donakonda
-
Amaravati: రాజధాని అను ఒక ‘రియల్’ ఎజెండా
పునర్వ్యవస్థీకరణ అనంతరం, కొత్తగా ఏర్పడ బోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం శివరామకృష్ణన్ చైర్మన్‌గా ఒక కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ కేంద్ర పట్టణాభి వృద్ధి శాఖకు మాజీ కార్యదర్శి. కమిటీ సభ్యులలో అందరూ సంబంధిత రంగంలో నిపుణులే. కమిటీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివి : విజిటిఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) పరిధిలో ఇప్పటికే భూముల ధరలు పెరిగిపోయాయి కనుక నీటి వనరులు, రవాణా, రక్షణ, చారిత్రక అంశాల ఆధారంగా రాజధాని నిర్మాణ ప్రదేశం ఎంపిక చేయాలి. విశాఖపట్నంలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయవచ్చు. నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండవలసిన అవసరం లేదు. విశాఖపట్నంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి. విశాఖపట్నంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. అసెంబ్లీ, రాజధాని నిర్మాణానికి అయిదు సంవత్సరాల కాలం పట్టవచ్చు. ఇంత స్పష్టంగా శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను అందించినప్పటికీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నివేదికను బుట్టదాఖలు చేసి, తన ‘రాజకీయ గురువు’ సూచించిన ‘అమరావతి’ పేరుతో రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అందులో భాగంగా 2014 జూలై 14న ‘నారాయణ కమిటీ’ని నియమించారు. ఆ కమిటీలో సభ్యులను చంద్రబాబు ప్రభుత్వమే నియమించింది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్ చౌదరి, మండవ ప్రభాకర్ చౌదరి, మరో ఐదుగురు సభ్యులతో ఆ కమిటీ ఏర్పడింది. అనంతరం రాజధాని ఏర్పాటుపై లీకులు మొదలయ్యాయి. నారాయణ కమిటీ రిపోర్టు పేరుతో దొనకొండ, నూజివీడు, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రాంతం ఉండవచ్చని ప్రచారాలు మొదలు పెట్టారు. అది నమ్మి కొందరు దొనకొండ, నూజివీడుల్లో వేల ఎకరాల భూములు కొని మోసపోయారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు, ఆయన సామాజిక వర్గ నేతలు మాత్రం సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రాంతంలో భూములు కొన్నారు. మొదట నాగార్జున యూనివర్సిటీ దగ్గర, విజయవాడ–గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని రావచ్చని చంద్రబాబు తనకు చెప్పారని నక్కా ఆనంద్‌బాబు ఏబీఎన్ ఇంటర్వ్యూలో బహిర్గతం చేశారు. తర్వాత స్వయంగా చంద్రబాబే నర్మగర్భంగా గుంటూరు–విజయవాడ మధ్య రాజధాని వస్తుందని 2014 సెప్టెంబర్ 4న శాసనసభలో ప్రకటించారు. 2014 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. కానీ 2014 సెప్టెంబర్‌లోనే కొంతమంది చంద్రబాబు అనుయాయులు 29 గ్రామాల పరిసరాల్లోని భూములు కొని అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు! ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్‌కు ముందే జరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి నిర్మాణం పేరుతో 34,000 ఎకరాల భూ సేకరణకు పూనుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని శాసన సభ, శాసన మండలి, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను 200 ఎకరాల్లోనే ఉంచడం గమనించాల్సిన విషయం. ఏపీసీఆర్డీఏ యాక్ట్ ఫామ్ 9.14 బీ ప్రకారం ల్యాండ్ పూలింగ్‌లో ఒక్కో ఎకరానికి 250 సెంట్లు అభివృద్ధి చేసిన ప్లాటు ఇచ్చే విధంగా రైతులతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని ప్రకటనకు ముందు సీఆర్డీఏ ప్రాంతంలో ఎకరం రూ.15 లక్షలు ఉండేది. అయితే ‘హ్యాపీనెస్ట్’ పేరుతో జరిగిన విక్రయాల్లో ఎకరానికి రూ.10 కోట్ల రేటుకు సీఆర్డీఏ అమ్మింది. అంటే ల్యాండ్ పూలింగ్‌లో భూమి ఇచ్చిన ప్రతి రైతు ఎకరానికి రూ.2.5 కోట్లు లబ్ధి పొందినట్లేగా! ఇందులో త్యాగం ఎక్కడుంది? 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్దండరాయని పాలెంలో రాజధానికి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకు హాజరు కాలేకపోవటానికి కారణాలు చూపుతూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15నే చంద్రబాబుకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కున్న విధానం, కమీషన్ల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా ఇస్తూ సీఆర్డీఏ 42 శాతం తీసుకోవటంలో ఉన్న స్కామ్‌ను తెలియ జేస్తూ.. చంద్రబాబు తన వర్గాన్ని బినామీలుగా పెట్టుకుంటూ భూదోపిడీకి పాల్పడుతున్నందున శంకుస్థాపనకు తనను ఆహ్వానించవద్దని నిర్మొహమాటంగా తెలియజేశారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) గుంటూరు–విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఇచ్చింది. నవ నగరాల నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే అమరావతిలో చంద్రబాబు 5 ఏళ్లలో కేవలం రూ.5,674 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు (ఇందులో సుమారు రూ.2,500 కోట్లు బకాయిలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది). అంటే ప్రతి సంవత్సరం పెరిగే ధరలను దృష్టిలో పెట్టుకుంటే రాజధాని నిర్మాణానికి మరో 100 ఏళ్లు పడుతుంది. అయితే రాజధానిని ఆర్నెల్లలో పూర్తి చేయాలని 2022 మార్చి 3న ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని భూ యజమానులకు చెందిన పునర్నిర్మిత ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలనీ; అమరావతి రాజధాని నగరంలో నివాసానికి అనువుగా ఉండేలా అప్రోచ్ రోడ్లు, తాగునీరు, ప్రతి ప్లాట్‌కు విద్యుత్ కనెక్షన్, డ్రైనేజీ మొదలైనవి ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది! (క్లిక్ చేయండి: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు) - పొనకా జనార్దన రెడ్డి మహా ప్రశాసకులు, ఏపీ ప్రభుత్వం -
వింత ఆచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా..
