
రాయలసీమ జేఏసీ నేతలు
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి అనంతపురంలో చేదు అనుభవం ఎదురైంది. సుభాష్ రోడ్డులో విరాళాలు సేకరిస్తున్న సమయంలో రాయలసీమ జేఏసీ నేతలు ఆయన్ని అడ్డుకున్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో జ్యుడిషియల్ క్యాపిటల్‌ను ఎందుకు సమర్థించలేదని నిలదీశారు. దీంతో ఆందోళనకారులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు రాయలసీమ ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేశారు.
కాగా, పరిపాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని నిరసన సెగలు వెంటాడుతున్నాయి. అంతకు క్రితం కొడికొండలో చంద్రబాబును ప్రజా సంఘాలు, స్థానికులు అడ్డుకున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయలసీమ ద్రోహి అంటూ చంద్రబాబు వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. రాయలసీమలో హైకోర్టు వ్యతిరేకిస్తున్న చంద్రబాబాకు అనంతపురంలో పర్యటించే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment