేడులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే.. చంద్రబాబుకు వచ్చిన బాధేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే కళావతి అన్నింటికీ అమరావతే అనడం సరికాదు పాలన వికేంద్రీకణ జరగాలని ఆకాంక్షిస్తూ ‘తూర్పు’గోదావరి జిల్లా అంతటా శుక్రవారం ఉద్యమం ఊపందుకుంది. అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు ఎర్రవంతెన నుంచి హైస్కూల్ సెంటర్ వరకూ ర్యాలీలో పాల్గొన్నారు. తునిలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని సాంస్కృతికంగా అభివృద్ధి చేస్తామని గృహనిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుపేర్కొన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తదితరులు కోటిపల్లి బస్టాండ్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి బైఠాయించారు. రామచంద్రాపురంలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళలతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యువత ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తారా? కడప కార్పొరేషన్: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కడప ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమరావతి పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు నాయుడు కేవలం తన సామాజిక వర్గం ప్రయోజనాలను కాపాడటానికే మూడు రాజధానుల అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు ఖాజా రహమతుల్లా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దు అనంతపురం: అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ జరగాలని కోరుతూ అనంతపురంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ మేరకు కలెక్టర్ గంధం చంద్రుడుకు విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు. గిరిజన విద్యార్థి సంఘం, ఎంఐఎం విద్యార్థి సంçఘం, వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ప్రాథమిక విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ సాంబశివారెడ్డి మద్దతు ప్రకటించారు. హిందూపురంలో టీడీపీ వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు ప్రాంతాల అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆందోళనలను అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. థ్యాంక్యూ.. సీఎం కర్నూలు (రాజ్‌విహార్): కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిస్తూ కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్’ అంటూ నినదించారు. కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన పాణ్యం, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు. నంద్యాల, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, మంత్రాలయంలో ర్యాలీ చేపట్టారు. సమగ్రాభివృద్ధి కోరుతూ.. పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ విజయనగరం జిల్లావ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ర్యాలీలు హోరెత్తాయి. విజయనగరం మూడు రోడ్ల జంక్షన్లో మానవ హారం నిర్వహించారు. బొబ్బిలి, కురుపాం, పార్వతీపురం, సాలూరు, కొత్తవలస, భోగాపురంలో ర్యాలీలు జరిగాయి. నెల్లూరు రూరల్, ఆత్మకూరు పట్టణం, చేజెర్ల, సంగం, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పోడూరు, ఏలూరు నగరం, ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలం బాదంపూడి తదితర ప్రాంతాల్లో బైక్, కార్ల ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కొట్టు విశాల్ మద్దతు పలికారు. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, చర్చాగోష్టులు నిర్వహించారు. సోంపేటలో‘అధికారం–అభివృద్థి–వికేంద్రీకరణ’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో.. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మేధావుల ఫోరం చెబుతోందని స్పష్టం చేశారు. టెక్కలిలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. అమరావతిలో భూములు కొన్న నాయకులే దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సోమవారం లేఖ రాశారు. రాజ్యాంగం సూచించిన సూత్రాల మేరకు పరిపాలన వ్యవహారాలు సాగాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్ణయించడంతోపాటు ఇతర అంశాలను అధ్యయనం చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించిందన్నారు. అయితే గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా వారి పార్టీ నాయకులతో కమిటీని వేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రీ–ఆర్గనైజేషన్ యాక్ట్–14 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాజధాని విషయంలో అధికారికంగా గెజిట్ ద్వారా నోటిఫై చేయలేదని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో పనిచేయలేదని, వాటిని వేరే చోటుకు మార్చేశారని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సైతం ఒకేచోట పెద్ద పట్టణాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడం కంటే వికేంద్రీకరణను సూచించడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజధాని ఒకేచోట ఏర్పాటు చేయాలనుకున్నా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేయవద్దని నిపుణుల కమిటీ స్పష్టంగా పేర్కొన్నా దానిని తుంగలో తొక్కారన్నారు. వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ, మరో ప్రైవేటు సంస్థ ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆయన లేఖలో కోరారు. -
మూడింటిలోనూ ఉద్ధండులే!
సాక్షి, అమరావతి: శివరామకృష్ణన్ కమిటీ.. కేంద్ర స్థాయిలో సీనియర్ అధికారులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ జీఎన్ రావు కమిటీ.. పలు రంగాలు, విభాగాల్లో విశేష అనుభవం ఉన్న నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ).. ప్రపంచంలోనే టాప్–3 కన్సల్టెన్సీల్లో ఒకటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నియమించిన రెండు కమిటీలు... ఓ అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీ.. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఒకే మాటను నొక్కిచెప్పాయి. అదే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ.. వికేంద్రీకరణే రాష్ట్రం ముందడుగు వేసేందుకు చోదకశక్తి అని విష్పష్టంగా ప్రకటించాయి. అప్పుడే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని కుండబద్దలు కొట్టాయి. రాష్ట్ర ప్రజల శాశ్వత ప్రయోజనాలకు ఏది సరైందని నిపుణులు భావించారో అదే తమ నివేదికల్లో స్పష్టం చేశారు. అందుకోసం పూర్తిస్థాయి కసరత్తు చేసి మరీ నివేదించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉదాహరణలను పరిశీలించారు. ఆర్థిక పరిస్థితిని మదించారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని...సహజవనరులను పరిగణనలోకి తీసుకుని... అనుకూల, ప్రతికూల అంశాలను విశ్లేషిస్తూ తమ నివేదికలను సమర్పించారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాజకీయ దురుద్దేశాలతో జీఎన్ రావు, శివరామకృష్ణన్ కమిటీల్ని, బీసీజీని విమర్శిస్తుండటం విస్మయపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఆనాటి సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ చైర్మన్, సభ్యులపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీసీజీపై అవాస్తవ ఆరోపణలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జీఎన్‌రావు, శివరామకృష్ణన్ కమిటీల్లో చైర్మన్లు, సభ్యుల సుదీర్ఘ పాలనానుభవం, వివిధ రంగాల్లో వారు చేసిన అవిరళ కృషి ఏమిటన్నది.. అదేవిధంగా బీసీజీ అంతర్జాతీయస్థాయిలో సాధించిన అత్యున్నత ప్రమాణాలు ఏమిటన్నది ఓసారి తెలుసుకుందాం... శివరామకృష్ణన్ కమిటీ.. 1) కేసీ శివరామకృష్ణన్: సీనియర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర పట్టణాభివృద్ధి, వాణిజ్య, హోం శాఖల కార్యదర్శిగా చేశారు. దేశంలో స్థానిక సుపరిపాలనకు నాంది పలికిన 73, 74 రాజ్యాంగ సవరణల బిల్లుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా మెట్రోపాలిటన్ అథారిటీ సీఈవోగా వ్యవహరించారు. దుర్గాపూర్, అసన్సోల్ టౌన్షిప్ సృష్టికర్తగా ఖ్యాతి గడించారు. 2) రతిన్ రాయ్: కేంబ్రిడ్జ్ నుంచి పీహెచ్డీ చేశారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో పలు పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐక్యరాజ్యసమితి ఎన్ఐపీఎఫ్పీ డైరెక్టర్‌గా, బ్యాంకాక్‌లోని ఆసియన్ పసిఫిక్ రీజనల్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కేంద్రం నియమించిన 13వ ఆర్థిక సంఘానికి సలహాదారు. 3) అరోమర్ రెవి: ప్రజా వ్యవహారాలు, సమగ్రాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో 35 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుడు. యునిసెఫ్, యూఎన్డీపీ, యూఎన్ఈపీ తదితర విభాగాల్లో సేవలు అందించారు. ‘నెట్వర్క్ సొల్యూషన్స్’కు కో చైర్మన్‌గా వ్యవహరించారు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్’కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆ సంస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. 4) జగన్ షా: ఢిల్లీ యూనివర్సిటీ, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రణాళిక, పట్టణాభివృద్ధి రంగాల్లో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియాభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. టాటా ట్రస్ట్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భువనేశ్వర్ డెవలప్మెంట్ అథారిటీల్లో ఉన్నతస్థానాల్లో పనిచేశారు. 5) కేటీ రవీంద్రన్: ఈయన జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జీఎన్ రావు కమిటీ.. 1) జీఎన్ రావు: కమిటీ చైర్మన్‌గా ఉన్న జీఎన్‌రావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో వివిధ జిల్లాల్లో డీఆర్డీఏ పీడీ, జాయింట్ కలెక్టర్‌గా చేసిన అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. సైనిక సంక్షేమ డైరెక్టర్‌గా, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా, ఎన్నికల సంఘం కార్యదర్శి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రెవెన్యూ రికార్డ్స్ డైరెక్టర్‌గా చేసిన ఆయనకు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాలపై పూర్తి పట్టుంది. గోదావరి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్(జీఎఫ్సీఎల్) ప్రత్యేక అధికారిగా 30 జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డు పొందారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కింది. 2) కేటీ రవీంద్రన్: పట్టణాభివృద్ధి రంగంలో నిపుణుడు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక అంశాల మేలుకలయిగా నగరాల అభివృద్ధి కోణంలో ఆయన సుప్రసిద్ధుడు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో అర్బన్ డిజైన్స్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఐదేళ్లు పని చేశారు. ఐక్యరాజ్యసమితికి చెందిన మాస్టర్‌ప్లాన్స్ సలహామండలిలో సభ్యుడిగా చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టులకు సలçహాదారుగా కూడా ఉన్నారు. 3) ప్రొఫెసర్ మహావీర్: ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్లో ప్రొఫెసర్. రిమోట్ సెన్సింగ్ ఫిజికల్ ప్లానింగ్‌లో నిపుణుడు. పట్టణాభివృద్ధి రంగంలో 35 ఏళ్ల విశేష అనుభవం ఉంది. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్లో ప్రొఫెసర్. అమృత్ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుల విభాగంలో కీలక స్థానంలో ఉన్నారు. 4) ఆర్. అంజలీమోహన్: అర్బన్, రీజనల్ ప్లానర్.. బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అర్బన్ ఇ–గవర్నెన్స్ సబ్జెక్టులో పీహెచ్డీ చేశారు. అర్బన్ ప్లానింగ్, మేనేజ్మెంట్లో 20 ఏళ్ల అనుభవం. 5) కేబీ అరుణాచలం: పట్టణాభివృద్ధి రంగంలో 33 ఏళ్ల విశేష అనుభవం ఉంది. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో దేశంలో వివిధ ప్రాజెక్టుల్లో కీలకపాత్ర పోషించారు. వుడాలో చీఫ్ అర్బన్ ప్లానర్‌గా వ్యవహరించారు. 6) ఏవీ సుబ్బారావు: జెన్టీయూలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్లో ప్రొఫెసర్. ఉమ్మడి ఏపీలోనూ, తెలంగాణలోనూ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేశారు. ఏపీలో చిత్తడి నేలల అట్లాస్ రూపొందించిన ప్రాజెక్టు బాధ్యతలు నిర్వర్తించారు. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ)కు కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. 7) సీహెచ్.విజయ్‌మోహన్: ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా, సర్వే సెటిల్మెంట్స్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్‌గా వ్యవహరించారు. జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. అత్యుత్తమ కన్సల్టెన్సీ బీసీజీ... 1963లో స్థాపించిన ఈ సంస్థకు 50 దేశాల్లో 90కి పైగా కార్యాలయాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సమతుల– సమగ్రాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, కార్పొరేట్ వ్యవహారాలు, ఆర్థికాభివృద్ధి, ఆహార భద్రత, వైద్య– ఆరోగ్య రక్షణ, విద్య తదితర రంగాల్లో బీసీజీ ప్రధాన భూమిక పోషిస్తోంది. సమతుల, సమగ్రాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి చేపట్టే ప్రాజెక్టుల్లో బీసీజీది కీలక పాత్ర. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, జీ–20 దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా ఉండే బి–20 సంస్థ, అమెరికాలో ప్రజా విధానాల రూపకల్పనలో సలహాదారుగా ఉన్న ‘బిజినెస్ రౌండ్ టేబుల్’ సంస్థ, బిల్–మిలిందా గేట్స్ ఫౌండేషన్ తదితర సంస్థలతో కలసి పనిచేస్తోంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం, సేవ్ ద చిల్ట్రన్, టీచ్ టు ఆల్ వంటి అంతర్జాతీయస్థాయి కార్యక్రమాలను విజయవంతంగా చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది. బీసీజీ నిర్ధారించే గ్రోత్ రేటింగ్స్‌ను అంతర్జాతీయస్థాయిలో కార్పొరేట్, మేనేజ్మెంట్ సంస్థలు ప్రామాణికంగా తీసుకుంటాయి. -
వికేంద్రీకరణకే పెద్దపీట
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరి కాదు. పాలనను వికేంద్రీకరించాలి. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. – శివరామకృష్ణన్ కమిటీ మానవ జీవన ప్రమాణాలను పెంచడమే నిజమైన అభివృద్ధి. మెగా సిటీల నిర్మాణం, భూముల ధరలు పెరగడం అభివృద్ధి కాదు. రాష్ట్రంలోని ప్రజలందరి తలసరి ఆదాయం పెరగడం అభివృద్ధి. పాలన వికేంద్రీకరణే ఇందుకు మార్గం. – జీఎన్ రావు కమిటీ పరిపాలన వికేంద్రీకరణతో పాటు బహుళ రాజధానుల వ్యవస్థ వల్ల ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందుతాయి. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలి. – బోస్టన్ కమిటీ ‘పాలన ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలి.. అందుకు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణే మార్గం కావాలి’ అని రాష్ట్రం విడిపోయాక శివరామకృష్ణన్ కమిటీ, మొన్న జీఎన్ రావు కమిటీ, నిన్న బోస్టన్ కమిటీలు విస్పష్టంగా నొక్కి వక్కాణించాయి. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు కేంద్రంగా పరిపాలన, అసెంబ్లీ, హైకోర్టు వ్యవహారాలు సాగితేనే అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యం సాధ్యమని స్పష్టీకరించాయి. ఒక్క అమరావతిలోనే లక్ష కోట్ల రూపాయలు గుమ్మరించి అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల మాటేమిటని ఆందోళన వ్యక్తం చేశాయి. అవకాశాలు అందరికీ రావాలని, ఆర్థిక, ప్రాంతీయ అసమానతలకు తావివ్వరాదని స్పష్టం చేశాయి. అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల జరిగిన అనర్థమేమిటో కళ్లెదుటే కనిపిస్తున్నా, మళ్లీ మళ్లీ ఆ పొరపాటుకు తావివ్వడం సరికాదని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆయా కమిటీల అభిప్రాయాల మధ్య సారూప్యతపై మరోసారి అవలోకనం.. సాక్షి, అమరావతి : నాడు శివరామకృష్ణన్, మొన్న, నిన్న జీఎన్.రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చిన నివేదికలు నిజమైన అభివృద్ధికి అద్దం పట్టేలా, వికేంద్రీకరణకు పెద్దపీట వేసేలా ఉన్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంటే ఒకే చోట పెద్ద పెద్ద నగరాలు నిర్మించడం కాదనే అభిప్రాయపడ్డాయి. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు.. రవాణా, మంచి నీరు, విద్య, వైద్యం, విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చెబుతూ.. ఇందుకు రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడమే మంచి మార్గమని సూచించాయి. అన్ని జిల్లాల సమతుల అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్ సూచించడం ఎంతైనా అవసరమేనని స్పష్టీకరించాయి. అమరావతి రాజధాని నగరం పేరుతో గత ప్రభుత్వం నిర్మాణాలను పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మోడల్‌నే రూపొందించిందనే విషయాన్ని ఎత్తి చూపాయి. మిగతా జిల్లాలు వెనుకబడి ఉన్న నేపథ్యంలో అమరావతిలోనే అన్నీ కేంద్రీకృతం చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నను లేవనెత్తాయి. పలు దేశాల్లో, రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీలు ఉన్నాయని ఉదహరిస్తూ.. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సూచించాయి. ఇంచు మించు ఒకేలా ఉన్న ఈ మూడు కమిటీల నివేదికల సూచనల అమలుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి: జీఎన్ రావు కమిటీ - శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు.. శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. - అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. - మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ పరంగా సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. - అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంభించాలి. - అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం. - రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి. - రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. - వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. మహానగరం సరికాదు : శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది. ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరయినది కాదంది. - అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. - ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరోచోట బెంచ్‌ను నెలకొల్పాలి. - విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం కలుగుతుంది. పర్యావరణానికీ ఇబ్బంది కలుగుతుంది. - విజయవాడ– గుంటూరు నగరాల మధ్య మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం (అప్పట్లో చంద్రబాబు) చెప్పారు. కానీ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కోణంలో ఆ రెండు నగరాల మధ్య మెగా సిటీని విస్తరించడం ఆచరణ సాధ్యం కాదు. - విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతోపాటు దేశంలో వరి ఉత్పిత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పొలాలు నాశనమవుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. - సారవంతమైన పంట పొలాలకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే తీవ్ర ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. - విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కూడా. ఆ ప్రాంతంలో నేల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. - స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. పాలన వికేంద్రీకరణే మార్గం: బోస్టన్ నివేదిక - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. - తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులభంగా పౌర సేవలు అందుతాయి. - చాలా మంది ప్రజలు మండలం దాటి సచివాలయానికి రారు. సచివాలయానికి వచ్చే వారిలో పైరవీలు లేదా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారే ఎక్కువ. (ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తదు) - ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి 80 వేల కోట్ల రూపాయల నుంచి 1.20 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ధి చెందితేనే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ నగరాల్లో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధి రేటు 2 నుంచి 7 శాతం మాత్రమే ఉంది. - ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కూడా విఫలం చెందాయి. ఇందులో కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50 శాతం సాధించాయి. మిగతా మెగా సిటీలన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయి. - ప్రపంచంలో గత 50 ఏళ్లలో ఏడు దేశాల క్యాపిటల్ సిటీల నిర్మాణం చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరకుంది. మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదు. - అమరావతి నగరంపై రూ.లక్ష కోట్లు వ్యయం చేసినా 40 ఏళ్ల వరకు రాబడి వచ్చే అవకాశం లేదు. అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సగటున 15 నుంచి 16 శాతం వృద్ధి నమోదు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల అమరావతిపై భారీగా వ్యయం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం. - అమరావతి నగరంలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులకు పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95 శాతంపైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాలి. ఇందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 6 నుంచి 8 శాతానికి సమానంగా ఉంటుంది. తొలి 10–15 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించడానికి బడ్జెట్లో పది శాతం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల అభివృద్ధి పథకాల అమలకు నిధులుండవు. – బోస్టన్ నివేదిక మూడు రాజధానులతో సమ న్యాయం ఒకే పెద్ద రాజధాని బదులు మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలను వికేంద్రీకరించాలి. హైకోర్టు వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. – ఈఏఎస్ శర్మ, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి సమతుల అభివృద్ధి సాధ్యం పాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రంలో సమతుల అభివృద్ధి జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. పాలన అన్ని ప్రాంతాల వారికి చేరువవుతుంది. ఒకే చోట పాలనా వ్యవస్థలన్నీ కేంద్రీకృతం కావడం మంచిది కాదు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో అన్నీ ఒకే చోట ఉండాలనే ఆలోచనకు అర్థం లేదు. – ప్రొఫెసర్ ఎం.రవీంద్రనాథ్, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ చదవండి: అమరావతి.. విఫల ప్రయోగమే ‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’ సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు.. మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
అమరావతి : మెరుపు వరద చుట్టుముడితే?
సాక్షి, అమరావతి బ్యూరో: రెండేళ్ల క్రితం చెన్నై మహా నగరాన్ని చుట్టుముట్టిన వరదలు ఇప్పుడు కేరళలో ప్రళయం సృష్టిస్తున్నాయి. మరి కృష్ణా తీరంలో నిర్మిస్తున్న నూతన రాజధానిలో కుంభవృష్టి కురిస్తే అమరావతి పరిస్థితి ఏమిటి? వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఏ ఉద్యోగిని కదిలించినా ఇప్పుడు ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణ వర్షపాతానికే అమరావతిలో 13,500 ఎకరాలు ముంపు బారినపడుతున్నాయి. అంతకు మించి వర్షపాతం నమోదైతే వరద ప్రభావం అధికంగా ఉంటుంది. రాజధాని ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా అమరావతి ప్రాంతానికి వరద ముప్పు ఉందని హెచ్చరించిన విషయం తెలిసిందే. సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లోనూ వరద ముప్పు హెచ్చరిక ఉంది. రాజధానికి ముప్పు 3 రకాలు.. కృష్ణానది ఉప్పొంగడం వల్ల రాజధానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణానదికి వరదలు రెండు రకాలుగా వస్తాయి. కృష్ణానది పైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండడంతో నాగార్జునసాగర్‌కు నీరు విడుదలవుతోంది. సాగర్, పులిచింతల నిండిన తర్వాత వచ్చే వరద ప్రవాహం మనకు ముప్పు కలిగించేదే. ఎగువన వర్షాలు లేకున్నా భారీ ప్రవాహం 2009లో పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలతో సంబంధం లేకుండానే జూరాల–శ్రీశైలం మధ్యన (దూరం 200 కి.మీ.) కురిసిన వర్షంతోనే 24 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కృష్ణాలో నమోదైంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో వరదను నియంత్రించడంతో ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చింది. దానికే అమరావతి ప్రాంతంలోని పొలాల్లో 5 అడుగుల మేర నీళ్లు చేరాయి. ఇక 24 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పడితే? జూరాల–శ్రీశైలం మధ్య ఉన్నదంతా కరువు ప్రాంతం. అత్యంత భారీ వర్షాలను ఊహించలేం. నాగార్జునసాగర్–ప్రకాశం బ్యారేజీ మధ్య భారీ ప్రవాహాలకు అవకాశం ఉన్న పలు ఉపనదులు, వాగులు, వంకలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద అంతా ఈ ఉపనదులు, వాగులు, వంకల నుంచి వస్తున్నదే. పైనుంచి వరద పోటుకు తోడు సాగర్ దిగువన కూడా వర్షాలు కురిస్తే కృష్ణానది ఉప్పొంగుతుంది. అది రాజధాని ప్రాంతానికి ప్రమాదకరం. మెరుపు వరద చుట్టుముడితే? స్థానిక వర్షాల వల్ల కొండవీటి వాగుకు మెరుపు వరద(ప్లాష్ ఫ్లడ్) వచ్చే అవకాశం ఉంది. ఇటీవల వర్షాలకు గుంటూరు–అమరావతి మధ్య రాకపోకలు నిలిచిన విషయం విదితమే. కేరళలో గరిష్టంగా ఒకరోజులో 310 మి.మీ. వర్షం కురిసింది. ఆ రాష్ట్రంలోని దాదాపు అన్ని డ్యాముల గేట్లు తెరిచారు. ఫలితంగా వరద ముంచెత్తింది. రెండేళ్ల క్రితం చెన్నైలో 490 మి.మీ. వర్షపాతం నమోదైనప్పుడు కూడా నగరాన్ని వరద ముంచెత్తింది. అందులో సగం వర్షపాతం నమోదైనా సరే అమరావతికి వరద ముప్పు తప్పదనే ఆందోళన సాగునీటిశాఖ ఇంజనీర్లలో నెలకొంది. దాదాపు 30 కిలోమీటర్ల పొడవైన కొండవీటి వాగు క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ. సాధారణ సమయాల్లో కొండవీటి వాగులో 4–5 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఫ్లాష్ ప్లడ్ వస్తే 10 రెట్లు అధికంగా ఉంటుందని ఇంజనీర్ల అంచనా. ఇక కుంభవృష్టి కురిస్తే వరద దాదాపు 25 వేల క్యూసెక్కులకు చేరుతుందని, గంటల వ్యవధిలోనే రాజధానికి వరద నీరు చేరుతుందనే ఆందోళనే సాగునీటి నిపుణుల్లో ఉంది. అటు కృష్ణానది, ఇటు కొండవీటివాగులో ఒకేసారి భారీ ప్రవాహం ఉంటే రాజధానికి వరద ముప్పు రెట్టింపవుతుంది. కొండవీటివాగు నుంచి 4–5 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ ద్వారా మళ్లించినా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. వరద ప్రాంతాల్లో వద్దన్న శివరామకృష్ణన్ కమిటీ ప్రతి పదేళ్లలో ఒకసారి వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో విజయవాడ–గుంటూరు పరిసరాల్లో రాజధాని ఏర్పాటు యోచన సరికాదని కమిటీ హెచ్చరించింది. -
ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు గ్రహించాలి: ఆర్కే
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నేల కుంగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... రాజధానిలో మొన్న ఇళ్ళు కుంగాయి. నేడు తాత్కాలిక సచివాలయం ప్లోరింగ్ కుంగింది. నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ఈ భూమి రాజధానికి పనికిరాదు అని చెప్పినా స్వార్ధం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి మాటలను పెడ చెవిన పెట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కనీసం బాబు చదివి ఉన్నా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి పంతాలకు పోకుండా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను అమలు చేయాలి.' అని డిమాండ్ చేశారు. కాగా సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో గురువారంనాడు మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. -
'కృష్ణా అయినా.... గుంటూరు అయినా ఓకే'
-
'కృష్ణా అయినా.... గుంటూరు అయినా ఓకే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది శ్రీమంతుల రాజధాని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని ఎక్కడైనా పెట్టండి...తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన బుధవారమిక్కడ స్పష్టం చేశారు. కనీస సౌకర్యాలున్న ప్రాంతంలో రాజధాని ఉండాలని వైఎస్ జగన్ అన్నారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. తమకు అన్ని ప్రాంతాలు ఒకటేనని.. కృష్ణా అయినా గుంటూరు అయినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే రాజధానిపై ఏకపక్ష నిర్ణయం ఒప్పుకునేది లేదని, శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చ జరగాలని, చర్చ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధాని ఎక్కడపెట్టినా లక్ష ఎకరాల వరకూ డీనోటిఫై చేస్తామని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. రాజధానిలో సామాన్య ఉద్యోగికి కూడా భూములు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆలోచనలు చూస్తే శ్రీమంతులకే పరిమితమయ్యే రాజధానిలా ఉందన్నారు. చదువుకునే పిల్లలు భవిష్యత్‌లో ఉద్యోగానికి వెళ్తే రాజధానిలో భూమి కొనుగోలు చేసుకునే అవకాశం ఉండాలన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే ఏం చేయాలి? అని ఆలోచించాలన్నారు. నియంత మాదిరిగా నా ఇష్టం నేను ఇక్కడే పెడతానంటే ఎలా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం బతికే ఉందా అని అడిగారు. ప్రకటన తర్వాత చర్చ ఉంటే అంతకంటే దారుణం ఉందా అన్నారు. మేం చేయాల్సింది చేస్తాం, మీ చావు మీరు చావడమంటే ప్రజాస్వామ్యం ఇదేనా అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు పక్కనపెట్టి ఆలోచించాలని, భావితరాలకు ఏం సమాధానం చెప్పాలని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై సభలో చర్చతో పాటు ఓటింగ్ ఉండాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సభ్యుల అభిప్రాయాలు వద్దనడం సమంజసమేనా అన్నారు. ఎవరికో మేలు చేయడం కోసం ఆలోచించవద్దని, విశాల దృక్పధం ఉండాలన్నారు. ఇదే పరిస్థితి 1953లో ఉత్పన్నమైనప్పుడు సభలో అయిదు రోజులపాటు చర్చ జరిగిందన్నారు. చర్చ, ఓటింగ్ జరగాలని... అటువంటి పరిస్థితి లేనప్పుడు అసెంబ్లీ సమావేశాలెందుకని వైఎస్ జగన్ సూటిగా ప్రశించారు. -
మధ్యాహ్నం 3 గంటలకు AP కేబినెట్
-
తెలుగు తమ్ముళ్ల ఆశలపై నీళ్లు!
పేనం మీద నుంచి పోయ్యిలో పడినట్లుంది ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకుల పరిస్థితి. రాజధాని ఏర్పాటుపై తమ మాటే చెల్లుతుందని ఊహాల్లో తేలియాడుతున్న పచ్చ నేతల ఆశలపై నిపుణుల కమిటీ నివేదిక నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు ఏపీ రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్యే అని ముఖ్యమంత్రి నుంచి మంత్రి వర్గ సహచరులు... చివరకు ఆ పార్టీ ఎంపీలు కూడా అంతా డంకా భజాయించి మరీ చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య అనుకూలంగా లేదని ప్రొఫెసర్ శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర హోం శాఖకు బుధవారం ఇచ్చిన నివేదికతో తెలుగు తమ్ముళ్లు నిర్ఘాంతపోయారు. అంతేకాదు విజయవాడ - గుంటూరు మధ్య సాగుభూమి అధికంగా ఉందని... రాజధాని ఏర్పాటు చేస్తే ఆ భూమికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కమిటీ పేర్కొనడంతో టీడీపీకి ఎన్నికల నిధులిచ్చిన రియాల్టర్లు నీరుకారిపోయారు. అంతేకాకుండా గుంటూరు జిల్లా వినుకొండ - ప్రకాశం జిల్లాలోని మార్టూరుల మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం అంటూ ఆ కమిటీ తన నిర్ణయాన్ని హోం శాఖ ముందుంచింది. దాంతో ఇప్పటి వరకు విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని టీడీపీ ప్రజాప్రతినిధులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కానీ శివరామకృష్ణన్ కమిటీ వినుకొండ - మార్టూరు మధ్య రాజధాని అనే సరికి టీడీపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయపడినట్లు అయింది. రాజధాని ఎంపికపై వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో, దానిపై తమ సర్కారు ఏవిధంగా స్పందింస్తుందోనని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. ఈ విభజన ఏమిటో.... కొత్త రాజధాని ఎక్కడో... అంతా... అంటూ గొణుకుంటున్నారు. -
అటవీ ప్రాంతంలో రాజధానా ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ఏర్పాటైన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అటవీ ప్రాంతంలోనా అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఎవరికి ఏమి లాభమని ఆయన అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ప్రొ.శివరామకృష్ణన్ కమిటీపై జరిగిన చిట్ చాట్‌లో యనమల మాట్లాడుతూ... నగరాల మధ్యే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉంటేనే అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని ఏర్పాటుపై ఇతర పార్టీల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదని యనమల స్పష్టం చేశారు. -
బెజవాడ వద్ద రాజధాని వద్దనలేదు
హైదరాబాద్ : శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ వద్ద రాజధాని వద్దనలేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడకు ఉత్తరం వూపు రాజధాని పెట్టుకోమని సూచించిందని ఆయన గురువారం అసెంబ్లీ లాబీలో మీడియా చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు. వ్యవసాయ భూములను వినియోగించవద్దని కమిటీ చెప్పిందని, పూర్తి నివేదికను కమిటీ ఈరోజు కేంద్రానికి అందచేస్తుందన్నారు. నివేదికలన్ని ఇచ్చాక తాము నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు. -
'ఎవరేమన్నా... రాజధాని అక్కడే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు ఎక్కడ అనే విషయంలో ఎలాంటి గందరగోళం లేదని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం అసెంబ్లీ లాబీలో పుల్లారావు మాట్లాడుతూ... శివరామకృష్ణన్ కమిటీ మరో చోట రాజధాని అని నివేదిక ఇచ్చిన విజయవాడ - గుంటూరు నగరాల మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయం సీఎం చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారన్నారు. నూతన రాజధాని ఏర్పాటుపై విభిన్న ప్రకటనలు చేయొద్దని పుల్లారావు సహాచర మంత్రులకు హితవు పలికారు. రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చూసుకుంటారని పుల్లారావు వెల్లడించారు. ఏపీ రాజధానిని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య వ్యవసాయ భూములు ఉన్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేయవద్దని ప్రొ. శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. నూతన రాజధాని ఏర్పాటుకు మార్టురు - వినుకొండ అత్యంత అనుకూలమని పేర్కొంది. దాంతో ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీ లాబీలో కమిటీ నివేదికపై చర్చించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న యనమల మాట్లాడుతూ... వినుకోండ అయితే ఇబ్బందే అన్నారు. దోనకొండ అయితే ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. నివేదిక వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికే అధిక ప్రాధాన్యత ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. అయితే కమిటీ నివేదికపై గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు ఇప్పటికే విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఏర్పాటవుతుందని ఎప్పటి నుంచో ప్రకటించారు. దీంతో ఆ రెండు నగరాల మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందని ఆ జిల్లాల ప్రజాప్రతినిధులు ఆనందంతో ఉన్నారు. మార్టురు - దొనకోండ వద్ద రాజధానికి అనుకూలమంటూ శివరామకృష్ణకు కమిటీ తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో అసెంబ్లీ లాబీలో ఏపీ రాజధాని ఏర్పాటుపైనే చర్చ సాగుతుంది. -
కమిటీ నివేదిక ఊహించినదే....