దొనకొండ(ప్రకాశం జిల్లా): పెళ్లి తంతులో వరుడు వధువుగా, వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు, దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు. తమ ఇళ్లలో వివాహం జరిగితే.. తాము కొలిచే ఎల్లమ్మ దేవత ఆచారం ప్రకారం వివాహమైన మరుసటి రోజు వధువు వరుని వేషం, వరుడు వధువు వేషం వేసి నాగుల పుట్ట దగ్గరకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. బొల్లావు సంబరాలతో వధూవరులు గ్రామ పురవీధుల్లో తప్పెట్లు, కొమ్ము ఊదుకుంటూ ఊరేగింపుగా పుట్ట దగ్గరికి వెళతారు. ఇండ్లచెరువుకు చెందిన గుమ్మా వంశానికి చెందిన వారు వివాహ సందర్భంగా శనివారం ఇలా వేషాలు మార్చుకుని మొక్కులు తీర్చుకున్నారు. -
వెంబడించి వివాహితపై లైంగిక దాడి.. భర్తకు ఆలస్యంగా తెలియడంతో..
సాక్షి, ప్రకాశం(దొనకొండ): ఓ వివాహితపై లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక దాడి కేసుతో పాటు అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు ఎస్ఐ కొత్తపల్లి అంకమ్మ శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన 22 ఏళ్ల మహిళను పుల్లలచెరువు మండలంలోని ఓ వ్యక్తికి ఇచ్చి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. పుట్టింట్లో ఉన్న ఆమె గత నెల 25వ తేదీ సాయంత్రం బహిర్భూమికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన మాదిరెడ్డి వెంకటరెడ్డి వెంబండించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు ఆందోళన చెందింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న భర్త.. తనకు విడాకులు ఇవ్వాలంటూ భార్యపై ఒత్తిడి చేశాడు. చివరకు ఆమె దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డికి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ ఆదేశాల మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం..) -
దర్శిలో కిడ్నాపైన పసికందు క్షేమం
సాక్షి, ప్రకాశం: నెల రోజుల వయసున్న శిశువు కిడ్నాప్‌కు గురై, ఆ వెంటనే తల్లి ఒడిని చేరిన ఘటన ప్రకాశం జిల్లాలోని దర్శిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొనకొండ మండలం పోలేపల్లికి చెందిన మరియమ్మకు నెల రోజుల వయసున్న బిడ్డ ఉంది. ఆ పాపపై కన్నేసిన ఓ గుర్తు తెలియని మహిళ తనను అంగన్వాడీ టీచర్‌గా మరియమ్మకు పరిచయం చేసుకుంది. ప్రభుత్వం నుంచి మహిళలకు డబ్బు వస్తుందని నమ్మించి, ఫొటోలు దిగేందుకు దర్శి రావాలని ఆమెను నమ్మించింది. (చదవండి: చిన్నారి అంజి కిడ్నాప్ కథ విషాదాంతం!) ఓ నలుగురు మహిళలను దర్శికి తీసుకొచ్చింది. అనంతరం ఫొటో స్టూడియో దగ్గర మహిళలను ఉంచి బిడ్డను తీసుకుని పరారైంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు మరియమ్మ పోలీసులను ఆశ్రయించింది. కిలాడీ మహిళ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు నూజెండ్ల మండలం ఉప్పలపాడులో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. (చదవండి: తల్లి చూస్తుండగానే.. కూతురి కిడ్నాప్) -
ముచ్చటగా మూడుపెళ్లిళ్లు
-
నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ
దొనకొండ: పేర్లు, హోదాలు మార్చుకుని మ్యాట్రిమోనీ సైట్లలో వలవేయడం.. యువకులను ఆకర్షించి పెళ్లాడటం.. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడమే వృత్తిగా పెట్టుకున్న ఓ యువతి బాగోతమిది. ప్రకాశం జిల్లా దొనకొండలో నాలుగో పెళ్లి చేసుకున్నాక ఈ నిత్య పెళ్లి కూతురి వ్యవహారం బట్టబయలైంది. ఎస్ఐ ఫణిభూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ► తిరుపతిలో ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసిన స్వప్నకు తొలుత తన మేనమామతో వివాహం జరిగింది. ► కొద్ది రోజులకే అతన్ని వదిలేసి తిరుపతికే చెందిన పృథ్వీరాజ్‌ను పెళ్లాడింది. కొద్ది రోజుల తర్వాత అతడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది. ► తర్వాత జర్మనీలో పని చేసే ఆత్మకూరుకు చెందిన సుధాకర్‌ను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుని, పెళ్లికి సిద్ధమైంది. పెళ్లిలోగా అతడి నుంచి రూ. 5 లక్షలు డబ్బు లాగింది. ► ఆ తర్వాత దొనకొండకు చెందిన విప్పర్ల రామాంజనేయులకు గేలం వేసింది. డెన్మార్క్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అతనికి తాను ఐపీఎస్ అధికారినంటూ పరిచయం చేసుకుంది. 2019 డిసెంబర్ 12న వివాహం చేసుకుంది. ► ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన రామాంజనేయులు ఈ ఏడాది మార్చిలో భార్యకు చెప్పకుండా డెన్మార్క్ వెళ్లిపోయాడు. ► దీంతో ఆమె సోమవారం పోలీసులను ఆశ్రయించింది. ► పోలీసుల విచారణలో ఈ మాయలేడి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. -
కిలాడీ లేడీ పెళ్లిళ్లు..
