అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై ఆగస్ట్లోపు కేంద్రానికి నివేదిక అందజేస్తామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ సభ్యులు మంగళవారం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో తుది నిర్ణయం కేంద్రానిదేనని తెలిపారు.
రాజధాని ఏర్పాటు విషయంలో ఇప్పటివరకూ అయిదు వేల దరఖాస్తులు అందాయన్నారు. రాజధాని, ఉప రాజధాని అంశాల ప్రతిపాదనలతో తమ నివేదిక ఉంటుందన్నారు. రాయలసీమ పూర్తిగా వెనకబడిందని, ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు వంటి అంశాలను నివేదికలు పొందుపరుస్తామన్నారు. భిన్నమైన ప్రతిపాదనలతో కూడిన నివేదిక రూపొందిస్తామని, అందరి సలహాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.
రాజధానిపై కేంద్రానిదే తుది నిర్ణయం
Published Tue, Jul 8 2014 2:34 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement