'శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు నన్ను కలిశారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపిక కోసం సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు తనను కలిశారని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే చర్చించారని వెల్లడించారు. ఏపీ కొత్త రాజధాని కోసం రవాణా, మెట్రోరైలు, లింక్‌రోడ్డులు అనుకూలంగా ఉన్న ప్రాంతం కావాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, రైల్వే, పెట్రోలియం, పౌరవిమానయాన రంగాల మద్దతుతో కొత్త రాజధాని నిర్మాణం సాధ్యమని కమిటీ తెలిపిందని చెప్పారు.
కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తి మద్దతిస్తుందని శివరామకృష్ణన్ కమిటీకి హామీ ఇచ్చామని వెంకయ్య నాయుడు తెలిపారు. మెడికల్ సీట్లు తగ్గింపు అంశంపై వైద్యశాఖ మంత్రితో మాట్లాడినట్టు చెప్పారు. కాలేజీల్లో తనిఖీలు త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు. సీట్ల అంశంపై రెండు ప్రభుత్వాలను సమావేశపరచాలని సూచించామని చెప్పారు.