
సింగపూర్ లాంటి రాజధాని అసాధ్యం
నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అడ్డంకి
తిరుపతిలో శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రెవి స్పష్టీకరణ
తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్‌కు సింగపూర్ వంటి రాజధాని నిర్మాణం అసాధ్యమని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు ఆరోమర్ రెవి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ప్రొఫెసర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం తిరుపతిలో పర్యటించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు ఆరోమర్ రెవి తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని..
సింగపూర్ వంటి రాజ ధాని నిర్మాణానికి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించదని గుర్తుచేశారు. అంతకువుునుపు కమిటీతో మేథావులు వూట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని ఒక్కచోటే కేంద్రీకరిస్తే మరో విభజన ఉద్యమం పుట్టుకొస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ తిరుపతిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు చిత్తూరు జిల్లాకు చెందిన ఏ ఒక్క మంత్రిగానీ.. ప్రజాప్రతినిధిగానీ హాజరుకాలేదు.