ప్రపంచస్థాయి రాజధాని లక్ష్యం: యనమల | andhrapradesh budget highlets | Sakshi
Sakshi News home page

ప్రపంచస్థాయి రాజధాని లక్ష్యం: యనమల

Published Wed, Mar 15 2017 10:50 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

ప్రపంచస్థాయి రాజధాని లక్ష్యం: యనమల - Sakshi

ప్రపంచస్థాయి రాజధాని లక్ష్యం: యనమల

విజయవాడ: దేశంలోనే ఆంధప్రదేశ్‌ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌ను బుధవారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం దేశానికే ఆదర్శంగా ఉంటుందన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకే రాజధానిని అమరావతికి తరలించామని తెలిపారు. 9 రంగాల ఆధారంగా రాజధాని నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

  • ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలన్నదే మన ప్రయత్నం
  • ఒకవైపు ప్రాచీన సంస్కృతిలో వేళ్లూనికొని.. మరోవైపు ప్రపంచస్థాయి ఆకాంక్షలకు రాజధాని అద్దం పట్టాలి.
  • మన రాజధాని నగరం దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలబడనుంది
  • 9 రంగాల ఆధారంగా రాజధాని నిర్మాణం
  • రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటు లాంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం.
  • గత రెండున్నరేళ్లకాలంలో వివిధ ప్రమాణాల ప్రకారం మనం గొప్ప పురోగతి సాధించాం
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం
  • రాష్ట్ర రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు
  • 192 రోజుల్లోనే నూతన శాసనసభ భవనాన్ని నిర్మించుకోగలిగాం
  • ఏడాది వ్యవధిలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేశాం
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టేదిశగా కదులుతున్నాం
  • ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ సాధించాం
  • విజన్‌ 2029 నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుంది
  • మా ప్రభుత్వం జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలు గెలుచుకుంది
  • శక్తి, ఇంధన రంగాల్లో రాష్ట్రానికి ఐదు పురస్కారాలు దక్కాయి
  • 1-7-2017 నుంచి జీఎస్టీన ప్రవేశపెట్టబోతున్నాం
  • అన్ని రకాల పన్నులను జీఎస్టీ ద్వారా వసూలు చేయడం(పెట్రోలియం, మద్యపానీయాల పన్నులు మినహా) వల్ల రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది. పన్నుల ఎగవేత తగ్గుతుంది
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార నిర్వహణకు ఆకర్షణీయ గమ్యంగా 'సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌'ను చూస్తున్నారు.
  • పెద్దనోట్ల రద్దుతో ఎదురైన కష్టనష్టాలను తట్టుకొని ఏపీ ప్రజలు నిలబడగలిగారు
  • డిజిటల్‌ చెల్లింపుల పద్ధతుల్ని అమలుపరచడంలో మనం దేశానికే మార్గదర్శకంగా ఉన్నాం.
  • ఈ ఏడాది 27 శాతం వర్షపాతం తక్కువగా ఉన్నా వ్యవసాయంలో ప్రగతి సాధించాం
  • నీతి ఆయోగ్‌ వ్యవసాయ సూచికలో రాష్ట్రానికి 7వ స్ధానం
  • ఈ బడ్జెట్‌ ద్వారా సుస్ధిర ఆర్ధికాభివృద్ధి, ఆర్ధిక ప్రగతి సాధించనున్నట్లు ఆర్ధిక మంత్రి చెప్పారు

 

బడ్జెట్‌ వ్యయం వర్గీకరణ

  • ఇప్పటివరకు బడ్జెట్‌ను ప్రణాళికా, ప్రణాళికేతర పద్దుల వర్గీకరించగా.. ఇకనుంచి బడ్జెట్‌ వ్యయాన్ని రెవెన్యూ వ్యయం-క్యాపిటల్‌ వ్యయాలుగా వర్గీకరించారు.
  • 2017-18 ఆర్ధిక సంవత్సరానికి రూ.1,56,999 కోట్లతో బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం రూ.1,25,912 కోట్లు కాగా, క్యాపిటల్‌ వ్యయం రూ.31,087 కోట్లు
  • 2016-17లో రెవెన్యూలోటు రూ.4,597 కోట్లు(రాష్ట్ర జీడీపీలో 0.73 శాతం), ఆర్ధిక లోటు రూ.19,163 కోట్లు (రాష్ట్ర జీడీపీలో 3.06 శాతం)
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ సదుపాయాలపై సుస్థిర శ్రద్ధ
  • రైతుల రుణమాఫీకి తదుపరి వాయిదా కింద రూ.3,600 కోట్ల కేటాయింపు
  • పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి రంగాలకు రూ.21,140 కోట్లు
  • ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ రూ. 7,021 కోట్లు
  • పట్టణాభివృద్ధికి రూ.5,207 కోట్లు
  • నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం కోసం రూ. 500 కోట్లు
  • వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.9,091కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ.19,565 కోట్లు
  • పర్యావరణం, అడవులు, సైన్సు, టెక్నాలజీ శాఖకు రూ.384 కోట్లు
  • పారిశ్రామిక కారిడార్లకు రూ.369 కోట్లు, ఆర్‌అండ్‌బీకు రూ.73 కోట్లు
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్ధల పునరుద్ధరణకు రూ.125 కోట్లు, ఇందుకోసం ప్రత్యేక సంస్ధను ఏర్పాటు చేసే యోచన
  • పరిశ్రమల శాఖకు రూ.2,086 కోట్లు
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖకు రూ.364 కోట్లు
  • పర్యాటక రంగం రూ.285 కోట్లు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ రూ.72 కోట్లు
  • స్ట్రీలు, శిశువులు, వికలాంగులు, సీనియర్‌ పౌరుల సంక్షేమానికి రూ.1,773 కోట్లు
  • గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగుల కోసం రూ.1,456 కోట్లు
  • డా.ఎన్‌టీఆర్‌ వైద్య సేవకు రూ.1000 కోట్లు
  • గ్రామీణ రోడ్లకు రూ.262 కోట్లు
  • నైపుణ్యాల అభివృద్ధికి రూ.398 కోట్లు
  • దేశంలో పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది
  • రానున్న సంవత్సరం వ్యవసాయాభివృద్ధికి రూ. 7,342 కోట్లు కేటాయింపు
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 6.78శాతం వాటాతో మత్స్యరంగం గణనీయస్థానంలో ఉంది
  • మాంసం ఉత్పత్తిలో నాలుగో స్ధానం, పాల ఉత్పత్తిలో ఐదో స్ధానంలో ఉన్నాం. ఏపీని ఇండియా ఆక్వాహబ్‌గా పరిగణిస్తున్నారు.
  • ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతానికి 8 మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు
  • కృష్ణపట్నంలో కోస్టల్‌ ఎకనమిక్‌ ఎంపాయిమెంట్‌ జోన్‌ ఏర్పాటుకు చర్యలు
  • జెరూసలెం యాత్ర సబ్సిడీ రూ. 20 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement