matrimony
-
పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!
కుమారుడికి పెళ్లి కూతురుని వెతకడంలో విఫలమైన ఓ మ్యాట్రిమోనీ కంపెనీపై తండ్రి కోర్టుకెళ్లిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపించిన కోర్టు కుమారుడి తండ్రికి రూ.60,000 చెల్లించాలని కంపెనీని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ తండ్రి, కంపెనీ మధ్య ఎలాంటి వివాదం ఉందో, దీనిపై కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం.సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ప్రమోషన్ ఆధారంగా కుమార్ అనే వ్యక్తి దిల్మిల్ అనే మ్యాట్రిమోనీ కంపెనీను మార్చిలో ఆశ్రయించాడు. తన కుమారుడు బాలాజీకి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు పెళ్లి కూతురును వెతికే బాధ్యతను కంపెనీకి అప్పగించాడు. సంస్థ అందుకు నెల రోజుల సమయం విధించింది. ప్రతిగా ఇనిషియల్ పేమెంట్ ఛార్జీల కింద కుమార్ నుంచి రూ.30,000 వసూలు చేసింది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం నెల తర్వాత కుమార్ వెళ్లి వివరాలు అడిగితే కంపెనీ స్పందించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ తర్వాత కూడా తనకు పెళ్లికుతురి వివరాలు పంపలేదు. దాంతో మే నెలలో కళ్యాణ్ నగర్‌లోని దిల్మిల్ మ్యాట్రిమోనీ కంపెనీకి కుమార్ లీగల్ నోటీసులు పంపాడు. కోర్టు నోటీసులకు కూడా కంపెనీ స్పందించలేదు. దాంతో బెంగళూరు వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్అక్టోబరు 28న న్యాయస్థానం దిల్మిల్ సంస్థపై చర్యలు చేపట్టింది. కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాను ముందుగా చెల్లించిన సొమ్ముపై 6 శాతం వడ్డీతోపాటు నష్ట పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్‌కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5000, లీగల్ ఖర్చులకు మరో రూ.5000 చెల్లించాలని కంపెనీని స్పష్టం చేసింది. -
వందెకరాల ఆసామినంటూ 4 పెళ్లిళ్లు
ఏలూరు టౌన్: మ్యాట్రిమోనీ ద్వారా వల వేసి అనేక మందిని మోసం చేస్తూ భారీగా డబ్బులు కాజేసిన నిత్య పెళ్లికొడుకుని భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటకు చెందిన ఆశం అనిల్‌బాబు అలియాస్ కళ్యాణ్‌రెడ్డి 9వ తరగతి వరకే చదివినా.. ఇస్రోలో హెచ్ఆర్ అని చెప్పుకునేవాడు. భారత్ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో కల్యాణ్ పేరుతో రిజిస్టర్ చేసుకోగా, పెళ్ళి సంబంధాలు రాకపోవడంతో కళ్యాణ్ రెడ్డిగా మార్చాడు. పెళ్ళి సంబంధాల కోసం ఫోన్ చేసేవారిని తన తండ్రి మాట్లాడుతున్నట్టుగా నమ్మిస్తాడు. తన కొడుకు ఇస్రోలో పనిచేస్తున్నాడని, తాను, తన భార్య ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నామని, తమకు 100 ఎకరాల భూమి, రెండు విల్లాలు ఉన్నాయని నమ్మిస్తుంటాడు. కట్నకానుకలతో పనిలేదని చెబుతూ పెళ్ళి చూపులకు వెళతాడు. పెళ్ళి కూతురు నచ్చిందంటూనే వారి బంధువుల వివరాలు సేకరిస్తాడు. వారికి ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి భారీ మొత్తంలో నగదు కాజేస్తాడు. జనాలను నమ్మించేందుకు హైదరాబాద్‌లో ఒక ఫాం హౌస్, బెంగళూరులో ఒక విల్లాను అద్దెకు తీసుకుని వాటిని తనవే అని కలరింగ్ ఇస్తాడు. హైదరాబాద్‌లో ఒక పీఏ, వాచ్‌మేన్, ఒక మహిళా అసిస్టెంట్, ఇద్దరు బౌన్సర్లను పెట్టుకుని.. సలహాలు ఇచ్చేందుకు కాశీ అనే వ్యక్తిని, పెళ్ళి చేసేందుకు పంతులును సైతం ఏర్పాటు చేసుకున్నాడు.పెళ్లి, ఉద్యోగంటూ రూ.9.53 లక్షల మేర మోసంఏలూరు జిల్లా గుండుగొలను గ్రామానికి చెందిన మహిళను నమ్మించి ఆమె రెండో కుమార్తెను పెళ్లి చేసుకుంటానని, మూడో కుమార్తెకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి ఆన్లైన్లో రూ.9.53 లక్షలు కాజేశాడు. శశాంక్ అనే వ్యక్తి ద్వారా ఇంటర్వ్యూ చేయించి, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. డబ్బులు తీసుకుని ఎంతకీ జాబ్‌లో చేర్పించకపోవటంతో మోసపోయామని తెలుసుకుని వారు భీమడోలు పోలీసులకు 2023లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిత్య పెళ్లికొడుకు అనిల్‌బాబును అరెస్ట్ చేశారు. అనిల్‌బాబు ఇంతవరకూ పలువురిని రూ.1.50 కోట్ల వరకూ మోసగించినట్లు తేలింది. ఈ కేసులో అనిల్‌బాబుతో పాటు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కాలమలకు చెందిన తుంగ శశాంక, నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం బత్తులూరుపాడుకి చెందిన పల్లె హేమంత్‌రెడ్డిని భీమడోలు సీఐ యూజే విల్సన్ అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల నగదు, కారు, 5 సెల్ఫోన్లు, 13 సిమ్ కార్డులు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు తయారు చేసే కంప్యూటర్, రెండు ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ చెక్‌బుక్‌లు 4, ఇతర ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ విల్సన్, ఎస్ఐ వై.సుధాకర్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
మ్యాట్రిమోనీలో అమ్మాయిలను మోసగించిన వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి, పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాణ్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన చిన్నిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి పలు డేటింగ్ యాప్‌లలో సందీప్ సన్నీ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు. ఆకర్షితురాలైన ఓ బాధితురాలికి గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని నమ్మించాడు. స్నేహం పేరుతో బంధాన్ని ప్రారంభించి తర్వాత ప్రేమ, పెళ్లి వరకూ తీసుకెళ్లాడు. వ్యక్తిగత, కుటుంబ కష్టాలు ఉన్నాయని కట్టుకథలు చెప్పి బాధితురాలి నుంచి రూ.6.41 లక్షలు వసూలు చేశాడు. కొట్టేసిన సొమ్మును మేజిస్టిక్ ప్రైడ్, క్యాసినో ప్రైడ్ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్‌లలో పెట్టి పోగొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశారు. సెల్‌ఫోన్, సిమ్ కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. -
మేట్రిమొనీలో మోసం
జయపురం: ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక మోసాలు రోజురోజుకూ కొనసాగుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే స్థానిక పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై బాధిత యువతి జయపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వాస్తవం వెలుగు చూసింది. పట్టణంలోని లింగరాజ్నగర్కు చెందిన రాథానాథ్ రథొ కుమారుడు హరిహర రథొ తాను నాల్కో ఢిల్లీ డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌నని మేట్రిమొనీలో పరిచయం చేసుకున్నాడు. ఢిల్లీలోని నోయిడాలో నివసిస్తున్నట్లు చిరునామా ఇచ్చాడు. దీనిని విశ్వసించిన స్థానిక పారాబెడ లోని శ్రీరామనగర్‌కు రాజారాంసింగ్ పెద్ద కుమార్తె, ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారి రీతూ సింగ్ సంబంధం కుదుర్చుకున్నారు. ఫిబ్రవరి 9న జయపురంలోని కల్యాణ మండపంలో బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే 3 నెలలైనా భర్త ఉద్యోగం విషయం, ఉంటున్న ప్రాంతంపై సంతృప్తికరమైన వివరాలు తెలియలేదు. ఈనెల 12 రాత్రి ఢిల్లీలో ఉన్న భర్తకు ఫోన్ చేసి, ఇంటి లొకేషన్ పంపించాలని కోరగా అతని నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో మేట్రిమోనీలో ఇచ్చిన వివరాలు నిజం కాదని గ్రహించిన వధువు కుటుంబ సభ్యులు గ్రహించారు. మరోవైపు అత్తమామలు, ఆడబడుచులు పదేపదే డబ్బు తీసుకు రావాలని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ మేరకు పట్టణ పోలీసు స్టేషన్లో రీతూ సింగ్ ఫిర్యాదు చేయగా, పోలీసులు హరిహర కుటుంబ సభ్యులను పిలిపించి, వివరాలు సేకరించారు. అయితే నిందితుడి ఫోన్ స్విచాఫ్ అని రావడంతో దర్యాప్తు చేపడుతున్నట్లు పట్టణ పోలీసు అధికారి సంభిత్ బెహర వెల్లడించారు. -
