విప్పర్ల స్వప్న
దొనకొండ: పేర్లు, హోదాలు మార్చుకుని మ్యాట్రిమోనీ సైట్లలో వలవేయడం.. యువకులను ఆకర్షించి పెళ్లాడటం.. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడమే వృత్తిగా పెట్టుకున్న ఓ యువతి బాగోతమిది. ప్రకాశం జిల్లా దొనకొండలో నాలుగో పెళ్లి చేసుకున్నాక ఈ నిత్య పెళ్లి కూతురి వ్యవహారం బట్టబయలైంది. ఎస్‌ఐ ఫణిభూషణ్ తెలిపిన వివరాల ప్రకారం..
► తిరుపతిలో ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసిన స్వప్నకు తొలుత తన మేనమామతో వివాహం జరిగింది.
► కొద్ది రోజులకే అతన్ని వదిలేసి తిరుపతికే చెందిన పృథ్వీరాజ్‌ను పెళ్లాడింది. కొద్ది రోజుల తర్వాత అతడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది.
► తర్వాత జర్మనీలో పని చేసే ఆత్మకూరుకు చెందిన సుధాకర్‌ను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుని, పెళ్లికి సిద్ధమైంది. పెళ్లిలోగా అతడి నుంచి రూ. 5 లక్షలు డబ్బు లాగింది.
► ఆ తర్వాత దొనకొండకు చెందిన విప్పర్ల రామాంజనేయులకు గేలం వేసింది. డెన్మార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అతనికి తాను ఐపీఎస్ అధికారినంటూ పరిచయం చేసుకుంది. 2019 డిసెంబర్ 12న వివాహం చేసుకుంది.
► ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన రామాంజనేయులు ఈ ఏడాది మార్చిలో భార్యకు చెప్పకుండా డెన్మార్క్ వెళ్లిపోయాడు.
► దీంతో ఆమె సోమవారం పోలీసులను ఆశ్రయించింది.
► పోలీసుల విచారణలో ఈ మాయలేడి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment