
సాక్షి, అనంతపురం : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనపై రాయలసీమ ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయన రాయలసీమ ద్రోహి అంటూ ప్రజా సంఘాలు నేతలు, ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని బాబు అమలు చేయలేదని విమర్శించారు. రాయలసీమను అనేక సందర్భాల్లో చంద్రబాబు అవమానించారని ప్రజా సంఘాలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. బాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో పలువురు ప్రజా సంఘాల నేతల్ని హిందూపురంలో పోలీసులు అరెస్టు చేశారు.