Hyderabad: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు తీసుకొని
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోనీలో పరిచయం.. పెళ్లి పేరుతో రూ.6 లక్షలు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి నుంచి రూ.6 లక్షలు స్వాహా చేసిన వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌కు చెందిన యువతికి మ్యాట్రిమోనీ ద్వారా అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ పరిచయం ఏర్పడింది. తనకు వివాహం అయ్యిందని.. భార్యతో విడాకులు తీసుకున్నట్లు చెప్పాడు. అతడి మాటలు నమ్మి సదరు యువతి అతడితో పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ.15 లక్షలు కావాలని చెప్పడంతో రూ.6 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్‌కు భార్యాపిల్లలు ఉన్నట్లు తెలియడంతో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పారిస్.. యానాం మూడుముళ్ల బంధం
యానాం నుంచి పారిస్‌కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం. సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు. 30 మందికి పైగా.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే. ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. జాక్‌పాట్ కొట్టినట్టే.. ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్‌పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్‌లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు. చెక్కుచెదరని అనుబంధం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం -
Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయద్దంటూ..
ఒకప్పుడు బంధువులు, తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు కాలం మారింది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చాక ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. తమ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసేస్తున్నారు. అంతేగాక తమకు ఎలాంటి గుణాలు ఉన్న వ్యక్తి కావాలో కూడా చెప్పుకునే అవకాశం ఉటుంది. వీటితోపాటు పత్రిక ప్రకటనలు చూసి కూడా పెళ్లిళ్లు నిశ్చయించుకుంటున్నారు. తాజాగా ఓ పత్రికలో ఇచ్చిన పెళ్లి ప్రకటన వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త సమీర్ అరోరా.. న్యూస్ పేపర్లో ప్రచురితమైన మ్యాట్రిమోనీ అడ్వర్టైజ్మెంట్ క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో 24 ఏళ్ల అందమైన అమ్మాయికి ధనవంతులైన, బిజినెస్ బ్యాగ్రౌండ్ ఉన్న వరుడు కావాలి. అదే కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, లేదా డాక్టర్ అని అయి ఉండాలి’ అని ఉంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ప్రకటన చివర్లో ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దయచేసి కాల్ చేయవద్దు’ అని నొక్కి చెప్పారు. ‘ఐటీ రంగానికి భవిష్యత్తు అంతాగా కనిపించడం లేదు’ అనే ట్యాగ్‌లైన్‌తో షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2 — Samir Arora (@Iamsamirarora) September 16, 2022 ఓ వర్గం వారు నిజమేనంటూ మద్దతిస్తుంటే.. మరో వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఈ యాడ్ చూస్తుంటే.. దేశ భవిష్యత్తు మొత్తం మంచిగా కనిపించడం లేదు. ఐటీ లేకుంటే భవిష్యత్తే బాగోదు. హమ్మయ్యా నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఇది సరైంది కాదు. డోంట్ వర్రీ..ఇంజనీర్లు ఇలాంటి వార్తాపత్రికల ప్రకటనపై ఆధారపడరు. వారు తమంతట తాముగా ప్రతిదీ వెతుకుంటారు’ అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోది. Don't worry..Engineers don't rely on some newspaper ad. They find everything on their own. — Ajay sharma (@Ajaysha17977479) September 16, 2022 Looking at the ad, the whole country's future doesn't look so sound. — Ashutosh Vishwakarma (@aashutoshaawara) September 16, 2022 Thank god, I got married 11 years ago! — Bharat Trader 🇮🇳 (@BharatTrader) September 16, 2022 -
మ్యాట్రిమోనిలో పరిచయం.. మహిళా డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి, చెన్నై: వివాహం చేసుకుంటానని నమ్మించి మహిళా డాక్టర్ వద్ద రూ.13 లక్షలు మోసం చేసిన నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై అడయార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళా డాక్టర్ ఒకరు వివాహం కోసం మాట్రిమోని వెబ్సైట్లో చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో చెన్నై నావలూర్కు చెందిన కార్తీక్ రాజ అలియాస్ దినేష్ కార్తీక్ (28) ఆ వివరాలతో మహిళా డాక్టర్‌తో తాను కూడా డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి రూ. 12.95 లక్షలు, ఒక ఫోన్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం మహిళా డాక్టర్ నేరుగా కలుసుకుని వివాహం గురించి మాట్లాడదామంటూ కోరగా కార్తిక్రాజ తిరస్కరించాడు. దీంతో అతనిపై సందేహం ఏర్పడిన మహిళా డాక్టర్ ఈ విషయం గురించి తన బంధువు ఒకరికి వివరించింది. అతను వెంటనే అడయారు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్‌రాజ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం నిందితుడిని విచారణ చేశారు. ప్రేమ పేరుతో పలువురు యవతులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. బీకాం పూర్తి చేసి డాక్టర్‌గా ప్రచారం చేసుకుంటున్నట్లు నిర్ధారించారు. రూ. 98 వేలు నగదు, 5 సెల్ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. చదవండి: మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి.. -
మ్యాట్రిమోనితో వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోని ద్వారా ప్రకటనలు ఇస్తూ మహిళలను పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొక్కరిని ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుని మరో మహిళను మోసం చేసిన అప్పలరాజు అలియాస్ విజయ్ బాగోతం తాజాగా బయటపడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... దమ్మాయిగూడలోని అయోధ్యనగర్ కాలనీలో నివాసముంటున్న అప్పలరాజు అలి యాస్ విజయ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి సంతానం కలగలేదు. మ్యాట్రిమోని, పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ మహిళలను మోసం చేస్తు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలిసి సదరు మహిళ అప్పలరాజును నిలదీసింది. చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేస్తున్న విషయం బాధితురాలు తెలసుకుని మహిళా సంఘాల నాయకులతో అప్పలరాజు ఇంటి ఎదుట శుక్రవారం నిరసనకు దిగింది. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
మ్యాట్రిమోనీ యాప్‌లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి..
చిత్తూరు అర్బన్: అతడు చదువుకుంది ఆర్థికశాస్త్రంలో పోస్ట్రుగాడ్యుయేషన్. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద అటెండర్ పోస్టు వచ్చింది. చేస్తున్నపని నచ్చలేదు. మానేశాడు. దుర్వ్యసనాల నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు అన్వేషించాడు. ఉన్నతాధికారిగా పనిచేస్తున్నట్లు పేర్కొంటూ, నటుడి ఫొటో తనదిగా చెప్పి వివాహ సంబంధాల వెబ్సైట్లలో ఉంచాడు. వీటి ఆసరాగా వందమందికిపైగా యువతులను మోసంచేసి దాదాపు రూ.25 లక్షలు కొల్లగొట్టాడు. ఈ మోసాలకు పాల్పడ్డ చిత్తూరుకు చెందిన కరణం రెడ్డిప్రసాద్ (42)ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్ ఈ వివరాలను మీడియాకు వివరించారు. అరక్కోణంలో స్థిరపడి మోసాలు చిత్తూరులోని యాదమరి కాశిరాళ్లకు చెందిన కరణం షణ్ముగం పిళ్లై పశుసంవర్ధకశాఖలో పనిచేస్తూ చనిపోవడంతో ఆయన కుమారుడు రెడ్డిప్రసాద్‌కు కారుణ్య నియామకం కింద 2002లో అదే శాఖలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తుండగా 2012లో టైపిస్టుగా ఉద్యోగోన్నతి వచ్చింది. సాంకేతిక విద్యార్హతలు చూపకపోవడంతో 2016లో అటెండర్‌గా రివర్షన్ ఇచ్చారు. దీంతో ఉద్యోగం మానేసిన రెడ్డిప్రసాద్ వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. భార్య, కుమార్తె అతడి నుంచి వేరుగా ఉంటున్నారు. మ్యాట్రిమోనీ (వివాహాలను కుదిర్చే ఆన్లైన్ సంస్థలు) యాప్‌లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు, నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నట్లు పే–స్లిప్‌లు కూడా అప్లోడ్ చేశాడు. 2015లో తమిళనాడులోని అరక్కోణంలో స్థిరపడిన రెడ్డిప్రసాద్ పలు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని ఆన్లైన్లో పరిచయం చేసుకుంటూ తనకు స్వచ్ఛంద సేవాసంస్థ ఉందని, వచ్చే జీతంలో సగానికిపైగా దానధర్మాల కోసం ఖర్చుచేస్తున్నానని ఫోన్లో చెప్పేవాడు. పేదలకు సాయం చేసే తన సంస్థకు సాయం చేయాలంటూ పలువురు యువతుల నుంచి డబ్బు వసూలు చేశాడు. కొందరు అనుమానం వచ్చి పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్‌కి ఫోన్ చేశారు. తన పేరును మరొకరు దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రెడ్డిప్రసాదే ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వందమందికిపైగా యువతుల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు చెప్పాడు. 2019లో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డాలర్లు తెస్తుంటే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పి చిత్తూరుకు చెందిన యువతి వద్ద రూ.2.45 లక్షలు కాజేసింది తానేనని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు రూ.50 వేల నగదు సీజ్ చేశారు. యువతులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మోసపోవడంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఇతడి ద్వారా మోసపోయినవాళ్లు చిత్తూరు పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ కోరారు. కేసును ఛేదించడంలో ప్రతిభచూపిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
HYD: కళ్యాణిగా మారిన దాసు.. రూ. 50 కోట్ల ఆస్తి.. మాయమాటలు చెప్పి!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫేస్బుక్ ద్వారా పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి ఏడాది కాలంలో రూ.కోటి వరకు స్వాహా చేసిన కిలాడి జంటను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. భార్యా భర్తలు కలిసే ఈ నేరం చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. గుంటూరు జిల్లా సత్తుపల్లికి చెందిన వై.దాసు నూజివీడులోని టీటీటీఐ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. కొండాపూర్‌లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడిన ఇతగాడు సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆపై పూర్తిగా రమ్మీకి బానిసగా మారిపోయాడు. 2017 నవంబర్‌లో ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్న జ్యోతిని వివాహం చేసుకున్నాడు. చదవండి: చిక్కడపల్లి సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు ఆపై సత్తుపల్లికి మకాం మార్చి కొంత భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినప్పటికీ ఆన్లైన్ రమ్మీ మాత్రం మానలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఈ తరహా జూదాన్ని నిషేధించడంతో క్రికెట్ బెట్టింగ్స్ వైపు మళ్లాడు. వివిధ యాప్‌ల ద్వారా నిత్యం పందాలు కాసేవాడు. ఇతడు బీటెక్ చదువుతున్నప్పుడు కళ్యాణిశ్రీ పేరుతో తాను యువతిగా పేర్కొంటూ ఓ నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. దీని ద్వారా అనేక మంది యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి మోసం చేసేవాడు. ఇలా గతేడాది మేలో బొల్లారం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరిచయమయ్యాడు. తొలత ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా ఇరువురూ చాటింగ్ చేసుకున్నారు. ఆపై ఇరువురూ ఫోన్ నెంబర్లు మార్చుకున్న నేపథ్యంలో చాటింగ్ వాట్సాప్‌లోకి మారింది. కళ్యాణిశ్రీగానే చాటింగ్ చేసిన దాసు బాధితుడికి అనేక మాయమాటలు చెప్పి పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చాడు. చదవండి: అసలే చలికాలం.. రాత్రి గజగజ వణకడమే.. మరి వారి సంగతేంటి? అదును చూసుకుని అసలు కథ మొదలుపెట్టాడు. తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు చాలా ఉన్నాయంటూ చెప్పాడు. వాటి విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుందని నమ్మించాడు. అనివార్య కారణాల నేపథ్యంలో అవన్నీ తన పేరుతో లేవని చెప్పి..మ్యూటేషన్ ద్వారా ఆస్తులు తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని, ఆ మొత్తం ఇచ్చి సహకరించాలని చెప్పాడు. మనకు వివాహమయ్యే లోపు ఈ పని పూర్తి చేయాలన్నాడు. దీంతో బాధితుడు 2020 జూన్ నుంచి ఈ నెల వరకు మొత్తం రూ.కోటికి పైగా కళ్యాణిశ్రీగా చాటింగ్ చేసిన దాసు సూచించిన మూడు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. వీటిలో ఒకటి జ్యోతి పేరుతో ఉంది. అప్పుడప్పుడు బాధితుడికి కాల్స్ చేసిన దాస్ తన భార్య జ్యోతినే కళ్యాణిశ్రీగా మార్చి మాట్లాడించేవాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దీన్ని దర్యాప్తు చేశారు. మంగళవారం భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు బాధితుడి నుంచి కాజేసిన సొమ్ముతో జల్సాలు చేయడంతో పాటు కొంత ఆన్లైన్ బెట్టింగ్స్‌కు వెచ్చించారు. రూ.4 లక్షలు వెచ్చించి సత్తుపల్లిలో భూమి కొన్నారు. జ్యోతి ఈ సొమ్ము వెచ్చించి 12 తులాల బంగారం ఖరీదు చేసిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
విజయానికి తొలిమెట్టు అవగాహన