-
కిలాడీ లేడీ పెళ్లిళ్లు.. మూడో ‘సారీ’
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని దొనకొండలో ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం బట్టబయలైంది. మ్యాట్రిమోని వెబ్సైట్లలో జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను చూడటం. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేయడం. ఆతరువాత బెదిరించి సెటిల్ మెంట్ చేసుకోవడం ఈ నిత్యపెళ్లి కూతురికి వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఆమె స్టైల్. అయితే, ఇటీవల ఆమె ఘనకార్యంపై మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తిరుపతికి చెందిన యువతి పతంగి స్వప్న, అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమూరారి స్వప్న. ఇలా పేర్లు మార్చి ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మ్యాట్రిమోని వెబ్ సెట్లలో తాను ఐపీఎస్ అధికారిగా బయోడేటా ఇచ్చి ఆర్థికంగా ఉన్నవారికి నమ్మించి బుట్టలో పడేస్తుంది. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి తర్వాత వేరుగా ఉంటానని, సెటిల్మెంట్ చేసుకుంటుంది. ఇలా ఇప్పటికే గత ఏడాది డిసెంబరులో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. మూడు నెలలపాటు వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. డెన్మార్క్‌లో ఉద్యోగం చేసే రామాంజనేయులు స్వప్నను అక్కడకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు. అయితే ఆమె తనతో వెళ్లేందుకు నిరాకరించింది. పాస్‌పోర్టుకు ఇప్పుడే దరఖాస్తు చేయలేనని కొన్ని పనులు ఉన్నాయని తెలిపింది. దీంతో రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. కానీ, స్వప్న వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఆ యువకుడు అసలు విషమేంటనే కోణంలో కూపీ లాగాడు. (ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో) దాంతో స్పప్న లీలలు వెలుగు చూశాయి. రామాంజనేయులు కంటే ముందు మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకున్నట్టు తెలిసింది. చిత్తూరుకు చెందిన పృద్వీరాజ్, ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే మరో ఇద్దరితో ఆమెకు గతంలో వివాహమైనట్టు రామాంజనేయులు గుర్తించాడు. పృధ్వీపై తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ స్వప్న కేసు కూడా పెట్టినట్టు తెలుసుకున్నాడు. అంతే కాదు తిరుపతికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె రూ.ఆరు లక్షలు వసూలు చేసిన ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. వివరాలన్నీ తెలిశాక రామాంజనేయులు స్వప్నని నిలదీశాడు. దాంతో పెళ్లి చేసుకున్నావు కాబట్టి రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని స్వప్న డిమాండ్ చేసింది. అతను బెదిరింపులకు లొంగకపోవడంతో దొనకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్వప్న వ్యవహారంపై రామాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వప్న చీటింగ్ బయటపడింది. రామాంజనులు డెన్మార్క్ నుంచి రావాల్సి ఉంది. (రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వం సాయం వివరాలు) -
దొనకొండలో మెగా సౌర విద్యుత్ ప్లాంట్!
దొనకొండ: ప్రకాశం జిల్లా దొనకొండలో వెయ్యి మెగావాట్ల మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా పదివేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దొనకొండలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు ఐదువేల ఎకరాలు అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెడ్‌క్యాప్ సంస్థ బృందం ఈ ప్రాంతంలో భూముల పరిశీలన చేపట్టింది. దొనకొండలో 25,086 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్టు రెవెన్యూ శాఖ సర్వే ద్వారా గుర్తించారు. ఇందులో వద్దిపాడులోని సర్వే నంబర్ 52, 54, 58, పోచమక్కపల్లి సర్వే నంబర్ 71, 72, రుద్రసముద్రంలో సర్వే నంబర్ 262–64లో సుమారు ఐదువేల ఎకరాల ప్రభుత్వ భూములను నెడ్‌క్యాప్ బృందం పరిశీలించింది. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని బృందం అభిప్రాయపడింది. నెడ్‌క్యాప్ డీజీఎం సీబీ జగదీశ్వరరెడ్డి, ప్రకాశం జిల్లా మేనేజర్ జి.బుచ్చిరాజు గతవారం ఈ భూములపై హైలెవెల్ టెక్నికల్ సర్వే నిర్వహించారు. సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్లాంట్‌ను చేపట్టి ఏడాదిలో పూర్తి చేసి.. ఆ తరువాత ఏడాదికల్లా విద్యుత్ ఉత్పత్తి చేపట్టవచ్చని వారు తెలిపారు. ఈ ప్లాంటు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు. దీనిపై నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ బుచ్చిబాబు మాట్లాడుతూ గురువారం ఒంగోలు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ షన్మోహన్తో నెడ్‌క్యాప్ బృందం, దొనకొండ తహసీల్దార్, సర్వేయర్లు సమావేశం కానున్నారని, దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. దొనకొండ తహసీల్దార్ కాలే వెంకటేశ్వరరావు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. -
'డిఫెన్స్ క్లస్టర్‌గా దొనకొండ ప్రాంతం!'
సాక్షి,లక్నో: లక్నోలో జరగుతున్న ఫ్రెంచ్-ఇండో డిఫెన్స్ ఎక్స్పో-2020 కార్యక్రమానికి ఐ.టీ,జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్‌పోకు హాజరైన 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తొందని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు దొనకొండ అనువైన ప్రాంతమని, దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు కేంద్రానికి పంపిందని తెలిపారు.(నూతన బాధ్యతలు చేపట్టిన మంత్రి మేకపాటి) డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి దొనకొండలో అందుబాటులో ఉందని, ఏరోస్పేస్, రక్షణ, పరిశ్రమల స్థాపనకు దొనకొండ ప్రాంతం కీలకంగా మారనుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్రెంచ్ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. దొనకొండకు దగ్గరలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులను జరుపుకునే అవకాశముందని గౌతమ్ రెడ్డి తెలిపారు. -
ఇండస్ట్రియల్ హబ్‌గా దొనకొండ
సాక్షి, దొనకొండ: జిల్లా వాసులను ఊరిస్తున్న ఇండస్ట్రియల్ హబ్ కల నెరవేరనుంది. ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను పిలిచి వివరాలు సేకరించిన సీఎం వైఎస్ జగన్ పూర్తి సమాచారంతో మరోసారి రావాలంటూ ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలోని దొనకొండ, కురిచేడు మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు చేయడం మినహా ఒక్క అడుకూడా ముందుకు వేయని పరిస్థితి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలల కూడా గడవక ముందే జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు అయితే పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందడంతోపాటు జిల్లా రూపు రేఖలే మారిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పరిశ్రమలు నిర్మించేందుకు అణువైన రోడ్డు, రైలు మార్గాలు, సాగు, తాగునీటి ప్రాజెక్ట్‌లకు ఎంత దూరంలో ఉంది, విద్యుత్ సౌకర్యం, భౌగోళిక స్వరూపం వంటì పూర్తి వివరాలు సేకరించేందుకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం సాయంత్రం దొనకొండ, కుర్చేడు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. నిరుద్యోగులకు వరం.. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం వైఎస్ జగన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనుకున్న ప్రకారం దొనకొండలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు జరిగితే యువతకు ఉద్యోగాలకు కొదువే ఉండదు. నిరుద్యోగ సమస్య దాదాపుగా తగ్గిపోతుందనే చెప్పవచ్చు. కలెక్టర్ పరిశీలన.. కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం సాయంత్రం దొనకొండ మండలంలో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన రుద్రసముద్రం, రాగమక్కపల్లి, భూమనపల్లి, కొచ్చెర్లకోట, పోచమక్కపల్లి, ఇండ్లచెరువు, బాదాపురం రెవెన్యూ గ్రామాల్లోని భూములు పరిశీలించారు. లైసెన్స్ సర్వేయర్ సీహెచ్ వెంకట్రావు హబ్‌కు సంబంధించిన ప్రాంతంలోని మ్యాపు గురించి వివరించారు. ఏపీఐఐసీ వారికి సుమారు 25 వేల ఎకరాలు రెవెన్యూ వారు తయారు చేయటం జరిగిందన్నారు. 2490 ఎకరాలు ఏపీఐఐసీ వారికి అప్పగించారు. అందులో టైటాన్ ఏవియేషన్ విమానాల విడిభాగాల పరికరాల కేంద్రానికి 6 వేల ఎకరాలు, కార్ల సామాగ్రి శక్తి సామర్థ్యం కేంద్రానికి 2300 ఎకరాలు, ప్రైడ్ ప్రాజెక్టు గృహ నిర్మాణాలు, ఇంటర్నల్ వస్తు విభాగాల నిర్మాణ సంస్థకు 5 వేల ఎకరాలు, విదేశీయులు చూసి వెళ్లటం జరిగిందన్నారు. మండల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, విద్యుత్, రవాణా గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దొనకొండ నుంచి మార్కాపురానికి రూట్, వాటి మధ్య దూరం, దొనకొండ 6 వే రోడ్డు, కర్నూలు, గుంటూరు, కనిగిరి జంక్షన్ ఎన్ని కిమీ ఉంటుందనే వివరాలు మ్యాపు ద్వారా తెలుసుకున్నారు. మండల పరిధిలో రైల్వే ట్రాకులు ఎంత విస్తీర్ణంలో వెళ్తుంది. ట్రాకు వెలుపల, బయట ఉన్న గ్రామాలు గురించి క్షుణ్ణంగా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దొనకొండ రావటం జరిగిందని, ఎప్పుడైనా ప్రభుత్వం హబ్ గురించి అడిగితే తాము చెప్పటానికి ఈ ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. ఆయన వెంట జేసీ ఎస్.షన్మోహన్, ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ నరసింహారావు, సర్వేయర్ అసిస్టెండ్ డైరెక్టర్ జయరాజు, తహసీల్దార్ పాలడుగు మరియమ్మ, సర్వేయరు కె.దర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
కూలేందుకు సిద్ధంగా ఓహెచ్‌ఆర్ ట్యాంకు
సాక్షి, దొనకొండ: మండలంలోని ఇండ్లచెరువు గ్రామం ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఇళ్ల మధ్యలో మంచినీటి కోసం నిర్మించిన ఓహెచ్‌ఆర్ ట్యాంకు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. సుమారు 34 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఓహెచ్‌ఆర్ ట్యాంకుకు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. నిత్యం విద్యార్థులు ట్యాంకు కింద ఆటలాడుకుంటుంటారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ట్యాంక్ పెచ్చులూడి దాని పక్కన గల ఇంట్లోని మహిళ తలపై పడి తీవ్రగాయాలయ్యాయి. తరచూ పెచ్చులూడటం, సిమెంట్ రాలుతుండటంతో అటుగా వెళ్లే గ్రామస్తులు ఆ ట్యాంకు ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ట్యాంక్ వద్ద ఆటలాడుకోవద్దని విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎన్నోసార్లు చెప్పినా వారు వినిపించుకోకుండా ట్యాంక్ వద్దనే ఆడుకుంటున్నారు. ట్యాంకు నిర్మించి 33 సంవత్సరాలు అయినప్పటికీ మూడు చుక్కల నీరు కూడా ట్యాంకుకు ఎక్కించిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ట్యాంకును తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా, ట్యాంకును పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు పట్టించుకోలేదు : నేను సర్పంచిగా కొనసాగే సమయంలో ఎన్నోసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. అధికారులు అధికార పార్టీకే తొత్తు అయ్యారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదు. ట్యాంకు తొలగించాలని గ్రామసభలలో స్థానికులు వినతిపత్రాలు అందజేశారు. కానీ, ఫలితం లేదు. పాతకోట సునీతాకోటిరెడ్డి, మాజీ సర్పంచి, ఇండ్లచెరువు పెచ్చులూడి తలపై పడ్డాయి : ట్యాంకు పక్కనే ఇల్లు ఉండటం వలన ఇంట్లోకి వెళ్లాలంటే ట్యాంకు కింద నుంచే వెళ్లాలి. గతంలో రెండు సార్లు నా తలపై పెచ్చులూడి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. దయచేసి తొలగించండి. ముతుకూరి కాళహస్తీ, ఇండ్లచెరువు నిత్యం అక్కడే ఆటలాడుకుంటున్నాం : మేము తరగతుల మధ్య ఖాళీ సమయంలో ఆడుకోవడానికి ట్యాంక్ దగ్గరకు వెళ్తాం. మా సారోళ్లు అక్కడికి వెళ్లవద్దు అంటున్నారు. మాకు ఆడుకోవడానికి స్థలంలేక అక్కడికే వెళ్తున్నాం. టి.మణికంఠారెడ్డి,6వ తరగతి, ఇండ్లచెరువు -
యువకుని అనుమానాస్పద మృతి
దొనకొండ : ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పెదన్నపాలెం పొలాల్లో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ కె.అజయ్‌కుమార్ కథనం ప్రకారం.. బాదాపురానికి చెందిన దండా సుబ్బారెడ్డి (38) రోజూ సైకిల్‌పై ఐస్‌లు అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఆయన నాలుగు రోజుల నుంచి ఇంటికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో పెదన్నపాలెం పొలాల్లో దుర్వాసన రావడంతో పశుపోషకులు అక్కడ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. వీఆర్ఓ మాబూవలి ఫిర్యాదు మేరకు దర్శి డీఎస్పీ వీఎస్ రాంబాబు, సీఐ ఎం.శ్రీనివాసరావులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం దండా సుబ్బారెడ్డిదిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
లేనిది ఉన్నట్టు.. బాబు కనికట్టు!
ఒకే అబద్ధాన్ని పలు మార్లు చెప్పి జనాన్ని నమ్మించటంలో చంద్రబాబు సిద్ధహస్తులు. ఆలు... చూలు లేకుండానే రాష్ట్రంలో 10 లక్షల కోట్లతో పరిశ్రమలు నెలకొల్పామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న బాబు సర్కారు వాస్తవానికి ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పిన పాపాన పోలేదు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు.. పాత పరిశ్రమలు సైతం ప్రభుత్వ ప్రోత్సాహం లేక మూతపడుతున్నాయి. పర్యవసానంగా కొత్త ఉద్యోగాల సంగతి అటుంచి, ఉన్న ఉద్యోగాలు సైతం పొగొట్టుకొని కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. ► పరిశ్రమలపై సర్కారు కాకి లెక్కలు ► వంచించి జనాన్ని నమ్మించే ప్రయత్నం ► మూడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాని వైనం ► స్థాపనకు ముందుకు రాని పారిశ్రామికవేత్తలు ► ఎంఓయూలు చేసుకున్నాఏర్పాటుకు ససేమిరా ► ప్రభుత్వ రాయితీల్లేవ్.. ప్రోత్సాహకాల్లేవ్.. ► మూతపడుతున్న పాత పరిశ్రమలు ► రోడ్డున పడుతున్న వేలాది మంది కార్మికులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారం చేపట్టగానే ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేశారు. ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాలను సందర్శించడం మినహా ఇప్పటికీ ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న మూడు, నాలుగు పరిశ్రమలు సైతం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పటానికి ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా నీరు, పోర్టు, రోడ్లు, విమానాశ్రయం లాంటి సౌకర్యాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఒక్క పరిశ్రమను నెలకొల్పకపోయినా బాబు ప్రభుత్వం మాత్రం ఎంఓయూలు లెక్క కట్టి లక్షల కోట్ల పరిశ్రమలు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం. పారిశ్రామికవేత్తల వెనుకడుగు..: కందుకూరు మండలం కోవూరు వద్ద పరిశ్రమ ఏర్పాటుకు రంగా ఫర్టికల్ బోర్డు (ఆగ్రో బేస్డ్ సంస్థ) ముందుకు వచ్చింది. దీంతో పాటు బీబీఎల్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (మినరల్ బేస్డ్) మద్దిపాడు మండలం గుళ్లాపల్లి వద్ద, వీఎస్ఎల్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పొన్నలూరు మండలం వేలటూరు వద్ద, ఆర్కెఎస్ టెక్నో విజన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (పవర్ జనరేషన్) వెలిగండ్ల మండలం మొగ్గళ్లూరు వద్ద, స్ప్రింగ్‌బీ డెయిరీ ప్రోడక్ట్ (ఫుడ్ అండ్ ఆగ్రో) పొదిలి మండలం, ఓగులక్కపల్లి గ్రామం వద్ద పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ఇదే తరహాలో జాసన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ఫెర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్), మోహన్ వెల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇండస్ట్రీయల్ పార్కు), రంగా ఫర్టికల్ బోర్డు, చైనాకు చెందిన కన్సార్టియం ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు, తమిళనాడుకు చెందిన మోహన్ సింటెక్స్ టెక్స్టైల్స్ తదితర కంపెనీలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం దొనకొండతో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు. వీరిలో ఏ ఒక్కరు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. రాయితీ ఎగనామం...: రాష్ట్ర విభజన చట్టప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన పారిశ్రామిక పన్ను రాయితీలపై కేంద్రం సెప్టెంబర్ 30న కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాలకు పారిశ్రామిక పన్ను రాయితీలను కల్పిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాయలసీమ జిల్లాలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విభజన చట్టప్రకారం 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు ఐదేళ్ల పాటు జిల్లాలో నెలకొల్పబోయే పరిశ్రమలకు 15 శాతం తరుగుదల పన్ను, పరిశ్రమ ప్లాంట్, కొత్త యంత్రాల వ్యయంపై 15 శాతం పెట్టుబడి అలవెన్సులిస్తారు. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 32(1), (2ఎ), సెక్షన్ 32ఎడి ప్రకారం పై ఏడు జిల్లాలను కేంద్రం నోటిఫై చేసింది. జిల్లాలో పాత పరిశ్రమలు–వాటి తీరు: పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం 2016 డిసెంబర్ 20 నాటికి జిల్లాలో 85 పెద్ద, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. రూ.2,928.80 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పిన ఈ పరిశ్రమల ద్వారా 22,093 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెబుతున్నారు. ఇవికాక జిల్లావ్యాప్తంగా 7,593 చిన్న పరిశ్రమలున్నాయి. 2,040.93 కోట్లతో ఏర్పాటైన ఈ పరిశ్రమల ద్వారా 81,277 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రోత్సాహకాలివ్వని సర్కారు..: ప్రభుత్వం ఎటువంటి రాయితీలు, ప్రోత్సాహకాలివ్వకపోవడంతో ఇటీవల కాలంలో పరిశ్రమలు ముందుకు నడిచే పరిస్థితి లేకుండాపోయింది. పన్నుల పెంపు, అదనపు పన్నులు వేయడం, విద్యుత్ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచటం తదితర కారణాలతో చిన్న పరిశ్రమలు మూతబడుతున్నాయి. జిల్లాలో మొత్తంగా 7678 పరిశ్రమలుండగా చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత దాదాపు 30 శాతం పరిశ్రమలు (2000లకుపైగా) మూతబడినట్లు సమాచారం. విద్యుత్ బిల్లులతో పాటు బ్యాంకు రుణాలకు సంబంధించిన కంతులు చెల్లించలేక ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. దీంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు. కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోననైనా ప్రభుత్వాలు చిన్న పరిశ్రమలకు రాయితీలు కల్పించాల్సి ఉన్నా... సర్కారు ఏ మాత్రం స్పందించటం లేదు. -
దొనకొండలో స్పెయిన్ ప్రతినిధుల పర్యటన
► ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ ఏర్పాటుకు స్థల పరిశీలన దొనకొండ (దర్శి): దొనకొండ ప్రాంతంలో స్పెయిన్ దేశ ప్రతినిధుల బృందం గురువారం పర్యటించింది. ఏపీఐఐసీ దొనకొండను పారిశ్రామిక ప్రాంతంగా ప్రకటించడంతో ఇడియాడ ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్పెయిన్ ప్రతినిధులు మన్దీప్ టాక్, లూయీస్ అయించిల్ బృందం, సచివాలయం ఓఎస్డీ సాగర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రాజశేఖర్‌తో కలిసి స్థలాలను పరిశీలించారు. తహశీల్దార్ కార్యాలయంలో భూములను సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం ఇండ్లచెరువు, పోచమక్కపల్లి, పి.వెంకటాపురం, రుద్రసముద్రం, భూమనపల్లి, రాగమక్కపల్లి పొలాలను చూశారు. రుద్రసముద్రం, భూమనపల్లి, రాగమక్కపల్లి ప్రాంతంలోని 262,292–305 సర్వే నంబర్లలో 1105 ఎకరాలను, ఇండ్లచెరువు, పోచమక్కపల్లి, పి.వెంకటాపురంలో 325–346లో 1400 ఎకరాలు పరిశీలించారు. వాహనాల విడి భాగాలు జతపరిచినప్పుడు వాటిని పరీక్షించడం, క్రాష్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, సేఫ్టీ టెస్ట్‌లు ఈ కంపెనిలో నిర్వహిస్తారన్నారు. దీనికి సంబంధించి సుమారు 2500 ఎకరాలు భూమి అవసరం ఉందన్నారు. ప్రపంచంలో స్పెయిన్, చైనాలో ఈ కంపెనీ కొనసాగుతుందన్నారు. ఆర్కిటెక్ట్ డిజైనర్లు నిఖిల్, వీరేంద్ర, ఆంటోనియో, ప్రాజెక్ట్ ఇంజినీర్ కుమార్, హబ్ లైజనింగ్ అధికారి సి.హెచ్.ఆశీర్వాదం, ఆర్ఐ రాజేష్, లైసెన్స్ సర్వేయర్ వెంకట్రావు పాల్గొన్నారు. -
ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటికే..
కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి కూడా ఆత్మహత్య దొనకొండ(ప్రకాశం జిల్లా): దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాదం వీర వెంకట్రామయ్య(15) అనే బాలుడు ఊరికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుమారుడి మరణవార్త విన్న తండ్రి సాదం పెదరామయ్య(52) మనస్తాపంతో కాసేపయిన తర్వాత అదే ట్రాక్‌పై కిలో మీటర్ దూరంలో గుంటూరు-కాచిగూడ ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో మరో లాతూర్..!
దొనకొండ: లాతూర్... కరువు కోరల్లో చిక్కిన ప్రాంతం. ఈ పేరు విన్నా.. అక్కడి పరిస్థితులు గుర్తుతెచ్చుకున్నా ఒళ్లు గగుర్పొడుస్తుంది. అక్కడి ప్రజల వ్యథను చూసి మహారాష్ట్ర ప్రభుత్వం రైళ్లలో నీళ్లు సరఫరా చేయడంతో పాటు కర్ఫ్యూ విధించిన పరిస్థితులు మనం చూశాం. ఆ స్థాయిలో కాకపోయినా దొనకొండ ప్రాంతం మరో లాతూరును తలపిస్తోంది. చందవరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అడుగంటడంతో ప్రజలు నీళ్లు తెచ్చుకునేందుకు రైళ్లలో 20 కిలోమీటర్లు ప్రయాణించి గజ్జలకొండకు వెళ్తున్నారు. 20 రోజులుగా దొనకొండలో ఇదే పరిస్థితి. గ్రామస్తులు ఉదయాన్నే వచ్చే గుంటూరు-కాచీగూడ, తెనాలి-మార్కాపురం రైళ్లలో ప్రయాణించి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. అడుగంటిన చందవరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రైలులో నీళ్లు తెచ్చుకుంటున్న దొనకొండ ప్రజలు -
దొనకొండలో భారీ పరిశ్రమలు
► పక్షం రోజుల్లో ప్రతిపాదనలు పూర్తి ► రామాయపట్నంపై ప్రత్యేక దృష్టి ► బాబు సమర్థత చూసి ప్రధాని మోదీనే ఆశ్చర్యపోతున్నారు ► నవ నిర్మాణ దీక్ష సభలో మంత్రి శిద్దా రాఘవరావు ఒంగోలు: జిల్లాలోని దొనకొండలో స్పెయిన్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న భారీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలు మరో పక్షం రోజుల్లో పూర్తికానున్నాయని రాష్ట్ర రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. రామాయపట్నం ఓడరేవుపై కూడా ముఖ్యమంత్రి విస్తృత చర్చలు నిర్వహిస్తున్నారని, త్వరలోనే అది కూడా సాధించుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవనం వద్ద గురువారం నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి డీఆర్డీఏ పీడీ మురళి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి సమర్థమైన నాయకుడు చంద్రబాబేనని గుర్తించి ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, చంద్రబాబు పాలన చూసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా చంద్రబాబు నదుల అనుసంధానం చేసి చూపించారని, ఇది చూసి ప్రధాని సైతం ఎలా సాధ్యమైందంటూ ఆశ్చర్యపోతున్నారన్నారు. విద్యుత్ సమస్య లేకుండా చర్యలు చేపట్టడంతోపాటు రాష్ట్రంలో ఆదాయ వనరులు పెంచుకునేందుకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. హోదాతోపాటు ప్యాకేజీ ఇవ్వాలి.. శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విభజన హేతుబద్దంగా జరగలేదని, పార్లమెంట్లో తలుపులు మూసి ఏకపక్షంగా విభజించారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిచేలా చూడాలన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబాటుకు గురైన ఏపీని అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం సైతం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయం చాలా ఉందన్నారు. కష్టదశలో సైతం రాష్ర్ట అభివృద్ధి కోసం తపిస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ జిల్లాలో జరిగే నవనిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో ప్రజలందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈనెల 8న ముఖ్యమంత్రి మహా సంకల్పదీక్షలో భాగంగా ఒంగోలుకు వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఉద్యమకారులకు సత్కారం.. ఈ కార్యక్రమంలో భాగంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఎన్ జీవో సంఘం జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి శరత్‌బాబు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎల్.నరశింహారావు, జేఏసీ సభ్యులు ఆర్.జగదీష్, ఎన్జీవో సంఘం నగర అధ్యక్షులు మస్తాన్‌వలి, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, శెట్టిగోపి, డీఆర్డీఎ పీడీ మురళి తదితరులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, పీడీపీపీబీ చైర్మన్ ఈదర మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ప్రకాష్‌కుమార్, డీఆర్వో నూర్భాషా ఖాశిం తదితరులు పాల్గొన్నారు. -
87 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
దొనకొండ (ప్రకాశం) : ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు దొనకొండ మండలం గుట్టఅమీన్‌పల్లి గ్రామంలోని ఓ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తికి చెందిన రేకుల ఇంట్లో ఉన్న సుమారు 87 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
దొనకొండకు 4 లేన్ల రోడ్లు
-
దొనకొండకు 4 లేన్ల రోడ్లు
కర్నూలు-దొనకొండ, అద్దంకి- దొనకొండ రోడ్లకు ప్రతిపాదనలు రోడ్ల అభివృద్ధికి మలేసియా కన్సల్టెన్సీ నివేదిక ఇండస్ట్రియల్ హబ్‌గా మారాలంటే రోడ్ కనెక్టివిటీ తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో దొనకొండను పారిశ్రామిక హబ్‌గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముందుగా రోడ్ కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దొనకొండను ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. అంతకుముందే ఇక్కడున్న 45 వేల ఎకరాల ప్రభుత్వ భూముల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం మలేసియా కన్సల్టెన్సీ నివేదిక కోరింది. మలేసియా కన్సల్టెన్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ప్రధానంగా రోడ్ కనెక్టివిటీపై సూచనలు చేసింది. దొనకొండలో భూముల లభ్యత, అనుకూలత కారణంగా ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు, ప్రధానంగా ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని, రూ.500 కోట్ల మేర ఒక్క ఫార్మా రంగంలోనే పెట్టుబడులు పెడతారని నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం కూడా సోలార్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి దొనకొండకు, అద్దంకి నుంచి దొనకొండకు నాలుగు లేన్ల రహదారులు నిర్మించేందుకు ఆర్అండ్బీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దొనకొండకు రోడ్ కనెక్టివిటీ సరిగా లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్అండ్బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సొంత జిల్లా ప్రకాశం కావడం, దొనకొండపై ఆయన తరచూ ఏపీఐఐసీ, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన దొనకొండకు రోడ్ కనెక్టివిటీ, అభివృద్ధిపై డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. -
మినీ ఎయిర్‌పోర్టుగా ‘దొనకొండ’ పరిశీలన
దొనకొండ: దొనకొండలోని రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బ్రిటీష్‌వారు నిర్మించిన ఎయిర్‌పోర్టును ఢిల్లీకి చెందిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం శుక్రవారం పరిశీలించింది. నాటి ఎయిర్‌పోర్టు భవనాన్ని, గ్రౌండ్‌ను బృంద సభ్యులు పరిశీలించారు. రాష్ట్రంలో మూడు మినీ ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. వాటిలో ఒకటి దొనకొండలో ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరిపారు. ఇక్కడి వాతావరణ అనుకూలతను పరికరాల ద్వారా పరిశీలించారు. జిల్లా సర్వేయర్ నరసింహారావు ఎయిర్‌పోర్టు, చుట్టుపక్కల ప్రాంతాలను మ్యాపులో గుర్తించారు. ముందుగా జిల్లా కోఆప్షన్ షేక్ మగ్బుల్ అహ్మద్, మండల వినియోగదారుల సంఘ కన్వీనర్ షేక్ నవాబు, మరికొంత మంది స్థానికులు దొనకొండలోని పరిస్థితులను, అనుకూలతలను బృందానికి తెలియజేశారు. అనంతరం స్థానిక రైల్వే గెస్ట్‌హౌస్‌లో బృంద సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టుకు సంబంధించి 136.5 ఎకరాల స్థలం, ఇక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించామని, మినీ ఎయిర్‌పోర్టుకు అనుకూలంగా ఉందని వివరించారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. బృందంలో ఢిల్లీకి చెందిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ మేనేజర్ నరేందర్ మకీజా, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సుధేష్ శర్మ, ఆర్కిటెక్చర్ మహమ్మద్ వసీం, విజయవాడకు చెందిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డెరైక్టర్ రాజా కిషోర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జేఎస్.గుప్తా, తహశీల్దార్ కేవీ సత్యనారాయణ, ఆర్ఐ సుబ్రహ్మణ్యం, సర్వేయర్ అల్లూరయ్య, వీఆర్వోలు ఉన్నారు. -
రూపురేఖలు మారుస్తా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కొండపిలో సోమవారం జరిగిన రైతు సాధికారత సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేస్తానని, దొనకొండ, కనిగిరిలను పారిశ్రామికవాడలుగా, కనిగిరిలో సోలార్ విద్యుత్తు తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. తాను ముందుగా ప్రకటించిన విధంగా విమానాశ్రయం, వెటర్నరీ యూనివర్శిటీ వచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఒంగోలు స్మార్ట్ సిటీ అంశాన్ని ప్రస్తావించ లేదు. పాలేరు రిజర్వాయర్ అడిగారని, దీనికి రూ. 65 కోట్లు ఖర్చవుతుందని చెప్పారని, దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత మంజూరు చేస్తానని చెప్పారు. మూలపాడు, మర్రిపాడు రిజర్వాయర్‌కు రూ.20 కోట్లు ఖర్చవుతుందని, దీనివల్ల టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమిల్లి మండలాలకు తాగునీటి సమస్య తీరుతుందని, దీన్ని మంజూరు చేస్తానని చెప్పారు. కొండపి చుట్టూ రింగ్ రోడ్డు కావాలని అడిగారని, దీన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తానని చెప్పారు. టంగుటూరు నుంచి పొదిలికి, కొండపి నుంచి కమ్మపాలెం వరకూ రెండులైన్ల రోడ్డు అడిగారని దీన్ని కూడా మంజూరు చేస్తానని చెప్పారు. సాగు నీటి కోసం వెలుగొండ ప్రాజెక్టు నుంచి 40 టీఎంసీల నీటిని విడుదల చేస్తే జిల్లా మెట్ట ప్రాంతం సస్య శ్యామలమవుతుంది. నాగార్జున సాగర్ ఫేజ్ -2 ద్వారా కందుకూరు, కొండపి, ఉదయగిరికి నీరు అందిస్తాం... జిల్లాలో ఫ్లోరైడు అధికంగా ఉంది. భూగర్భ జలాలుపైకి వస్తే దీన్ని అరికట్టగలం, నీరు - చెట్టు కార్యక్రమానికి అందరూ సహకరించాలని అన్నారు. ఆ తర్వాత రైతు ప్రతినిధులు కలిసి కౌలు రైతులకు రుణమాఫీ, శనగల కొనుగోలు, సుబాబుల్ కొనుగోలుకు సంబంధించి విజ్ఞాపనలు అందజేశారు. కౌలు రైతుల విషయంలో సానుకూలంగా స్పందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్బీఐ అంగీకరించకపోయినా, రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ముఖ్యమంత్రి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేశారని కొనియాడారు. తొలుత ఆయన జిల్లా పరిషత్ హైస్కూల్లో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. మీ సేవా విభాగం ఏర్పాటు చేసిన స్టాల్ దగ్గరికి వెళ్లి రైతు రుణమాఫీకి సంబంధించి అందిస్తున్న సర్వీసు వివరాలను, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక్కో గ్రూపునకు ఐదుగురు చొప్పున ఏర్పాటు చేసిన మూడు గ్రూపులకు ట్రాక్టర్లు, దుక్కి యంత్రాలు, విత్తనాలు నాటే పరికరాలు పంపిణీ చేశారు. హెలీఫ్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎద్దుల బండిపై ముఖ్యమంత్రి వచ్చారు. హుద్‌హుద్ తుపాను బాధితులకు పలువురు విరాళాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు రూ.68 లక్షలు విరాళం అందజేయగా, మార్కాపురం జర్నలిస్టులు రెండు లక్షల రూపాయల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ సభకు డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున స్కూల్ బస్సుల్లో తరలించారు. ఈ సదస్సు అనంతరం ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉన్నా, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి చెందడంతో సమీక్షా సమావేశం రద్దు చేసుకుని ముఖ్యమంత్రి తిరుపతి బయలుదేరి వెళ్లారు. జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు ఇవ్వరూ ఒంగోలు సబర్బన్: కొండపిలో రైతు సాధికారత సదస్సుకు విచ్చేసిన చంద్రబాబు నాయుడుకు ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు తదితరులు రూ. 2 లక్షల చెక్కును అందిస్తూ ఆరోగ్య బీమా కార్డుల విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య బీమా కింద ఇచ్చే హెల్త్ కార్డులను త్వరితగతిన విలేకరులకు అందేవిధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు ఐవీ సుబ్బారావు వివరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట శంకర్ హత్యకు సంబంధించి విచారణ ముమ్మరం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. శంకర్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని కూడా కోరారు. సీఎంను కలిసిన వారిలో జిల్లా కార్యదర్శి వేటపాలెం శ్రీనివాస్, కోశాధికారి డి.కనకయ్యతోపాటు పలువురు ఉన్నారు. -
దొనకొండలో అనకొండలు
ఆక్రమణలిలా.. చందలూరు గ్రామ పంచాయతీ పరిధిలో పలకల ఫ్యాక్టరీ నుంచి కొండ క్యారీలకు వెళ్లే దారిలో సుమారు 100 ఎకరాల భూమి అన్యాక్రాంతైమైంది. రాత్రికి రాత్రే ఫెన్సింగ్ రాళ్లు పాతి భూమిని ఆక్రమించారు. పొలాలకు ఉన్న నీటి కుంటలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో అదే గ్రామ పంచాయతీ పరిధిలో బందిళ్లపాయి కొండ దగ్గర సుమారు వంద ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఈ భూమిని లక్షలాది రూపాయలకు కబ్జాదారులు ఇతరులకు విక్రయించారు. దర్శి పట్టణ నడిబొడ్డులోనే 246, 247, 248 సర్వే నంబర్లలో సుమారు పది ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ఈ భూమి టీడీపీ ముఖ్యనేత కబంద హస్తాల్లో ఉండటంతో అధికారులు చ ర్యలు తీసుకోలేకపోతున్నారు. లంకోజనపల్లి గ్రామ పంచాయతీలో 80 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమిని ఆ గ్రామ టీడీపీ నాయకులు కబ్జా చేశారు. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచి జిల్లా అధికారులతోపాటు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆ భూమిని మాత్రం కబ్జాదారుల చేతుల నుంచి కాపాడడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది. చెక్ డ్యామ్‌నూ ఈ అనకొండలు వదల్లేదు. గతంలో నిర్మించిన ఈ చెక్ డ్యామ్ నీటి నిల్వలతో చుట్టు పక్కల 50 ఎకరాలకు నీరందించేది. వందలాది మంది రైతుల పంటలు పండించుకునే వారు. ప్రస్తుతం అదికాస్తా ఆక్రమణలకు గురవడంతో ఈ ప్రాంత రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునేదెవరు? దీంతో ఆ ప్రాంతంలోని రైతులు వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దొనకొండ మండలంలోని పోలేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 54 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. నకిలీ రికార్డులు సృష్టించి ఈ భూములను దర్శి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కబ్జాదారులు రిజిస్టర్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గొప్పగా ప్రకటించిన మంత్రి కళ్ల ముందే ఆక్రమణలు సాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్ఐని పంపిస్తా: తహశీల్దారు మస్తాన్ ఈ విషయమై డిప్యూటీ తహ శీల్దార్ మస్తాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆక్రమణలు జరుగుతున్నాయా...వెంటనే ఆర్ఐను పంపి అక్కడ ప్రభుత్వ భూములు పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు. నాలుగు నెలలుగా ఈ తంతు సాగుతున్నా పట్టించుకోకుండా సాక్షి ప్రశ్నించగానే ఇప్పుడే తెలిసినట్టు ... ఆర్ఐని పంపించి పరిశీలిస్తాననడం గమనార్హం. దర్శి : రాష్ట్ర ప్రభుత్వం దొనకొండను పారిశ్రామిక హబ్‌గా ప్రకటించడంతో దర్శి నియోజకవర్గంలోని భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొందరు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం నోరుమెదపకపోవడం పట్ల విమర్శలకు తావి స్తోంది. దర్శి నియోజకవర్గ పరిధిలో దొనకొండ, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలున్నాయి. వీటి పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు పరిశ్రమల స్థాపనకు అనువు గా ఉండడంతో ప్రభుత్వం ఈ ప్రాంతం పై దృష్టిసారించింది. దొనకొండను ఇండస్ట్రియల్ హబ్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంతో అక్రమార్కుల కన్ను ఈ భూములపై పడింది. మంత్రి నియోజకవర్గం కావడంతో ఆయన పేరు చెప్పుకుంటూ ... అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. పొక్లెయిన్ల సాయంతో రాత్రికి రాత్రే చదును చేయడమే కాకుండా ఫెన్సింగ్ రాళ్లు పాతి మరీ ఆక్రమిస్తున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. -
'దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్'
హైదరాబాద్: ప్రకాశం జిల్లా దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిర్ణయించింది. 45 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. సోలార్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, గ్రానైట్ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. బీవోటీ(బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ ఫర్) విధానంలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు.