పారిశ్రామిక నగరంగా దొనకొండ
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలోని దొనకొండను పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాజధానిపై సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏయే జిల్లాకు ఏమేం చేస్తామో ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్ సైన్సెస్, ఫుడ్ పార్కు, అక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఒంగోలులో విమానాశ్రయం, రామాయపట్నంలో పోర్టు, కనిగిరిలో జాతీయ పెట్టుబడుల, ఉత్పత్తుల జోన్ ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఏడాది కాలంలో పూర్తి చేస్తామన్నారు. అలాగే ఒంగోలును స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.