
ఏపీని సింగపూర్‌లా చేయడం సాధ్యంకాదు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం నిర్ణయం కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తిరుపతిలో తన పర్యటను ముగించుకుంది. ఆంధ్రప్రదేశ్ను సింగపూర్లా చేయడం సాధ్యం కాదని, తాము ఆగస్టు నెలాఖరులోగా నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐదుకోట్ల మంది ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నివేదిక రూపొందిస్తామని చెప్పారు.
తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చేయాలని చాలామంది కోరుతున్నారని, అందరి అభిప్రాయాలను కూడా తాము తమ నివేదికలో పొందు పరుస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. కాగా, ఈ కమిటీతో జరిగిన సమావేశానికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు మాత్రం డుమ్మాకొట్టారు.