
'సమదూరం ఆధారంగానే రాజధాని ఎంపిక'
న్యూఢిల్లీ: సమన్యాయం, సమదూరం ఆధారంగానే రాజధాని ఎంపిక ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తెలిపారు. కృష్ణా-గుంటూరు మధ్య అటవీ, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. 11 జాతీయ సంస్థలు 11 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. శాస్త్రీయంగానే రాజధాని నిర్మాణం ఉంటుందని హామీయిచ్చారు.
శివరామకృష్ణన్ కమిటీతో గురువారం ఆయన సమావేశమయ్యారు. 10 రోజుల్లో ముసాయిదా నివేదిక సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా శివరామకృష్ణన్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని మధ్యలో ఉండాలన్న ప్రతిపాదనకు అంగీకరించినట్టు చెప్పారు.