అటవీ ప్రాంతంలో రాజధానా ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ఏర్పాటైన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అటవీ ప్రాంతంలోనా అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఎవరికి ఏమి లాభమని ఆయన అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ప్రొ.శివరామకృష్ణన్ కమిటీపై జరిగిన చిట్ చాట్లో యనమల మాట్లాడుతూ... నగరాల మధ్యే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉంటేనే అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని ఏర్పాటుపై ఇతర పార్టీల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదని యనమల స్పష్టం చేశారు.