
ఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించే నిధులపై స్పష్టత లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గురుమూర్తి.. సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాజధానికి కేంద్రం అందిస్తున్న నిధులపై స్పష్టత లేదన్నారు.
15 వేల కోట్ల రూపాయల సహాయం అందిస్తామన్న కేంద్రం 1500 కోట్లకే పరిమితం కావడం ఏమిటి ? , మిగిలిన సొమ్ముకు తాము కేవలం ఫెసిలిటేటర్ గానే వ్యవహరిస్తామని చెబుతోంది. రాజధాని అప్పుల చెల్లింపు బాధ్యత తమదేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఇప్పటికే ఏపీ అప్పుల కుప్పగా మారింది.
ఏపీ శ్రీలంక, జింబాబ్వే గా మారిందని గతంలో గగ్గోలు పెట్టిన కూటమి నేతలు రాజధాని అప్పులపై ఏం మాట్లాడుతారు. అలాగే రాజధానికి ఇస్తున్న అప్పుల కు విధిస్తున్న షరతులు , నిబంధనలేమిటో బయట పెట్టలేదు. ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు పన్నులు పెంచాలని, సంస్థలను తాకట్టు పెట్టమని షరతులు పెడుతుంటాయి. అలాంటి షరతులు రాజధాని అప్పులకు ఏమైనా విధించారా? ఉంటే వాటిని బహిరంగపరచాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment