రైలులో నీళ్లు తెచ్చుకుంటున్న దొనకొండ ప్రజలు
దొనకొండ: లాతూర్... కరువు కోరల్లో చిక్కిన ప్రాంతం. ఈ పేరు విన్నా.. అక్కడి పరిస్థితులు గుర్తుతెచ్చుకున్నా ఒళ్లు గగుర్పొడుస్తుంది. అక్కడి ప్రజల వ్యథను చూసి మహారాష్ట్ర ప్రభుత్వం రైళ్లలో నీళ్లు సరఫరా చేయడంతో పాటు కర్ఫ్యూ విధించిన పరిస్థితులు మనం చూశాం.
ఆ స్థాయిలో కాకపోయినా దొనకొండ ప్రాంతం మరో లాతూరును తలపిస్తోంది. చందవరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అడుగంటడంతో ప్రజలు నీళ్లు తెచ్చుకునేందుకు రైళ్లలో 20 కిలోమీటర్లు ప్రయాణించి గజ్జలకొండకు వెళ్తున్నారు. 20 రోజులుగా దొనకొండలో ఇదే పరిస్థితి. గ్రామస్తులు ఉదయాన్నే వచ్చే గుంటూరు-కాచీగూడ, తెనాలి-మార్కాపురం రైళ్లలో ప్రయాణించి తాగునీటిని తెచ్చుకుంటున్నారు.
అడుగంటిన చందవరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్
రైలులో నీళ్లు తెచ్చుకుంటున్న దొనకొండ ప్రజలు