హైదరాబాద్ : శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఊహించిన విధంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు వ్యవసాయ భూములను వినియోగించొద్దని కమిటీ సూచిందన్నారు. తాము ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని నారాయణ తెలిపారు. నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా అందలేదన్నారు. నివేదిక వచ్చిన వెంటనే వచ్చే నెల 1న జరిగే కేబినెట్లో దీనిపై చర్చిస్తామని నారాయణ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని వికేంద్రీకరణే శరణ్యమని రాజధానిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాజధానిని ఒకే చోట కేంద్రీకరించకుండా మూడు జోన్లలో విస్తరించాలని సిఫారసు చేసింది. ప్రత్యేకంగా ప్రాంతాలను నిర్దేశించకుండా.. వివిధ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు అనుకూలతలు, ప్రతికూలతలు, అక్కడి చారిత్రక నేపథ్యాన్ని వివరించింది. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమలను దృష్టిలో పెట్టుకుని రాజధానిని వికేంద్రీకరించాలని, ప్రధాన కేంద్రం ఈ మూడు ప్రాంతాలకూ కేంద్రంగా ఉండాలని సిఫారసు చేసింది. -
3 జోన్లుగా రాజధాని!
-
3 జోన్లుగా రాజధాని!
* వికేంద్రీకరణే ఆంధ్రప్రదేశ్‌కు శరణ్యం * కేంద్ర హోంశాఖకు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక * పలు ప్రత్యామ్నాయాలు సూచించిన కమిటీ * గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని సరికాదు.. ఆర్థిక, పర్యావరణపరంగా నష్టం * రాజధానికి వినుకొండ-మార్టూరు కొంత అనుకూలం * హైదరాబాద్ పరిస్థితులు పునరావృతం కాకూడదు * సచివాలయం, అసెంబ్లీ, ఇతర భవనాల నిర్మాణానికి 7 వేల కోట్లు * రాజధాని నిర్మాణానికి రూ. 1.10 లక్షల కోట్లు కావాలి * హైకోర్టు విశాఖలో, బెంచ్ సీమలో ఏర్పాటుచేయాలి * హైటెక్ జోన్‌గా విశాఖ.. పారిశ్రామిక ప్రాంతంగా కోస్తాంధ్ర.. ట్రాన్స్పోర్ట్ కారిడార్‌గా రాయలసీమ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని వికేంద్రీకరణే శరణ్యమని రాజధానిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. రాజధానిని ఒకే చోట కేంద్రీకరించకుండా మూడు జోన్లలో విస్తరించాలని సిఫారసు చేసింది. ప్రత్యేకంగా ప్రాంతాలను నిర్దేశించకుండా.. వివిధ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు అనుకూలతలు, ప్రతికూలతలు, అక్కడి చారిత్రక నేపథ్యాన్ని వివరించింది. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమలను దృష్టిలో పెట్టుకుని రాజధానిని వికేంద్రీకరించాలని, ప్రధాన కేంద్రం ఈ మూడు ప్రాంతాలకూ కేంద్రంగా ఉండాలని సిఫారసు చేసింది. హైదరాబాద్ వల్ల తలెత్తిన పరిస్థితులు పునరావృతం కాకూడదని అభిప్రాయపడింది. గుంటూరు జిల్లా వినుకొండ - ప్రకాశం జిల్లా మార్టూరు మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలత ఎక్కువని కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని చెప్పినట్లు తెలిసింది. పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించిన ఈ కమిటీ నూతన రాజధాని నిర్మాణం విషయంలో అనేక సూచనలు చేసింది. అంతిమ నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని తే ల్చిచెప్పింది. ఐదుగురు నిపుణులతో కూడిన కె.సి.శివరామకృష్ణన్ కమిటీ బుధవారం సాయంత్రం కేంద్ర హోం శాఖకు తన నివేదికను సమర్పించింది. కమిటీకి మాజీ ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతృత్వం వహించగా, వివిధ రంగాల నిపుణులు రతిన్ రాయ్, జగన్‌షా, ఆరోమర్ రవి, కె.టి.రవీంద్రన్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం నోటిఫైడ్ తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈమేరకు ఈ నెల 31 వరకు గడువు ఉన్నప్పటికీ, 4 రోజులు ముందుగానే కమిటీ నివేదిక సమర్పించింది. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం కమిటీ సూచనలు ఈ విధంగా ఉన్నాయి.. అభివృద్ధికి నాలుగు భాగాలుగా.. ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ.. ఇలా నాలుగు భాగాలుగా చేసుకుని అభివృద్ధిని వికేంద్రీకరించాలని సిఫారసు చేసింది. కాస్మొపాలిటన్ నగరంగా ఎదుగుతున్న విశాఖ నగరాన్ని హైటెక్ జోన్‌గా మలచుకోవచ్చని తెలిపింది. విశాఖలో ఇప్పటికే ఉన్న ఐటీ ఆధారిత కంపెనీల ఆధారంగా మరికొన్ని సంస్థలను ఆహ్వానించవచ్చని చెప్పింది. కోస్తాంధ్రలో రేవు ఆధారిత, పెట్రో కెమికల్ ఆధారిత పరిశ్రమలకు విపరీతమైన అవకాశాలు ఉన్నందున వాటిని పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేయవచ్చని తెలిపింది. రాయలసీమ ప్రాంతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు మధ్య ఉన్నందున ఈ జోన్‌ను ట్రాన్స్‌పోర్టు కారిడార్‌గా మలచుకోవచ్చని, బెంగళూరు హైవే దీనికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. శ్రీ కాళహస్తిలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం మొత్తం అవసరాలు తీరడ మే కాకుండా పొరుగు రాష్ట్రాలకు, రాష్ట్రంలోని వివిధ నగరాలకు రవాణా సౌకర్యం (కనెక్టివిటీ) పెంచుకోవచ్చని సిఫారసు చేసింది. పోర్టులను అనుసంధానం చేస్తూ రైల్వే కనెక్టివిటీ పెంచుకునేందుకు కూడా ఈ జోన్ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. విజయవాడ-గుంటూరు ఆర్థికంగా భారం గుంటూరు జిల్లా వినుకొండ, ప్రకాశం జిల్లా మార్టూరు మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలత ఎక్కువగా ఉందని అభిప్రాయపడింది. ఇక్కడ భూసేకరణ సులువని, అన్ని ప్రాంతాలకు మధ్యగా ఉంటుందని అభిప్రాయపడింది. ఇక్కడ ప్రభుత్వ భూములూ అందుబాటులో ఉన్నాయని, నీటి వసతిని సమకూర్చుకోవడమూ సులువేనని తెలిపింది. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. మెట్రో నగరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నప్పటికీ. ఒకే చోట అభివృద్ధిని పరిమితం చేయడం సరికాదంది. హైదరాబాద్‌లో అభివృద్ధిని కేంద్రీకరించడం వల్ల వచ్చిన సమస్యలే ఇక్కడా పునరావృతమవుతాయని చెప్పింది. పైగా ఇక్కడ భూ సేకరణ అతి పెద్ద సవాలుగా మారుతుందని తేల్చిచెప్పింది. విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతంలో రాజధాని ఏర్పా టు చేయాలన్న డిమాండ్ బాగా వినిపించినప్పటికీ... ఇక్కడ రాజధానికి అవసరమైన భూముల సేకరణ తీవ్ర కష్టమైన పని అని, ఆర్థికంగా కూడా భారమని అభిప్రాయపడింది. పైగా ఈ ప్రాంతం పరిధిలో రాజధాని ఏర్పాటు చేయాలంటే సాగు భూములు నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది. వికేంద్రీకరణ మేలు.. రాజధానిని ఒకే చోట ఏర్పాటుచేయడం కం టే మూడు జోన్లుగా వికేంద్రీకరించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం మేలని కమిటీ సిఫారసు చేసింది. ఇలా చేయదలిస్తే.. విజయవాడ-గుంటూరు, విశాఖ-విజయనగరం, రాయలసీమలను మూడు క్లస్టర్లుగా చేసుకొని వికేంద్రీకరించుకోవచ్చని అభిప్రాయపడింది.రాజధానిలో అసెంబ్లీ, సచివాలయం, సీఎం కార్యాలయం, మంత్రులు, ఎమ్మెల్యే ల నివాసాలు ఏర్పాటు చేసి, మిగిలిన కార్యాలయాలు ఆయా ప్రాంతాల స్వభావాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. రాజధానిలో సచివాలయం, శాసనసభ, ఇతర భవనాల నిర్మాణానికి రూ. 7 వేల కోట్లు అవసరమని, మొత్తం రాజధాని నిర్మాణానికి రూ. 1.10 లక్షల కోట్లు అవసరమని కమిటీ అంచనా వేసింది. విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాయలసీమ జిల్లాలైన అనంతపురం లేదా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయొచ్చని సూచించింది. వివిధ శాఖల పరిధిలోని డెరైక్టరేట్లు, కమిషనరేట్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అవసరాలను బట్టి ఏర్పాటుచేయవచ్చని అభిప్రాయపడింది. -
రాజధానికి దొనకొండ సరైన ప్రదేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రదేశ ఎంపికపై పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. ఇది ఎవరి కోసమని ఆయన శనివారం అసెంబ్లీలో నిలదీశారు. దీనిపై ఇప్పటికే శివరామకృష్ణన్ కమిటీ పని చేస్తుందని గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. భూముల ధరలు ఆకాశన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానికి దొనకొండే సరైన ప్రదేశమని గొట్టిపాటి సూచించారు. దీనిపై మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ త్వరలోనే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇస్తుందని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. -
మూడేళ్లలో పాలన అంతా బెజవాడ నుంచే
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఈనెల 27న శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదిక ఇవ్వనుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ తాత్కాలిక రాజధానిలో శాఖాధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. మూడేళ్లలో పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందని ఆయన తెలిపారు. త్వరలో దేశంలోని నాలుగు రాజధానుల్లో సలహా కమిటీ పర్యటిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన కమిటీ కేవలం సలహాలు మాత్రమే ఇస్తుందని నారాయణ స్పష్టం చేశారు. విజయవాడకు మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తరలించవచ్చని ఆయన చెప్పారు. ప్రజలతో తక్కువ సంబంధం ఉన్న శాఖలను తరలిస్తామని నారాయణ చెప్పారు. -
ఎవరూ ఊహించనది జరిగింది: బాబు
హైదరాబాద్ : ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారం చేపడుతుందని ఎవరూ ఊహించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి దానికీ ఓ టైం ఉంటుందని, ఎన్నికల్లో అలా తనకు టైం కలిసొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని, అప్పటివరకూ హైదరాబాద్‌లోనే ఉంటానని బాబు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఆయన నిన్న కర్నూలులో విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కంటే ఆంధ్రప్రదేశ్‌పై తనకే ఎక్కువ అవగాహన ఉందన్నారు. విజయవాడ, గుంటూరు మధ్యనే రాజధాని ఉంటుందని, భూముల సేకరణ పెద్ద సమస్యకాదని చంద్రబాబు అన్నారు. సేకరించిన భూములను అభివృద్ధి చేసి ప్రభుత్వం, భూయజమానికి 60:40 నిష్పత్తిలో పంచుతామన్నారు. వ్యవసాయ భూములను రాజధానికి వాడుకున్నా ఆహారోత్పత్తులపై ప్రభావం ఉండదని, కృష్ణా డెల్టాలో వాడుకునే నీటిని రాయలసీమకు మళ్లించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే సమతుల్యం అవుతుందని తెలిపారు. -
'చంద్రబాబుది రహస్య ఎజెండా'
అనంతపురం: తాత్కాలిక రాజధానికి తాము వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. చంద్రబాబు రహస్య ఎజెండా అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బుసంచులు మోసినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకుండానే రాజధానిపై ఎందుకు తొందరపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పంటల భూముల్లో రాజధాని ఏర్పాటు మంచిదికాదని హితవు పలికారు. రాజధాని ఎంపిక విషయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలని రఘువీరారెడ్డి సూచించారు. -
'పరిశీలనలో ఏపీకి రెండు రాజధానులు'
కడప: అన్ని ప్రాంతాల అభివృద్ధిని పరిగణలోకి తీసుకుంటామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. రాయలసీమ సాగునీటి కోసం మరి కొన్ని ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయని, రాజధాని ఎంపిక విషయంలో ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. రాజధానుల నిర్మాణం సాధారణంగా 30-100 సంవత్సరాల సమయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తొందరపాటు నిర్ణయం భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. తొందరపాటులో తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు జరగొచ్చని, అందుకే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక ఇస్తామన్నారు. ఏపీకి రెండు రాజధానుల అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు. దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. -
శివరామకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా ఆందోళన
-
శివరామకృష్ణన్ కమిటీ ‘దొనకొండ’ సందర్శన
-
శివరామకృష్ణన్ కమిటీ ‘దొనకొండ’ సందర్శన
దొనకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు పరిశీలనలో భాగంగా ఆదివారం సాయంత్రం శివరామకృష్ణన్ కమిటీ దొనకొండను సందర్శించింది. స్థానిక సర్పంచ్ ఆలంపల్లి అనంతలక్ష్మి కమిటీ సభ్యులకు స్వాగతం పలికారు. కమిటీ సభ్యులు కేటీ రవీంద్ర, రెవీ, పి.తిమ్మారెడ్డి ముందుగా విమానా శ్రయం భూములను పరిశీలించారు. భూముల వివరాలను రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇండ్లచెరువు పంచాయతీ పరిధిలోని పోచమక్కపల్లెలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అక్కడి నుంచి వచ్చి రైల్వే స్టేషన్‌ను పరిశీలించి, స్థానిక నాయకులు షేక్ నవాబ్, షేక్ మగ్బూల్‌అహ్మద్, మల్లికార్జునశర్మతో చర్చించారు. దొనకొండలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి త్వరలో నివేదిక రూపంలో అందిస్తామని తెలిపారు. మండలంలో సుమారు 54 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వీరివెంట జిల్లా జాయింట్ యాకూబ్‌నాయక్, జిల్లా సర్వేయర్ నర్శింహరావు, కందుకూరు, మార్కాపురం ఆర్డీవోలు బాపిరెడ్డి, కొండయ్య, తహశీల్దార్ కేవీ సత్యనారాయణ, రాజధాని సాధన సమితి అధ్యక్షుడు ఉడుముల లక్ష్మీనారాయణరెడ్డి, దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ కన్వీనర్ కందుల నారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజధానితోనే ‘ప్రకాశం’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెనుకబడిన ప్రకాశం జిల్లాకే రాజధాని దక్కాలి. ఒక్క పైసా ఖర్చు లేకుండా భూసేకరణ ఇక్కడే సాధ్యం. రోడ్డు, రైలు మార్గాలు, తాగునీరు.. అన్ని అనుకూలతలు ఉన్న ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజధాని సాధన సంస్థలు ముక్తకంఠంతో తమ డిమాండ్‌ను శివరామకృష్ణన్ కమిటీ ముందు ఉంచాయి. ఒంగోలు, దొనకొండ ప్రాంతాలను రాజధాని కోసం పరిశీలించాలని అన్ని వర్గాల నేతలు కోరారు. రాజధాని కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం జిల్లాలో పర్యటించింది. తొలుత కొత్తపట్నం వద్ద వాన్‌పిక్ భూములు, బకింగ్‌హామ్ కెనాల్‌ను ఈ బృందం పరిశీలించింది. తర్వాత కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అనంతరం దొనకొండ ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ ఈ ప్రాంతంలో ఉన్న అనుకూలతలను ఏకరవు పెట్టారు. జిల్లాలో ఉన్న వనరులు, భూముల లభ్యతతో పాటు ఈ ప్రాంతమే ఎందుకు రాజధాని కావాలనే అంశంపై కలెక్టర్ విజయకుమార్ రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అందరి మన్ననలు పొందింది. కమిటీ సభ్యులు కూడా ఇంజినీర్లు, ఇతర సాంకేతిక నిపుణులు మాట్లాడినపుడు పలు అంశాలపై తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. తొలుత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు దొనకొండ ప్రాంతం అందుబాటులో ఉంటుందని ఎవరికీ అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరం ఐదు కోట్ల రూపాయలపైన ఉందని, డెల్టా దెబ్బతినే పరిస్థితి వస్తుందని అందువల్ల దొనకొండనే రాజధానిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పలు అనుమానాలకు దారితీస్తోందని సుబ్బారెడ్డి విమర్శించారు. జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు కూడా దొనకొండను రాజధానిగా ఎంపిక చేయాలనే డిమాండ్‌కు మద్దతు పలికారు. తన నియోజకవర్గంలో 65 వేల ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న విషయాన్ని ఆయన తన నివేదికలో ప్రస్తావించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న మంత్రులు సైతం రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నారని, 42 ఖాళీ స్థలాలు ఉన్న అద్దంకి- మార్టూరు మధ్య రాజధాని నిర్మాణం చేయాలని కోరారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ ఒంగోలును రాజధానిగా ఎంపికచేసి వాన్ పిక్ స్థలాలను ఉపయోగించుకోవడంతోపాటు పలు ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పితే వెనుకబడిన జిల్లాకు న్యాయం జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రకాశం అనుకూలంగా ఉంటుందని తెలుగు రైతు రాష్ర్ట అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి తన నివేదికలో పేర్కొన్నారు. రిటైర్డ్ ఇంజినీర్ కైపు వెలుగొండారెడ్డి మాట్లాడుతూ దొనకొండ కేంద్రంగా తీసుకుంటే 300 కిలోమీటర్ల రేడియస్‌లో 3.59 కోట్ల మంది నివాసం ఉంటున్నారని, అదే విజయవాడ కేంద్రంగా 300 కిలోమీటర్ల రేడియస్ 2.49 కోట్ల మంది మాత్రమే నివాసం ఉంటున్నారని చెప్పారు. మరో సివిల్ ఇంజినీర్ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలంటే అందుకు కావాల్సిన కంకర, క్వారీ డస్ట్, తాగునీరు పూర్తిగా అందుబాటులో ఉందని ఉదాహరణలతో సహా వివరించారు. వాన్‌పిక్ భూములున్న ప్రాంతంలోని నీరు నిర్మాణానికి పనికిరాదని, కానీ గుండ్లకమ్మ కాలువలను పొడిగించి వినియోగించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని నిపుణుల కమిటీకి వివరించారు. స్వాతంత్య్ర సమరయోధుడు కరవది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రకాశం పంతులు నడయాడిన నేల అయిన ప్రకాశం జిల్లాలో రాజధాని ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, పాలపర్తి డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, బాల వీరాంజనేయ స్వామి, జెడ్పీ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ, రాజధాని సాధన సమితితో పాటు పలువురు కమిటీకి వినతిపత్రాలు అందచేశారు. -
నెలాఖరకు రాజధానిపై నివేదిక:శివరామకృష్ణన్ కమిటీ
ఒంగోలు: రాజధాని ఎంపికపై తుది నివేదికను ఈ నెలాఖరకు కేంద్రానికి అందజేస్తామని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ అధ్యక్షతన కేంద్రం ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ ఈ రోజు ఒంగోలు జిల్లాలో పర్యటిస్తోంది. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కమిటీ సభ్యులు ఉదయం ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సమాజ వేదిక నేతలు, ప్రజలతో సమావేశమైంది. వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజధాని కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చినట్లు తెలిపారు. అయితే ఏపిలో ఏ ప్రాంతానికి రాజధానికి కావలసిన అర్హతలు లేవని చెప్పారు. తక్కువ ధరకే భూములు సేకరిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. రాజధాని ఎంపికలో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలదే తుది నిర్ణయం అని తెలిపారు. ఇదిలా ఉండగా, కొత్తపట్నం మండలంలోని భూములను కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా రాజధానికి జిల్లాలోని దొనకొండ ప్రాంతం అనువైనదని వైఎస్ఆర్ సిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. -
ఆగస్టు నెలాఖరుకు తుది నివేదిక
-
ఖర్చులు తగ్గించుకోమంటూ.. వేలకోట్లతో రాజధానా?:వడ్డే
విజయవాడ: ఒకవైపు ఖర్చులు తగ్గించుకోమని మంత్రులు, అధికారులకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. మరో వైపు వేల కోట్లతో రాజధానిని నిర్మించాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గురువారం ఆయన విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా ఇంకా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. పరిపాలనలో వికేంద్రీకరణ జరగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల స్థలం అవసరమా అని ప్రశ్నించారు. 15 ఎకరాలు సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి 20 ఎకరాలు, వివిధ కార్యాలయాలకు, ఉద్యోగుల క్వార్టర్లకు 120 ఎకరాలు సరిపోతాయని శివరామకృష్ణన్ కమిటీ చెబుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 20 వేల నుంచి 30 వేల ఎకరాలు అవసరమని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదని చెప్పారు. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. -
ఆగస్టు నెలాఖరుకు తుది నివేదిక
పది రోజుల్లో ముసాయిదా: శివరామకృష్ణన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు అంశంపై తుది నివేదికను ఆగస్టు నెలాఖరుకు సమర్పించనున్నట్టు రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నామని, మరో పది రోజుల్లో ముసాయిదా పేరాలతో నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపనున్నట్టు చెప్పారు. అనంతరం ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నివేదిక సమర్పిస్తామని గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ‘‘ఈ రోజు మంత్రి నారాయణ మాకు కావాల్సిన సమాచారం ఇచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన కార్యాలయాలన్నీ ఆంధ్రప్రదేశ్‌కి మధ్యలో, అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండే ప్రాంతంలో ఉండాలని నిర్ణయించాం. గుంటూరు- విజయవాడ మధ్యే రాజధాని రాబోతోందన్న వదంతులకు నేను బాధ్యుణ్ని కాను. నేను వదంతులు పుట్టించలేను, కేవలం వాస్తవాల ఆధారంగానే మాట్లాడగలను’’ అన్నారు. ఒక సామాజిక వర్గం రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్య తేవాలని ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. విమర్శలు ఎవరు చేసినా, అంతిమంగా, సాంకేతికంగా అన్ని అంశాలను చూపిస్తామని చెప్పారు. -
'సమదూరం ఆధారంగానే రాజధాని ఎంపిక'
న్యూఢిల్లీ: సమన్యాయం, సమదూరం ఆధారంగానే రాజధాని ఎంపిక ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తెలిపారు. కృష్ణా-గుంటూరు మధ్య అటవీ, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. 11 జాతీయ సంస్థలు 11 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. శాస్త్రీయంగానే రాజధాని నిర్మాణం ఉంటుందని హామీయిచ్చారు. శివరామకృష్ణన్ కమిటీతో గురువారం ఆయన సమావేశమయ్యారు. 10 రోజుల్లో ముసాయిదా నివేదిక సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా శివరామకృష్ణన్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని మధ్యలో ఉండాలన్న ప్రతిపాదనకు అంగీకరించినట్టు చెప్పారు. -
'శివరామకృష్ణన్ కమిటీ పై ప్రభుత్వం ఒత్తిడి'
-
'శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి'
ఒంగోలు: తాము చెప్పిన ప్రాంతంలోనే నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంలోనే ఏపీ రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తామని శివరామకృష్ణన్ కమిటీ హామీ ఇచ్చిందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం మాని చిత్తశుద్దితో రైతులకు రుణమాఫీ చేయాలిని కోరారు. కాగా, వెనుకబడిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కె.సి.శివరామకృష్ణన్ కమిటీకి అంతకుముందు సుబ్బారెడ్డి నివేదించారు. రాజధానిని అటు ఆంధ్రా అయినా, ఇటు రాయలసీమ అయినా వెనుకబడిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు రెండింటి మధ్య ఉంటే ఇరు ప్రాంతాల ప్రజలూ హర్షిస్తారని అభిప్రాయపడ్డారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ సూచనలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. రాజధాని ఎంపికపై కీలక సూచనలు, సలహాలు అందజేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించింది. రాయలసీమలో కరువు ఎక్కువగా ఉందని, దీనికి తోడు నీటి సమస్య కూడా ఉందని శివరామకృష్ణన్ కమిటీ వివరించింది. రాయలసీమలో అన్ని ప్రాంతాలకు కేంద్రబిందువుగా ఉండకపోవచ్చని పేర్కొంది. కృష్ణా-గుంటూరు మధ్య రాజధానిని నిర్మించడం అనువుగా ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ ప్రాంతంలో నీటిసమస్య కొత వరకు ఉందని, భూసేకరణ కూడా కష్టమని వెల్లడించింది. జాతీయ స్థాయి వైద్య సంస్థలు అందరికీ అందుబాటులో ఉన్న చోట పెట్టాలని సూచించింది. -
చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. హైదరాబాద్‌లో శనివారం ఉదయం నుంచి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎంపికపై నివేదిక సమర్పించింది. ఈ సమావేశఃలో కమిటీలోని 9 మంది సభ్యులు పాల్గొన్నారు. శివరామకృష్ణన్ కమిటీ త్వరలో మలేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటించనుంది. -
బాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటి
-
రాజధానికి కమిటీతో సంబంధం లేకుండా డిజైన్
-
రాజధాని ప్రతిపాదనలతో హస్తినకు నారాయణ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్‌తో భేటీ కానున్నారు. నారాయణ ఈ సందర్భంగా రాజధానిపై ప్రభుత్వ ప్రతిపాదనలు అందచేయనున్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలి, చేపట్టాల్సిన నిర్మాణాలు, ఇతరత్రా సదుపాయాలు, ఇందుకయ్యే వ్యయం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నివేదికను ఆయన కేంద్ర కమిటీకి అందించనున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని రూపురేఖలు, నిర్మాణానికి సలహాల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ‘రాజకీయ’ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడుకు సన్నిహితులైన మంత్రి నారాయణ నేతృత్వంలోని ఈ కమిటీలో రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), గల్లా జయదేవ్లిద్దరూ పారిశ్రామికవేత్తలే. టీడీపీ ఎంపీలైన వీరిద్దరూ చంద్రబాబుకు సన్నిహితులే. ఈ కమిటీలో ఇతర రంగాల నిపుణులకు చోటు కల్పించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మరో పక్క విజయవాడ - గుంటూరు మధ్యనే రాజధాని అంటూ ముఖ్యమంత్రితోసహా మంత్రులంతా ఇప్పటికే పలుమార్లు ప్రకటించి గందరగోళం సృష్టిస్తున్నారు. -
'ఏపీలో స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసిన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ వచ్చే నెలాఖరులోగా తన నివేదికను అందజేస్తుందని ఆ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... రాజధానితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల అభివృద్ధిపై కూడా కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు. -
సింగపూర్ లాంటి రాజధాని అసాధ్యం
నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అడ్డంకి తిరుపతిలో శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రెవి స్పష్టీకరణ తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్‌కు సింగపూర్ వంటి రాజధాని నిర్మాణం అసాధ్యమని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు ఆరోమర్ రెవి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ప్రొఫెసర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం తిరుపతిలో పర్యటించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు ఆరోమర్ రెవి తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని.. సింగపూర్ వంటి రాజ ధాని నిర్మాణానికి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించదని గుర్తుచేశారు. అంతకువుునుపు కమిటీతో మేథావులు వూట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని ఒక్కచోటే కేంద్రీకరిస్తే మరో విభజన ఉద్యమం పుట్టుకొస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ తిరుపతిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు చిత్తూరు జిల్లాకు చెందిన ఏ ఒక్క మంత్రిగానీ.. ప్రజాప్రతినిధిగానీ హాజరుకాలేదు. -
ఏపీని సింగపూర్‌లా చేయడం సాధ్యంకాదు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం నిర్ణయం కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తిరుపతిలో తన పర్యటను ముగించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌లా చేయడం సాధ్యం కాదని, తాము ఆగస్టు నెలాఖరులోగా నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐదుకోట్ల మంది ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నివేదిక రూపొందిస్తామని చెప్పారు. తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చేయాలని చాలామంది కోరుతున్నారని, అందరి అభిప్రాయాలను కూడా తాము తమ నివేదికలో పొందు పరుస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. కాగా, ఈ కమిటీతో జరిగిన సమావేశానికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు మాత్రం డుమ్మాకొట్టారు. -
సీమలో రాజధాని
సాక్షి, అనంతపురం : ‘కోస్తా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడి రైతులు వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తుంది. పంట భూములను ఇతర అవసరాలకు వాడటం ప్రమాదకరం. దానివల్ల ఆహార కొరత ఏర్పడుతుంది. పైగా కోస్తాలో భూముల ధరలూ ఎక్కువే. అదే అనంతపురం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు జిల్లాలో అనుకూలాంశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ రాజధాని ఏర్పాటు సాధ్యం కాకపోతే.. కనీసం రెండవ రాజధాని ఏర్పాటు చేయండి. అప్పుడు మాత్రమే జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయ’ని శివరామక్రిష్ణన్ కమిటీ సభ్యులకు జిల్లాలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, మేధావులు, విద్యార్థులు విన్నవించారు. రాష్ట్ర రాజధాని ఎంపికపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన శివరామక్రిష్ణన్ కమిటీ సభ్యులు కె.నితిన్, అరోమర్ రెవీ, రవీంద్రన్, జగన్‌షా మంగళవారం అనంతపురంలో పర్యటించారు. సోమవారం రాత్రి న గరానికి చేరుకున్న వారు ఆర్డీటీ అతిథి గృహంలో బస చేశారు. మంగళవారం ఉదయం నగరంలో పర్యటించారు. తొలుత బుక్కరాయసముద్రం చెరువును పరిశీలించారు. ఆ తర్వాత బైపాస్‌రోడ్డు, టవర్ క్లాక్ సర్కిల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఆర్ట్స్ కళాశాల తదితర ప్రాంతాలను సందర్శించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ప్రభుత్వ విప్ యామినీ బాల, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాష, టీడీపీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, వరదాపురం సూరి, ఈరన్న, జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీలు గేయానంద్, శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబుళకొండారెడ్డి, సీపీఐ నాయకుడు రమణ, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తదితరులు తమ డిమాండ్లను కమిటీ సభ్యుల ముందుంచారు. అన్ని రంగాలలో వెనుకబడిన అనంతపురం జిల్లా అభివృద్ధి చెందాలంటే రెండవ రాజధాని ఏర్పాటు చేసి తీరాలన్నారు. ‘ఇప్పటికే మా రక్తమాంసాలను సైతం అమ్ముకున్నాం. ఇక అమ్ముకోవడానికి ఏమీ లేవు. మిగిలింది మా ప్రాణాలే. అనంతపురానికి రాజధాని ఇవ్వలేకపోతే రెండవ రాజధాని ఏర్పాటు చేయాల’ని కోరారు. ‘సార్..మాకు రెండవ రాజధాని ఇప్పించండి ప్లీజ్’ అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు విన్నవించారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కోస్తాంధ్రలో రాజధాని ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మళ్లీ ప్రత్యేక వాదం తలెత్తే అవకాశం ఉందన్నారు.అదే జరిగితే రాయలసీమ, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలు మరోసారి మోసపోవడమే కాకుండా, అభివృద్ధి పరంగా పూర్తిగా వెనుకబడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరిని మభ్యపెట్టడానికి? శివరామక్రిష్ణన్ కమిటీ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పర్యటించిన తరువాత రాయలసీమకు రావడంపై సీపీఐ (న్యూ డెమొక్రసీ), పలువురు ప్రజాసంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. రాజధాని ఎక్కడన్నది ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, కమిటీ పర్యటన ఎవరిని మభ్యపెట్టడానికి అని ప్రశ్నించారు. ‘అనంత’ అన్నివిధాలా అనుకూలం రాజధాని ఏర్పాటుకు అనంతపురం జిల్లా అన్ని విధాలా అనుకూలమని నేతలు వివరించారు. గుత్తి నుంచి హిందూపురం వరకు భూములు విస్తారంగా అందుబాటులో ఉన్నాయన్నారు. మరీ ముఖ్యంగా కళ్యాణదుర్గం, హిందూపురం, పెనుకొండ, కదిరి ప్రాంతాలలో వేలాది ఎకరాల ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయని, దీంతో కొనుగోలు సమస్య తప్పుతుందని వివరించారు. వీటిలో రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరం పట్టుచీరలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. మౌలిక వసతుల పరంగా రైల్వే, రోడ్డు రవాణా వంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ కూడా జిల్లాలోనే ఉందని గుర్తు చేశారు. ఈ డివిజన్‌ను జోన్‌గా మార్పు చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం జిల్లాకు దగ్గరగా ఉందని, పుట్టపర్తి ఎయిర్‌పోర్టును కూడా అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. అనంతపురాన్ని రెండవ రాజధానిగా చేయని పక్షంలో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ విన్నవించారు. సత్యసాయి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసేలా కమిటీ సహకరించాలన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సైతం ఇదే డిమాండ్‌ను కమిటీ ముందుంచారు. -
రాజధానిపై కేంద్రానిదే తుది నిర్ణయం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై ఆగస్ట్‌లోపు కేంద్రానికి నివేదిక అందజేస్తామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ సభ్యులు మంగళవారం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో తుది నిర్ణయం కేంద్రానిదేనని తెలిపారు. రాజధాని ఏర్పాటు విషయంలో ఇప్పటివరకూ అయిదు వేల దరఖాస్తులు అందాయన్నారు. రాజధాని, ఉప రాజధాని అంశాల ప్రతిపాదనలతో తమ నివేదిక ఉంటుందన్నారు. రాయలసీమ పూర్తిగా వెనకబడిందని, ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు వంటి అంశాలను నివేదికలు పొందుపరుస్తామన్నారు. భిన్నమైన ప్రతిపాదనలతో కూడిన నివేదిక రూపొందిస్తామని, అందరి సలహాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. -
రాజధానిగా కర్నూలు
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలునే రాజధాని చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల ప్రతినిధులు శివరామకృష్ణన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రం రాజధానిగా ఉన్న కర్నూలులో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏర్పాటుకు అపార వనరులు ఉన్నాయని, 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదన్నారు. రాజధాని ఏర్పాటు కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సోమవారం కర్నూలులో పర్యటించింది. కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో అసెంబ్లీ నిర్వహించిన భవనాలను కమిటీ సభ్యులు నలుగురు పరిశీలించారు. తొలుత కర్నూలు నగరంలోని కేవీఆర్ కాలేజ్, ఎస్టీబీసీ కళాశాల, టౌన్ మోడల్ స్కూల్, జిల్లా కోర్టు, కొండారెడ్డి బుర్జు లాంటి చారిత్రక కట్టడం, మెడికల్ కళాశాలలోని పురుషుల హాస్టల్, ఏ.. సీ క్యాంపు ప్రాంతాల్ని సందర్శించింది. అనంతరం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో అభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని చేపట్టగా.. వివిధ వర్గాల ప్రజలు వారి అభిప్రాయాలను విన్నవించారు. జగన్నాథగట్టు నుంచి డోన్ వరకు రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టవచ్చని, అనేక ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయని వివరించారు. మిర్చి, పత్తి, టమోటా, ఉల్లి వంటి పంటలు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారని, మౌలిక వసతుల పరంగా రైల్వే, రోడ్డు రవాణా వంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయని తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాలున్న హైదరాబాద్, బెంగళూరు నగరాలు కర్నూలుకు చేరువలోనే ఉన్నాయన్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఈ నగరాన్ని ఎంపిక చేసుకుంటే రాజధాని నిర్మాణం, దాని అభివృద్ధికి పదేళ్లు అవసరం ఉండదని కమిటీకి విన్నవించారు. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఓర్వకల్లు, గడివేముల, నన్నూరు, తంగడంచ తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ బంజరు భూములున్నాయని, దీంతో భూముల కొనుగోలు సమస్య తప్పుతుందని గుర్తు చేశారు. ఈ జిల్లాలో నీటి వనరులు ఉన్నాయని, కృష్ణా, తుంగభద్ర, కుందు నదులు పారుతున్నాయని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల తాగునీటి సమస్య ఏర్పడదని వివరించారు. కాగా కొందరు సీనియర్ సిటిజన్లు మాత్రం కమిటీ తీరుపై ధ్వజమెత్తారు. రాజధాని ఎక్కడా అన్నది నిర్ణయం జరిగాక.. ఇప్పుడు మళ్లీ ఈ కమిటీ పర్యటన, ప్రజల అభిప్రాయసేకరణ ఎందుకు అని కమిటీ సభ్యుల్ని ప్రశ్నించారు. కర్నూలునే మళ్లీ రాజధానిగా ప్రకటించండి.. ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు రాజధానిని కోల్పోయామని, నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా త్వరితగతిన అభివృద్ధి చెందడానికి గల అన్ని వనరులు కర్నూలులో ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకుని స్థానికంగానే రాజధానిని ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రాజధాని నిర్ణయం జరిగిపోయాక తాజాగా కర్నూలు పర్యటనకు ఎందుకొచ్చినట్లని, ఇది కంటి తుడుపు చర్యే? అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, మణిగాంధీ, గౌరు చరిత తదితరులు మాట్లాడారు. -
నాటి అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు పరిశీలన
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై అధ్యయనానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది. పరిశీలనలో భాగంగా కర్నూలులో నాటి అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలను శివరామకృష్ణన్ కమిటీ పరిశీలించింది. అనంతపురం జిల్లాలో కూడా కమిటీ పర్యటించనుంది. రాయలసీమ పర్యటన అనంతరం కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చేందుకు శివరామకృష్ణన్ కమిటీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే కమిటీ విశాఖపట్నం, తిరుపతి, విజయవాడు, గుంటూరు, ఒంగోలు వంటి ప్రాంతాలను పరిశీలించింది. కాగా గుంటూరు, విజయవాడల సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు ప్రయత్నాలను నిరసిస్తున్న సమయంలో శివరామకృష్ణన్ కమిటీ రాయలసీమ పర్యటనకు రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
రేపు అనంతకు శివరామకృష్ణన్ కమిటీ
అనంతపురం: నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై అధ్యయనానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) అనంతపురం జిల్లాలో పర్యటించనుంది. కమిటీ సభ్యులు హైదరాబాద్ నుంచి 7వ తేదీ రాత్రికి అనంతపురం చేరుకుని ఆర్డీటీ అతిథిగృహంలో బస చేస్తారు. 8వ తేదీ మంగళవారం ఉదయం నగరంలోని రెవెన్యూభవన్‌లో ప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు, జిల్లా ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. శివరామకృష్ణన్ కమిటీ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించింది. -
'శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు నన్ను కలిశారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపిక కోసం సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు తనను కలిశారని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే చర్చించారని వెల్లడించారు. ఏపీ కొత్త రాజధాని కోసం రవాణా, మెట్రోరైలు, లింక్‌రోడ్డులు అనుకూలంగా ఉన్న ప్రాంతం కావాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, రైల్వే, పెట్రోలియం, పౌరవిమానయాన రంగాల మద్దతుతో కొత్త రాజధాని నిర్మాణం సాధ్యమని కమిటీ తెలిపిందని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తి మద్దతిస్తుందని శివరామకృష్ణన్ కమిటీకి హామీ ఇచ్చామని వెంకయ్య నాయుడు తెలిపారు. మెడికల్ సీట్లు తగ్గింపు అంశంపై వైద్యశాఖ మంత్రితో మాట్లాడినట్టు చెప్పారు. కాలేజీల్లో తనిఖీలు త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు. సీట్ల అంశంపై రెండు ప్రభుత్వాలను సమావేశపరచాలని సూచించామని చెప్పారు. -
కొత్త రాజధానికి ఉండవలసిన లక్షణాలు
హైదరాబాద్: కొత్త రాజధాని కేవలం అధికార కేంద్రంగానే కాకుండా ఆదాయం - అభివృద్ధికి అనువుగా ఉండటం - తెలుగుదనం ఉట్టిపడేవిధంగా - అందరికీ అందుబాటులో ఉండాలని శివరామ కృష్ణన్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిసింది. కొత్త రాజధాని ఎంపిక కోసం సూచనలు చేయడానికి అర్బన్ డెవలప్మెంట్ మాజీ కార్యదర్శి కెసి శివరామ కృష్ణన్ అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో ఏర్పడిన కమిటీ ఈ రోజు చంద్రబాబును కలిసింది. ఒక ప్రాథమిక నివేదికను ఆయనకు సమర్పించింది. ఈ కమిటీ ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు ప్రకాశం జిల్లాలో పర్యటించింది. రేపు రాయలసీమలో పర్యటించబోయే ఈ కమిటీ ఇప్పటి వరకు తాము పర్యటించిన ప్రాంతాల గురించి చంద్రబాబుతోపాటు ఉన్నతాధికారులకు ఈ కమిటీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్తరాజధాని ఎంపిక విషయంలో కమిటీకి కొన్ని సూచనలు చేశారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా కొత్త రాజధాని నిర్మించడం మన బాధ్యత అని చెప్పారు. కమిటీకి ఆయన చేసిన కొన్ని సూచనలు: 1. కొత్త రాజధాని నగరం అధికారానికి ప్రధాన కేంద్రంగా ఉండటంతోపాటు ఆదాయ మార్గాలు కూడా కలిగి ఉండాలి. 2. అభివృద్ధి చెందడానికి అనువుగా ఉండాలి. 3. రాష్ట్ర ప్రజలు అందరికి అందుబాటులో ఉండాలి. 4.నగరం తెలుగుదనం ఉట్టిపడేవిధంగా మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిభింభించేలా ఉండాలి. 5.నూతన భవన నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా తగిన మౌలిక సదుపాయాలు ఉండాలి. 6.తెలుగువారి బ్రాండ్ వాల్యూ ఉండాలి. 7. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించేదిగా ఉండాలి. 8.రాజధాని నగరంలో ఉండే జనానికి సరిపడ సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండాలి. చంద్రబాబు నాయుడు సూచనలు, ఆయన చెప్పిన లక్షణాలు అన్ని ఒక్క విజయవాడ-గుంటూరు ప్రాంతానికే ఉన్నట్లు భావిస్తున్నారు. మొదటి నుంచి చంద్రబాబు కూడా ఈ ప్రాంతంపైనే దృష్టిపెట్టారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా ఈ రెండు నగరాల మధ్యన ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల ఖాళీ స్థలంలో చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి కూడా ఎక్కువ మంది రాజకీయ నేతలు, అధికారులు, ప్రజలు ఈ ప్రాంతాన్నే కొత్త రాజధానికి అనువైనదిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
రాజధాని ఎంపికపై చంద్రబాబుతో కమిటీ భేటి
హైదరాబాద్: రాజధాని ఎంపిక అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో శివరామకృష్ణన్ కమిటీ శనివారం భేటి కానుంది. రాష్ట్ర విభజన అనంతరం రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చంద్రబాబుతో కమిటీ చర్చలు జరుపనుంది. రాజధాని ఎక్కడ అనే అంశం చర్చించకుండానే యూపీఏ ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్ ను విభజన చేసింది. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పాటైన ప్రభుత్వం రాజధానిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని ఎంపికపై ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో శివరామన కమిటీ పర్యటించింది. రాజధాని ఎంపిక తమ పనికాదని, తమది టెక్నికల్ నివేదిక మాత్రమేనని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్ రాయ్ గతంలో చెప్పారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వనరులకు సంబంధించిన సాంకేతికపరమైన వివరాల సేకరణ కోసమే తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఇన్చార్జి చైర్మన్ డాక్టర్ రతన్‌రాయ్ పర్యటన సందర్భంగా మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
విజయవాడలో శివరామకృష్ణన్ కమిటీ పర్యటన
-
'రాజధాని ఏదనేది ముందుగా నిర్ణయించుకుని రాలేదు'
రాజధాని ఏదనేది ముందుగా నిర్ణయించుకుని రాలేదని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్ రాయ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికలో భాగంగా ఆదివారం రాజమండ్రి వచ్చిన ఆ కమిటీ సభ్యులు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో కమిటీ సభ్యులలో ఒకరైన రతన్‌రాయ్ మాట్లాడారు. రాజధానిపై తుది నివేదిక ఆగస్టు 31 నాటికి కేంద్ర హోంశాఖకు అందజేస్తామన్నారు. రాజమండ్రిలోని ప్రభుత్వ భూములు, నీటి లభ్యత తదితర అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ అనారోగ్యం కారణంగానే రాలేదని రతన్ రాయ్ విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటు అయిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం విశాఖపట్నంలో పర్యటించింది. అనంతరం ఆ జిల్లా ఉన్నతాధికారులలో సమావేశమై పలు అంశాలపై చర్చింది. అయితే ఆ కమిటీ సభ్యుల పర్యటన అంతా చాలా గోప్యంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం విశాఖపట్నం నుంచి కమిటీ సభ్యులు రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి నగరంలో పర్యటించిన అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. అనంతరం ఆ కమిటీ సాయంత్రం విజయవాడ చేరుకోనుంది. -
రాజధానిని నిర్ణయించేది కేంద్రమే
మాది సాధికార కమిటీ కాదు... సాంకేతిక వివరాలు మాత్రమే సేకరిస్తాం సీమాంధ్ర రాజధాని కమిటీ స్పష్టీకరణ సాక్షి, విశాఖపట్నం: సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వనరులకు సంబంధించిన సాంకేతికపరమైన వివరాల సేకరణ కోసమే తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఇన్చార్జి చైర్మన్ డాక్టర్ రతన్‌రాయ్ చెప్పారు. రాజధానిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. చైర్మన్ శివరామకృష్ణన్ రాకపోవడంతో ఈ కమిటీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డెరైక్టర్ డాక్టర్ రతన్‌రాయ్ నేతృత్వం వహిం చారు. ఈ కమిటీ సభ్యులు శనివారం విశాఖ నగరం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రాజధాని ఏర్పాటుకు ఇక్కడ ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహంలో కమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. రాజధానికి అవసరమైన వనరులను పరిశీలించేందుకు తొలిసారిగా విశాఖ వచ్చినట్లు రాయ్ చెప్పారు. సీమాంధ్రలో ప్రధానమైన జిల్లాలను సందర్శించి అక్కడి మౌలిక వసతులు, సాంకేతిక అంశాలతో నివేదిక తయారు చేసి ఆగస్టు 31వ తేదీ నాటికి కేంద్ర హోం శాఖకు అందజేస్తామని తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి అన్ని శాఖల నుంచి పూర్తి సమాచారం సేకరించినట్లు చెప్పారు. విశాఖ రాజధానిగా చేయడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని నావికాదళం అధికారులు చెప్పారా అని విలేకరులు ప్రశ్నించగా.. సాంకేతిక పరమైన అంశాల సేకరణకే తాము వచ్చామని, ఎవరి నుంచి అభిప్రాయాలను స్వీకరించలేదని రాయ్ చెప్పారు. రాజధానికి విశాఖ అనుకూలమా అని అడగ్గా.. రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడున్నాయో మాత్రమే ప్రభుత్వానికి నివేదిస్తామని, తుది నిర్ణయం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఆదివారం రాజమండ్రి, విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలో కూడా పర్యటించి అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని చెప్పారు. అవసరమైతే మరోసారి కూడా సీమాంధ్రలో పర్యటిస్తామన్నారు. అనారోగ్యం కారణంగా కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ రాలేకపోయారని, ఆయన త్వరలోనే తమతో పాలుపంచుకుంటారని తెలిపారు. వివిధ ప్రాంతాల పరిశీలన తొలుత ఈ బృందం విశాఖ నగర శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. భూములు, నీరు, భవనాల లభ్యతపై ఆరా తీసింది. రెవెన్యూ యంత్రాంగం గతంలో ఇచ్చిన నివేదిక మేరకు మధురవాడ, ఆనందపురం, పెందుర్తి, పరవాడ, అచ్యుతాపురం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాల్ని పరిశీలించింది. సర్వే నంబర్లవారీగా ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు స్థలాలు ఖాళీగా ఉన్నాయి, అవి దేనికి అనుకూలంగా ఉంటాయో వివరాలు సేకరించింది. నగరాన్ని ఆనుకుని ఉన్న దేవాదాయ, వక్ఫ్, అటవీ భూములపై ఆరా తీసింది. మధ్యాహ్నం వుడా కార్యాలయంలో కలెక్టరేట్, వుడా, జీవీఎంసీ, రెవెన్యూ, భూగర్భ జల శాఖ, ఏయూ తదితర ప్రధాన విభాగాల ప్రతినిధులతో కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. వారిచ్చిన నివేదికల్ని నిశితంగా పరిశీలించి, సందేహాలును నివృత్తి చేసుకుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఆదాయ, వ్యయాలపై ప్రత్యేకంగా చర్చించింది. ధరల సూచీ ఆధారంగా జీవీఎంసీ ఆస్తి పన్ను పెరగకపోవడంపై ఆరా తీసింది. జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్టుల ప్రగతి, భవిష్యత్ ప్రాజెక్టుల ప్రతిపాదనలను తెలుసుకుంది. ఏయూ పరిధిలోని విద్యా సంస్థలు, వాటి విస్తీర్ణంపైనా వర్సిటీ ఆచార్యులతో కమిటీ చర్చించింది. వినతుల వెల్లువ విశాఖలో రాజధానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని కోరుతూ పలు ప్రజా సంఘాల ప్రతినిధులు కమిటీకి వినతిపత్రాలు అందజేశారు. ప్రత్యేక జోన్ డిమాండ్ ఉన్న రైల్వే, మేజర్ పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయం, సువిశాల తీరప్రాంతం, పెట్రో కారిడార్, ఐటీతోపాటు పారిశ్రామికంగా అన్ని విధాలా అభివృద్ధికి అనువైన వాతావరణం ఇక్కడ ఉందని తెలిపారు. ప్రతిపాదనల్లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాల్ని పేర్కొన్నారు. విశాఖను మించి రాజధానిగా అర్హతలున్న మరే నగరం సీమాంధ్రలో లేదని ఆ వినతుల్లో తెలిపారు. విశాఖలో పర్యటించిన కమిటీలో డాక్టర్ రాయ్‌తోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డెరైక్టర్ అరోమర్ రవి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ డెరైక్టర్ జగన్ షా, న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ ఆచార్య కె.టి.రవీంద్రన్, హైదరాబాద్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.తిమ్మారెడ్డి ఉన్నారు. -
సీమాంధ్ర రాజధాని ఎంపిక... నేడు శివరామకృష్ణన్ కమిటీ రాక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ముగియడంతో సీమాంధ్రకు రాజధాని ఎంపిక ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తే మేలన్న అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఉన్నతాధికారుల బృందం వస్తోంది. 9న విశాఖ, 10న రాజమండ్రి, 11న విజయవాడ, 12న గుంటూరు సందర్శించి 13న హైదరాబాద్‌లో అధికారులతో భేటీ అవుతుంది. 14న ఒంగోలు, తిరుపతి, కర్నూలు ప్రాంతాలను పరిశీలించి ఢిల్లీ తిరిగి వెళ్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కమిటీ ఇప్పటికే ఢిల్లీలో రెండుసార్లు సమావేశమైంది. 12 అనిల్ గోస్వామి రాక విభజన ప్రక్రియను సమీక్షించడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి 12న హైదరాబాద్ వస్తున్నారు. విభజన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఎప్పటికి పూర్తవుతుంది, వేగవంతం చేసే అవకాశాలు తదితరాలను పరిశీలించి సూచనలు చేయనున్నారు. గోస్వామితో పాటు హోం శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, 22 కమిటీల ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. విభజన ప్రక్రియను మే 15కల్లా పూర్తి చేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇప్పటికే డెడ్‌లైన్ విధించడం తెలిసిందే. -
రాజధాని ఎంపికపై 24న తొలి భేటీ
-
రాజధాని ఎంపికపై 24న తొలి భేటీ
ఢిల్లీలో సమావేశం కానున్న శివరామకృష్ణన్ కమిటీ ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీకి రేపు ప్రత్యూష సిన్హా కమిటీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపికకు ఏర్పాటైన కమిటీ తొలిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో సమావేశం కానుంది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ కొత్త రాజధాని ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనుంది. రాజ్‌భవన్, సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, అతిథి గృహాలు, ఇతర నిర్మాణాలతోపాటు సహజ వనరులు, నీటి వసతి, రవాణా తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. వీటిని అనుసరించి కొత్త రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు ఏమిటో కమటీ చర్చించనుంది. అదేవిధంగా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీపై ఏర్పాటైన ప్రత్యూష సిన్హా కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలను ఈ సమావేశంలో ఖరారు చేయవచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డెరైక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి, మిగతా వారిని రోస్టర్ విధానంలో కేటాయించాలని ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయానికి వచ్చింది. మంగళవారం జరిగే సమావేశంలో దీనికి తుదిరూపం ఇవ్వనుంది. రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీకి ఏర్పాటైన కమలనాథన్ కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలకు తుదిరూపు ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్ర పున ర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న పలు అంశాలపై కేంద్రం తీసుకోవాల్సిన అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఈనెల 24న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రసన్నకుమార్ మహంతి పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ భవన్ శబరి బ్లాక్ ఆంధ్రాకు,స్వర్ణముఖి తెలంగాణకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ పంపిణీ కోసం రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు, సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ప్రత్యేక కార్యదర్శి రమణారెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వీరు 19 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఏపీ భవన్‌ను సందర్శించి ఇరు ప్రాంతాలకు పంపిణీ చేయాల్సిన బ్లాక్‌లు, గదులపై బ్లూప్రింట్‌ను రూపొందించి, గవర్నర్‌కు ఇవ్వనున్నారు. ఇక్కడి శబరి బ్లాక్‌ను ఆంధ్రప్రదేశకు, సర్వముఖి బ్లాక్‌ను తెలంగాణకు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు. గోదావరి బ్లాకులో ఉన్న గదులను జనాభా నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా వినియోగించుకోవాలని ప్రతిపాదించనున్నారు. ఆదాయ వనరులపై నేడు కేంద్ర అధికారులతో ఎస్.పి. సింగ్ భేటీ ఆదాయ వనరుల పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర అధికారులతో భేటీ కానున్నారు. అలాగే ఇరు రాష్ట్రాల్లో ఆదాయ వనరుల సమీకరణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధ్యయనం చేయడానికి ఆయన 24వ తేదీన పాట్నా, 29న రాయ్‌పూర్ వెళ్లనున్నారు. ఈ మేరకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.