సాక్షి, అనంతపురం : పరిపాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని నిరసన సెగలు వెంటాడుతున్నాయి. తాజాగా అనంతపురం ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలోని కొడికొండలో ఉద్రిక్తత నెలకొంది. కొడికొండలో చంద్రబాబును ప్రజా సంఘాలు, స్థానికులు అడ్డుకున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయలసీమ ద్రోహి అంటూ చంద్రబాబు వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. రాయలసీమలో హైకోర్టు వ్యతిరేకిస్తున్న చంద్రబాబాకు అనంతపురంలో పర్యటించే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల భద్రత నడుమ చంద్రబాబు బస్సు యాత్ర కొనసాగుతోంది. (గోబ్యాక్ చంద్రబాబు ..!)
Comments
Please login to add a commentAdd a comment