అవగాహన.. మనం నిత్యమూ స్మరించే పదాల్లో ఒకటి. దాదాపుగా ప్రతి వ్యక్తీ వాడే మాట.. ‘‘ఈ విషయం మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది’’.. ‘‘ ఆ పని చేయడానికి కావలసిన ప్రాథమిక అవగాహన కూడా అతనికి లేదు’’. ఇటువంటి మాటలు మనం తరచు మాట్లాడుతూ ఉంటాం. అసలు అవగాహన అంటే ఏమిటో, అవతలివారిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలో, అవగాహన వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... అవగాహన అనే పదం చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, ఏదైనా వస్తువు లేదా విషయంమీద ఒక వ్యక్తికున్న ఇంద్రియజ్ఞానాన్ని, ఆకళింపు శక్తినీ అవగాహనగా పేర్కొనవచ్చు. ప్రత్యేకమైన అంశంపై మనకున్న çస్పృహæ అంటే బాహ్య దృగ్విషయ సాక్షాత్కారం మనసులో నిండి ఉండడమే అవగాహన లేదా ఆకళింపు లేదా గ్రహింపు శక్తి. కొంచెం విడమరచి విశ్లేషిస్తే, ఆకళింపు అంటే చేయబోయే పనిమీద ప్రాథమికమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అన్న అర్థంలో తీసుకోవచ్చు. అదే విధంగా తాను కార్యసాధనలో కలిసి పని చేయబోయే వ్యక్తిని గురించి తెలుసుకుని ఉండగలగడాన్ని అవగాహనగా నిర్వచించవచ్చు. ఆనందకరమైన రీతిలో జీవితాన్ని గడపడానికి తన జీవితభాగస్వామితో నిత్యమూ ఆనందకరంగా చరించడమూ అవగాహనకు అందమైన ఉదాహరణే. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు తాము చేసే సేవా కార్యక్రమాల మీద అర్థవంతమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమూ అవగాహనే. అంతేకాదు, పసిపిల్లలను ముఖ్యమైన విషయాలపట్ల అప్రమత్తంగా తీర్చిదిద్దడమూ మకరందభరితమైన అవగాహనగానే పరిగణించాలి. పిల్లలకు కలిగించవలసిన గ్రహింపుశక్తి గురించి క్లుప్తంగా మాట్లాడాలంటే, బాల్యం ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభదశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడేలా, అత్యంత సులంభంగానే విషయాలన్నిటా ఆకళింపు చేసుకునేలా బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లల మానసికస్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజుల్లో ప్రతి విషయం మీదాగ్రహింపు కలిగేలా వారిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లలకున్న అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, వారి శక్తి సామర్థ్యాలను మనంఅంచనా వేయటం, విభిన్నమైన విషయాలపై అర్థవంతమైన రీతిలో బలాన్ని కలిగించడం పిల్లల సమగ్ర అభివృద్ధికి మధురఫలంగా రూపొందుతుందనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. అవగాహన గురించి విశ్లేషించుకునే సందర్భంలో తప్పకుండా ప్రస్తావించుకోవలసిన మరొక అంశం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన నమ్మకం. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన విశ్వాసపూరిత భావన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ అనుబంధమే ధరిత్రిలో సృష్టికార్యానికి మూలమై నవచరితకు ఆధారంగా నిలుస్తోంది కదా..!! ఈ రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న విశ్వాసరాహిత్యంవల్లనే, వారి దాంపత్యబంధంలో ముఖ్యమైన శాంతి కరువవుతోంది, సుఖమన్నది అరుదవుతోంది. భార్యాభర్తలమధ్య పొడసూపే ఆకళింపు లేమివల్ల సత్సమాజం ఏర్పడేందుకు అవరోధాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే, తల్లిదండ్రులు వ్యవహరించే తీరునే పిల్లలు అనుసరిస్తారు, అనుకరిస్తారు. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెప్పేదేగాక, మనం నిత్యమూ కనులముందు తిలకించేదే..!! ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహించడమైనా, ఒకరి ఇష్ట్రపకారం మరొకరు నడుచుకోవడమైనా.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దంపతులు ఆలోచించి అడుగేస్తే ఆ దాంపత్యం చిగురులోనే మొగ్గ తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుని చరించడం భారమైన విషయం కాదు, అది మధురమైన మకరంద సారం వంటిదని గ్రహించాలి.. ఇది నిజం..!! ఒకరిపై ఒకరికి అనురాగం, ప్రేమలను మరింత బలీయంగా ఉంచేది వారి మధ్య నిలిచివున్న అందమైన అవగాహనే. ‘‘భార్యకు నచ్చిన పనుల్ని చేయవలసిన అవసరం ఏముందని భర్త భావించడం, భర్త చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలి?’’ అని భార్య భావిస్తే, అతి కొద్ది రోజుల్లోనే ఆ బంధం దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం వారికి వారుగా ఒకరిపై ఒకరు పెంచుకున్న విశ్వాసరాహిత్యమే అని చెప్పడం నూటికి నూరుపాళ్ళూ నిజం. ఒక విషయాన్ని ఆకళింపుచేసుకోవడం జ్ఞానం కన్నా గొప్పదైన విషయంగా భావించమంటాడు ఓ తత్త్వవేత్త. ‘‘నీవెవరో చాలా మందికి తెలియవచ్చు, కానీ నీ విద్వత్తు మీద, శక్తిసామర్థ్యాల మీద నమ్మకం ఉన్న వాళ్ళ వల్లనే నీ ప్రతిభ లోకానికి పరిపూర్ణంగా తెలుస్తుంది’’ అనే భాష్యం సముచితంగా ఉంటుంది. విద్యార్థులు తమ విద్యపట్ల, లక్ష్యసాధకులు తాము సాధించ దలచిన లక్ష్యంపట్ల అవగాహన కలిగి ఉన్నట్లే, దేశ ప్రగతిని కాంక్షించే నాయకులకు తాము ఏ రకంగా ఉత్తమ సేవలను అందించి దేశానికి ప్రగతిని, సుగతిని అందించదలచుకున్నామో అన్న విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దేశప్రగతికి అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి అందమైన బంధానికీ ఇరువురి మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. సాధకుని ఆలోచనా ధోరణిలో నిండి వున్న దృఢమైన అవగాహనే కార్యసాధనలో విజయానికి ప్రధాన భూమిక నిర్వహిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అని భావించినప్పుడు, ఆ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాల పట్ల సమగ్రమైన గ్రహింపుని కలిగి ఉండడమనేది మౌలికమైన విజయసూత్రంగా భాసిస్తుంది. సాధనా క్రమంలో ఏదైనా విషయం తెలియకపోయినా, కొద్దిపాటి ఆకళింపు లేకపోయినా, ఆ విషయాన్ని సాధకుడు పనికిమాలిన అంశంగా భావించకూడదు. అదే, పరాజయానికి హేతువుగా మారుతుంది. నీకు ఏ విషయమైనా తెలియకపోయినా, ఆ రంగంలో నిష్ణాతులైనవారినో, అందులోని లోటుపాట్లను విడమరచి చెప్పగలవారినో ఆశ్రయించాలి. అందుకే, ఒక ఆర్యోక్తిలో చెప్పినట్లు ‘‘పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం కాదు. చిన్న చిన్న విషయాలను సమగ్రంగాఅర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వివేకి లక్షణం’’ అన్న మాటలు శిరోధార్యమే..!! –వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
భార్యపై కోపంతో మ్యాట్రిమెునిలో వివరాలు
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో పెట్టి వక్రబుద్ధి చాటుకున్నాడు. మామ ఫిర్యాదుతో చివరికి అరెస్టయ్యాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన యువతి(32)కి వెళ్లియూర్ పంచాయతీ అధ్యక్షుడు సురేష్‌బాబు కుమారుడు ఓంకుమార్(34)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. విడాకులు కావాలని పూందమల్లి కోర్టులో ఓంకుమార్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ సాగుతోంది. రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొనిలో వరుడు కావాలని భార్య వివరాలను ఉంచాడు. ఆసక్తి ఉన్న వారు యువతి తండ్రిని సంప్రదించాలని పేర్కొన్నాడు. యువతి తండ్రికి ఫోన్‌కాల్స్ రావడంతో ఆయన తిరువళ్లూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఓంకుమార్ విషయం తెలిసింది. పోలీసులు బుధవారం ఓంకుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: 'లవ్‌స్టోరి'ని తలపిస్తున్న తమిళనాడు జంట కథ -
మన ప్రేమ గుర్తుగా ఖరీదైన వస్తువులు పంపుతున్నానంటూ..
సాక్షి, హిమాయత్‌నగర్: వివాహం కోసం ప్రొఫైల్‌ని క్రిష్టియన్ మ్యాట్రిమోనిలో అప్లోడ్ చేసిన యువతికి భారీ టోకరా వేశాడు సైబర్ నేరగాడు. తాను యూకేలో జనరల్ ఫిజీషియన్ అంటూ ఆదర్శనగర్‌కు చెందిన నర్సు నాగమణికి ఇటీవల ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా చేస్తున్నానంటూ ఈమె పరిచయం పెంచుకుంది. ఇద్దరి మధ్య రోజు రోజుకు మాటలు పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లోనే ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నానని నాగమణిని నమ్మించాడు. డిసెంబర్ నాటికి భారత్‌కు వస్తున్నానని.. అయితే ఈలోపు మన ప్రేమ గుర్తుగా కొన్ని ఖరీదైన వస్తువులు పంపుతానన్నాడు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ నాగమణికి ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీకు యూకే నుంచి ఖరీదైన గిఫ్ట్‌లు వచ్చాయని, వాటిని సొంతం చేసుకోవాలంటే ఛార్జీస్ చెల్లించాల్నాడు. గుడ్డిగా నమ్మిన నాగమణి పలు దఫాలుగా రూ.5 లక్షలు నగదును ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బు చేతికి అందినాక ఫోన్ మాట్లాడటం మానేశాడు. దీంతో అనుమానం వచ్చి ఆమె ఆరా తీయగా..అది ఫేక్ కాల్ అయ్యి ఉంటుందని ఇరుగు పొరుగు వారు చెప్పారు. దీంతో గురువారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. -
ఘరానా మహిళ.. వలవేసి దోచేసింది
సాక్షి, బెంగళూరు : మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో శోధించి ధనవంతులైన వ్యక్తులను వలలో వేసుకుని సన్నిహిత చిత్రాలను రికార్డు చేసి హనీట్రాప్‌కి పాల్పడుతున్న ఘరానా మహిళ కటకటాలు లెక్కిస్తోంది. ఒకప్పుడు ఆమె అందరికీ విద్యాబుద్ధులు చెప్పే ప్రభుత్వ టీచర్ కావడం గమనార్హం. ఇందిరానగర పోలీసుల కథనం ప్రకారం.. దేవయ్య పార్కు, రామమోహన్పురం 1వ క్రాస్‌కు చెందిన కవిత (38) నిందితురాలు. ఆమె గతంలో చిక్కమగళూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో ప్రధానోధ్యాయునితో గొడవ పడి దాడి చేయటంతో లింగదహళ్ళి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తరువాత కవిత విధులకు రాకపోవడంతో సస్పెండయ్యారు. మనీ కోసం మోసాలబాట ఆ తరువాత ఆదాయం కోసం ఆన్లైన్ మోసాలపై దృష్టి సారించారు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో సంపన్నులైన వ్యక్తుల వివరాలను సేకరించి పరిచయాలు చేసుకునేది. డిసెంబర్ 21న జీవన్‌సాథి వెబ్సైట్ ద్వారా బెంగళూరు ఇందిరానగర కు చెందిన ప్రేమ్ డేనియల్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొన్నారు. డిసెంబర్ 26న రాత్రి 9.30 గంటల డేనియల్ ఇంటికి వెళ్లారు. సన్నిహితంగా ఉంటూ అర్ధరాత్రి సమయంలో నీ బంగారు గొలుసు, డబ్బు ఇవ్వాలని కవిత పట్టుబట్టింది. అతడు ససేమిరా అనడంతో ఇందిరానగర పోలీస్ స్టేషన్లో డేనియల్లపై అత్యాచారం ఫిర్యాదు చేసింది. ఇలా బట్టబయలైంది కేసు నమోదు చేసుకొన్న పోలీసులు డేనియేల్‌ను పిలిపించగా, పోలీసుల ముందు ఆ రోజు జరిగిన సంఘటనను ల్యాప్‌టాప్ ద్వారా రికార్డ్ చేసినదానిని చూపించాడు. ఆమె తనను రూ.5 లక్షలు ఇస్తే కేసు పెట్టనని బెదిరించిందని, తాను రూ.2 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు చెప్పాడు. ఆమె బ్లాక్మెయిల్ చేసిందని అతడు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితురాలు కవితాను అరెస్ట్ చేసి తీవ్రంగా విచారించగా ఈమె ఇంతకుముందు మల్లేశ్వరం, మహాదేవపుర ప్రాంతాల్లో ఇలాగే పలువురిపై కేసులు నమోదు చేయించినట్లు తెలిసింది. ఈమె హనీట్రాప్ దందా ద్వారా ఎంత మంది మోసపోయిందీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యలకు విడాకులు.. మ్యాట్రిమోనిలో మరో యువతితో
సాక్షి, హైదరాబాద్: యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకునేందుకు యత్నించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్‌కు చెందిన సాల్మన్‌రాజు (42) విద్యుత్‌శాఖలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్ది నెలల క్రితం మ్యాట్రిమోనీ సైట్ ద్వారా సికింద్రాబాద్ అంబర్‌నగర్‌కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించాడు. గతంలో రెండుమార్లు సాల్మన్‌రాజుకు వివాహమైందని తెలుసుకున్న యువతి చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు సాల్మన్‌రాజును గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
స్టార్టప్స్‌లో పెట్టుబడులు: ఈ షేరు రాకెట్ స్పీడ్
ముంబై, సాక్షి: ఇంటర్నెట్ ఆధారిత సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ షేరు తాజాగా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈలో తొలుత దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 3,988కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం యథాతథంగా రూ. 3,925 వద్ద ట్రేడవుతోంది. గత రెండేళ్లలో ఈ కౌంటర్ 187 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా కంపెనీ అనుబంధ సంస్థలైన జాబ్ పోర్టల్, మాట్రిమోనీ, రియల్టీ పోర్టల్ ప్రభావం చూపుతున్నాయి. దీనికితోడు కంపెనీ జొమాటో, పాలసీ బజార్‌సహా కనీసం 23 స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో జొమాటో ఇటీవల పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. కంపెనీ నౌకరీ, 99ఏకర్స్, జీవన్సాథీ, శిక్ష తదితర పోర్టళ్లను నిర్వహించే సంగతి తెలిసిందే. తొలి లిస్టెడ్ కంపెనీ డాట్‌కామ్ బూమ్ సమయంలో అంటే 1995లో ఆవిర్భవించిన ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ 2006 నవంబర్‌లో దేశీయంగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. తద్వారా దేశీయంగా లిస్టయిన తొలి ఇంటర్నెట్ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇటీవల ఇన్ఫీబీమ్, ఇండియామార్ట్ ఇంటర్మెష్, రూట్ మొబైల్స్ తదితర పలు కంపెనీలు లిస్టయ్యాయి. టెమాసెక్, టైగర్ గ్లోబల్, చైనీస్ యాంట్ గ్రూప్‌నకు సైతం వాటాలు కలిగిన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్‌కు సుమారు 20 శాతం వరకూ వాటా ఉన్నట్లు అంచనా. జొమాటోకు విదేశీ రీసెర్చ్ సంస్థ హెచ్ఎస్బీసీ ఏకంగా 5 బిలియన్ డాలర్ల విలువను అంచనా వేయడం గమనార్హం. దీంతో ఇటీవల ఇన్ఫో ఎడ్జ్ కౌంటర్ మరింత జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
కోవిడ్ దెబ్బకు క్రిమినల్ అవతారం
సాక్షి, సిటీబ్యూరో: సాఫ్ట్వేర్ రంగంలో పని చేసే వారి జీవితాల్లో మరో దయనీయ కోణమూ ఉంది. తమ జీతంపై ఆశతో అనేక మంది అప్పులు చేస్తున్నారు. కోవిడ్ వంటి వాటితో పరిస్థితులు తల్లకిందులైతే దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. అలాంటి వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం, నేరగాళ్లుగా మారడం జరుగుతోంది. దీనికి తాజా ఉదాహరణే హేమంత్‌కుమార్ వ్యవహారం. మాట్రిమోనియల్ ఫ్రాడ్స్‌కు పాల్పడుతున్న ఇతగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన హేమంత్‌కుమార్ ఉన్నత విద్యనే అభ్యసించాడు. చాన్నాళ్లు అక్కడి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎథికల్ హ్యాకర్‌గా పని చేశాడు. ఆ సమయంలో ప్రతి నెలా ‘ఐదంకెల’ జీతం అందుకున్న హేమంత్‌కుమార్ దానికి తగ్గట్లే తన లైఫ్‌ను ప్లాన్ చేసుకున్నాడు. ప్రతి నెలా వచ్చే జీతంలో తన ఖర్చులు పోగా.. ఎక్కువ మొత్తమే మిగిలేది. దీంతో దాదాపు ఐదేళ్లు కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు మరికొంత మొత్తం రుణం తీసుకుని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఓ ఫ్లాట్ కొన్నాడు. కొన్నాళ్ల పాటు ఈఎంఐల చెల్లింపు సజావుగానే సాగింది. కోవిడ్ ప్రభావంతో లాక్డౌన్ అమలులోకి రావడంతో అనేక మంది సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారి మాదిరిగానే అతడు సైతం ఇబ్బంది పడ్డాడు. హఠాత్తుగా ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డాడు. కొత్తగా ఖరీదు చేసిన ఫ్లాట్‌కు సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేని స్థితికి చేరాడు. తన కష్టార్జితంతో పాటు రుణం తీసుకుని ఖరీదు చేసిన ఆ ఫ్లాట్ బ్యాంకు వారి పరం అవుతుందని భయపడ్డాడు. దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించడంతో పాటు పనిలో పనిగా తన ఖర్చుల కోసమూ మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ మొదలెట్టాడు. పలు మాట్రిమోనియల్ సైట్స్‌లో తన పేరు, వివరాలను రిజిస్టర్ చేసుకున్నాడు. అందులో ఉన్న యువతుల ప్రొఫైల్స్‌లో కొన్నింటిని ఎంపిక చేసుకునే వాడు. వారికి సందేశాలు పంపుతూ వివాహం చేసుకోవడానికి సమ్మతమని చెప్పేవాడు. తాను బెంగళూరులో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పరిచయం చేసుకునే వాడు. తన వల్లోపడిన వారితో కొన్నాళ్లు చాటింగ్, ఫోన్ కాల్స్ కొనసాగించేవాడు. ఆపై అసలు కథ మొదలెట్టే హేమంత్‌కుమార్ తనకు అత్యవసరమనో, తల్లిదండ్రులకు ఆనారోగ్యమనో ఆ యువతితో చెప్పేవాడు. ఆ కారణంతో ఆమె నుంచి అందినకాడికి తీసుకుని దండుకుని ఆపై మోసం చేసేవాడు. కొన్నిసార్లు తన ఫోన్ నెంబర్ మార్చేయగా.. మరి కొన్నిసార్లు ఎదుటి వారివి బ్లాక్ చేస్తున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది యువతులు మిన్నకుండిపోయాడు. బెంగళూరుకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో అక్కడి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన ఇతగాడు నెల కూడా సక్రమంగా ఉండలేదు. మరో పేరులో మరో మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. హుబ్లీ చెందిన యువతిని మోసం చేయడంతో ఆమె అక్కడ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన మరో యువతి నుంచి కూడా హేమంత్‌కుమార్ రూ.2.1 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో హేమంత్‌కుమార్‌పై నగరంలో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
వంచన.. కొంపముంచిన మ్యాట్రీమోని
సాక్షి, బెంగళూరు : మ్యాట్రీమోనిలో పరిచయమైన యువకుడు ఓ యువతిని మోసగించిన ఉదంతం వెలుగు చూసింది. కర్ణాటకలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న మహిళకు మ్యాట్రీమోనిలో యువకుడు పరిచయం అయ్యాడు. తన పేరు కబీర్‌ఆనంద్ అని, లండన్‌లో స్థిరపడినట్లు నమ్మించాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. తాను ఢిల్లీకి వచ్చానని, విదేశీ కరెన్సీని భారత్ కరెన్సీగా మార్చేందుకు రూ.3 లక్షలు నగదు తన అకౌంట్‌కు జమచేయాలని సూచించాడు. దీంతో ఆ యువతి నగదు జమ చేసింది. అనంతరం ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని సమాధానం వచ్చింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. (నా బిడ్డ నాకు కావాలి...) డ్రగ్స్ విక్రయిస్తున్న టెక్కీ అరెస్ట్ బనశంకరి: విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్న సార్ధక్‌ఆర్య అనే టెక్కీని శుక్రవారం సెంట్రల్‌క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 4.99 గ్రాములు ఎస్‌ఎల్‌డీ, ఎంహెచ్‌సీరిస్ ప్యాకెట్‌స్కేల్, బ్రౌన్ క్‌పేపర్‌ప్యాకెట్, ఓసీబీస్లిమ్‌స్మోక్‌పేపర్‌ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్‌పోలీస్‌కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఈయన బెల్జియం నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నాడు. -
ముచ్చటగా మూడుపెళ్లిళ్లు
-
నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ
దొనకొండ: పేర్లు, హోదాలు మార్చుకుని మ్యాట్రిమోనీ సైట్లలో వలవేయడం.. యువకులను ఆకర్షించి పెళ్లాడటం.. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడమే వృత్తిగా పెట్టుకున్న ఓ యువతి బాగోతమిది. ప్రకాశం జిల్లా దొనకొండలో నాలుగో పెళ్లి చేసుకున్నాక ఈ నిత్య పెళ్లి కూతురి వ్యవహారం బట్టబయలైంది. ఎస్ఐ ఫణిభూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ► తిరుపతిలో ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసిన స్వప్నకు తొలుత తన మేనమామతో వివాహం జరిగింది. ► కొద్ది రోజులకే అతన్ని వదిలేసి తిరుపతికే చెందిన పృథ్వీరాజ్‌ను పెళ్లాడింది. కొద్ది రోజుల తర్వాత అతడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది. ► తర్వాత జర్మనీలో పని చేసే ఆత్మకూరుకు చెందిన సుధాకర్‌ను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుని, పెళ్లికి సిద్ధమైంది. పెళ్లిలోగా అతడి నుంచి రూ. 5 లక్షలు డబ్బు లాగింది. ► ఆ తర్వాత దొనకొండకు చెందిన విప్పర్ల రామాంజనేయులకు గేలం వేసింది. డెన్మార్క్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అతనికి తాను ఐపీఎస్ అధికారినంటూ పరిచయం చేసుకుంది. 2019 డిసెంబర్ 12న వివాహం చేసుకుంది. ► ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన రామాంజనేయులు ఈ ఏడాది మార్చిలో భార్యకు చెప్పకుండా డెన్మార్క్ వెళ్లిపోయాడు. ► దీంతో ఆమె సోమవారం పోలీసులను ఆశ్రయించింది. ► పోలీసుల విచారణలో ఈ మాయలేడి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. -
పెద్దలతో పనిలేదు..
పెద్దలతో సంబంధం లేకుండా సొంతంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికే అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో పెళ్లి కోసం మ్యాట్రిమోని సంస్థల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న ఆరు లక్షల మంది యువతీయువకులపై ఆ సంస్థ అధ్యయనం చేసి ఆసక్తికర అంశాలను వెల్లడించింది. సాక్షి, అమరావతి: పెద్దలతో సంబంధం లేకుండా సొంతంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికే తెలుగు యువత ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపుతోంది. పెళ్లి సంబంధాలను కుదిర్చే ఓ మ్యాట్రిమోని సంస్థ పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలదీ ఒకటే తీరుగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పెళ్లి కోసం మ్యాట్రిమోని సంస్థల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న ఆరు లక్షల మంది యువతీయువకులపై ఆ సంస్థ అధ్యయనం చేసి ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఓ మ్యాట్రిమోని సంస్థ అధ్యయనంలో వెల్లడి గుంటూరు నగరానికి సమీపంలో ఉండే ఒక గ్రామానికి చెందిన రమ్య (24) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి పెళ్లి సంబంధాలు కుదిర్చే ఓ మ్యాట్రిమోని సంస్థలో వివరాలు నమోదు చేసుకుంది. మంచి ఉద్యోగం, వ్యక్తిత్వం ఉంటే దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమంటోంది. ఆ ఐదు ప్రాంతాల వారే.. ► మ్యాట్రిమోని సంస్థల్లో నమోదు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది యువత పెద్దలతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటోంది. ► 76 శాతం మంది మ్యాట్రిమోని సంస్థల ఆఫీసుల వద్దకు కూడా వెళ్లకుండా యాప్‌లు, వెబ్సైట్ ద్వారానే తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. సొంత రాష్ట్ర పరిధిలోనే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటామన్న అబ్బాయిలు.. 26 శాతం మంది, అమ్మాయిలు.. 23 శాతం మంది. ► 67 శాతం మంది అమ్మాయిలు, 64 శాతం మంది అబ్బాయిలు ఎటువంటి పరిధులు లేకుండా దేశంలో ఏ ప్రాంతం వారినైనా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపారు. ► మ్యాట్రిమోని సంస్థల్లో నమోదు చేసుకుంటున్న తెలుగు వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారే. ► మ్యాట్రిమోని సంస్థలను సంప్రదిస్తున్న వారిలో 81 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారే. 9 శాతం మంది ఇతర రాష్ట్రాలవారు, 10 శాతం మంది ఎన్నారైలు ఉన్నారు. వివరాలు నమోదు చేసుకుంటున్న అమ్మాయిల్లో 53 శాతం మందికి 23–27 ఏళ్ల మధ్య వయసు ఉండగా.. 42 శాతం మంది 26–30 ఏళ్ల మధ్య వయసు వారిగా తేలింది. ► 8 శాతం మంది అమ్మాయిలు, 10 శాతం మంది అబ్బాయిలు కులాల ప్రస్తావన లేకుండా పెళ్లికి సిద్ధమంటున్నారు. ► మ్యాట్రిమోని సంస్థల వద్ద వివరాలు నమోదు చేసుకుంటున్న అమ్మాయిల్లో 42 శాతం మంది ఇంజనీరింగ్ చదివినవారు కాగా, 14.5 శాతం మంది ఇతర వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు. అబ్బాయిల్లో 36.8 శాతం మంది ఇంజనీరింగ్ చదివిన వారు కాగా, 9 శాతం మంది ఇతర ఉన్నత వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు ఉన్నారు. -
మ్యాట్రిమోసాలు
నూరేళ్ల పంటైన పెళ్లి ఫలితం బాగుండాలనుకుంటారంతా. అందుకే అక్కడ ట్రాప్ చేస్తే చిక్కేవారు చాలా ఎక్కువ. మరది రెండో పెళ్లి అయితేనో... మరింత డెస్పరేట్నెస్. సరిగ్గా ఈ ఫీలింగ్స్‌నే అనుకూలంగా మలచుకుంటున్నారు మగాళ్లు. ఫేక్ ఐడీలతో, తప్పుడు ప్రొఫైళ్లతో, నకిలీ అర్హతలతో మోసాలకు పాల్పడుతున్నారు. వాటికి ఆన్లైన్ మ్యాట్రిమోనీలు వేదికలవుతున్నాయి. ఇలాంటి ఆన్లైన్ పెళ్లిసంబంధాల నుంచి జాగ్రత్త పడటమెలాగో చెబుతున్నారు నిపుణులు... అప్రమత్తం కండి, మోసపోకండి. అరవింద్ సన్యాల్ ఎవరో నిజంగానే తనకు తెలియదు. కాని ఆ ఇన్స్పెక్టర్ చెప్పిన ట్రాన్సాక్షన్ వివరాలు అన్నీ కరెక్టే. బ్యాంక్ అకౌంట్, తను పంపిన అమౌంట్, తేదీ కూడా. కాని వ్యక్తిపేరు అదికాదు. తను ఆ డబ్బును పంపింది తన కాబోయే భర్త తన్మయ్ చంద్రకు. మూడు నెలల కిందట ఓ పేరున్న మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయ్యాడు. తనలాగే అతనికీ ఇది రెండో పెళ్లి. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను డాక్టర్. మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ చూసి అతనే చాట్ చేశాడు. తర్వాత నుంచి ఫోన్‌కాల్స్ మొదలయ్యాయి. అతనే చేస్తూండేవాడు. అతని తల్లీ డాక్టరే. పేషంట్లు, ఆపరేషన్లు అంటూ అమ్మ, కాలేజీలు, కాన్ఫరెన్స్‌లు అంటూ తన ప్రొఫెసర్ తండ్రి ఎప్పు డూ బిజీగా ఉండడం వల్ల వాళ్లతో మాట్లాడించలేకపోతున్నానని నొచ్చుకునేవాడు. సెమినార్స్ అంటూ తాను ఎప్పుడూ ఒక చోట కుదురుగా ఉండనని.. విదేశాలు తిరుగుతూ ఉంటానని.. అందుకే తనూ కలవలేకపోతున్నాడని ఆమెకు సంజాయిషీ ఇచ్చుకునేవాడు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఖరీదైన కానుకలూ పంపాడు. ప్రతిసారి మన పెళ్లయ్యాక... అంటూ ఆమె మనసు దోచుకునేవాడు. ఈ ఆనందంలో మూడు నెలలు గడిచాయి. ఒకరోజు తన ఫ్రెండ్‌కు అర్జెంట్‌గా పదిలక్షలు కావాలని, ప్రస్తుతానికి తన దగ్గర లేవని బాధపడ్డాడు. చలించిపోయిన ఆమె అప్పటికప్పుడు పది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత మూడు రోజులకు మరో పది లక్షలు కావాలని.. నమ్మకం కోసం తన ఇంటి స్థలానికి సంబంధించిన దస్తావేజులు పంపిస్తాననీ చెప్పాడు. తన ఫ్రెండ్స్‌ను అడిగి ఎలా గోలా సర్దింది. స్నేహితుల నమ్మకం కోసం దస్తావేజులు పంపమని అడిగింది. ‘ఓ యెస్..’ అంటూ ఫోన్ పెట్టేసిన అతను పదిరోజులైనా ఫోన్ చేయలేదు. అయ్యో బాధపడ్డాడేమోననే అపరాధభావంలో కొట్టుకుపోతున్న ఆమెకు పోలీసుల ఫోన్‌కాల్ ద్వారా తెలిసింది అరవింద్ సన్యాల్ చేతిలో తాను మోసపోయినట్టు. ‘మేడం.. కృష్ణ మాధవ్ అనే అతను మీ కోసం పదివేల పౌండ్లు పంపాడు. దీనికి ట్యాక్స్ పే చేస్తేనే మీకు పంపగలం. అతను మీకు తెలుసా?’ అంటూ మానసకు ఫోన్‌కాల్. ‘అయ్యో తెలుసండీ.. అతను నా ఫియాన్స్. తాను చెప్పాడు కూడా ఇలా పంపిస్తున్నట్టు. ఎంత కట్టాలి ట్యాక్స్?’ అడిగింది అత్రంగా మానస. మూడు లక్షలు ట్రాన్స్ఫర్ చేయమని అకౌంట్ నంబర్ ఇచ్చారు. చేసింది. ఏడు రోజులు గడిచినా పదివేల పౌండ్స్ లేవు.. కృష్ణమాధవ్ ఫోన్‌కాల్ లేదు. ఫ్రాడ్ అని అర్థమైంది. ఒక ఎమ్ఎన్సీలో పనిచేస్తోంది మానస. తగిన వరుడి కోసం ఫేమస్ మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్‌ను నమోదు చేసుకుంది. లండన్‌లో ఉంటున్న కృష్ణ మాధవ్ ప్రొఫైల్. చూసి ముచ్చటపడింది. ఫేస్బుక్లో అతని అకౌంట్ చెక్ చేసింది. బిజినెస్ మ్యాన్. హై ప్రొఫైల్. పెద్ద బంగ్లా, మూడు నాలుగు కార్లు, వరల్డ్ టూర్లు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. యాక్సెప్ట్ చేశాడు. అంతే! అప్పటి నుంచి అతనే ఆమెను పింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ మాటల ప్రవాహానికి... అదిగో అలా మూడు లక్షల ట్రాన్స్ఫర్తో చెక్ పడింది. లండన్ కాదుకదా.. కనీసం హైదరాబాద్ దాటి వెళ్లలేదు కృష్ణమోహన్. ‘నువ్వు చెప్పిందాని ప్రకారం మీ ఇంటి దస్తావేజులు సరిగ్గా లేవు. పైగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎంతో కొంత ఉండొచ్చు కదా’ ఫోన్లో చెప్పాడు అతను. ‘ఎంతోకొంత ఏంటి? దాదాపు పాతిక లక్షల దాకా ఉన్నాయి’ చెప్పిందామె ఫోన్లో. ‘కచ్చితంగా మీ నాన్నకు ఇన్‌కమ్‌టాక్స్ ప్రాబ్లం రావచ్చు’ అతను. ‘అయ్యో.. ఇప్పుడెలాగా?’ కంగారు పడింది ఆమె. ‘ఆ.. ఒక పనిచెయ్యొచ్చు’ అన్నాడు. ‘ఏంటీ’ ఆత్రంగా ఆమె. ‘నా ఫ్రెండ్ ఉంటాడు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్లో. వాడికి ఆ పాతిక లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే.. ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మళ్లీ వాటిని మీ నాన్నకు పంపేస్తాడు’ అని అతను చెప్పేలోపే ‘ఓకే. మా నాన్నకు చెప్పేస్తా’ అంది. ‘ఆగాగు.. ముందు మా ఫ్రెండ్‌ని ఒప్పించాలి’ అన్నాడు అతను. రెండో రోజు ఫోన్ చేసి.. ‘చాలా కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది మా ఫ్రెండ్‌ను. వాడి మూడ్ చేంజ్ కాకముందే వెంటనే ఆ పాతిక లక్షలు ట్రాన్స్ఫర్ చెసేయండి’ అంటూ అకౌంట్ డిటైల్స్ ఇచ్చి ఫోన్‌పెట్టేశాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అతను ఉడాయించాడు. ఈ పరిచయమూ మ్యాట్రిమోనీదే. పైనవన్నీ మ్యాట్రిమోనియల్ మోసాలు. ఆ నేరస్థులందరి వల ముప్పై నుంచి ముప్పై అయిదులోపు వయసున్న పునర్వివాహ వధువుల పైనే. వాళ్లందరికి ప్లాట్‌ఫామ్ ఒకటే.. మ్యాట్రిమోనియల్ సైట్స్. ఆ నేరస్థులందరి మోడస్ ఆపరెండి ఒకటే.. ఫేక్ ప్రొఫైల్. అరవింద్ సన్యాల్, కృష్ణ మాధవ్, అతను.. ఇంకా అలాంటి వాళ్లెందరో. అవేవీ వాళ్ల అసలు పేర్లు కావు. వాళ్ల వృత్తులూ అవి కావు. పేర్లు, ప్రొఫైళ్లు... కుటుంబ వివరాలు అన్నీ నకిలీవే. వీళ్లంతా మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో ఫేక్ ప్రొఫైల్ ఏర్పాటు చేసుకుని అందులో ఉన్న వధువుల లిస్ట్ చూస్తారు. రెండో పెళ్లి వాళ్లను ఎంచుకుంటారు. అదీ ఆస్తి, సంపాదన ఉన్న ఆడవాళ్లనే సుమా. అలా ఎంపిక చేసుకున్నాక మ్యాట్రిమోనిలో ఉన్న తమ నకిలీ ప్రొఫైల్‌తోనే ఫేస్బుక్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ అమ్మాయిల ఆసక్తులు, అభిచురుచులకు తగ్గట్టుగా. ఇక అక్కడి నుంచి ప్రేమ, పెళ్లి నాటకం మొదలుపెట్టి.. ఇలా మోసంతో దానికి ఎండ్ పలుకుతారు. కొన్నేళ్ల కిందట మొదలైన ఈ ధోరణి కొంతకాలంగా మరీ పెరిగిపోయింది. ఇంకాస్త ముందుకు వెళ్లి .. వాళ్ల ఫోటోలు, వీడియోలనూ వైరల్ చేస్తామంటూ బెదిరిస్తూ బ్లాక్మెయిల్స్కూ దిగుతున్నారు. ఇలాంటి వారి వలలో పడకుండా ఉండాలంటే సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మకుండా ఉండాలి ముందు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... ఆన్లైన్ మ్యారేజ్ సైట్లలో మీ వివరాలను కొత్త మెయిల్ ఐడీతో నమోదు చేసుకోండి. మీ ప్రొఫైల్ నచ్చి.. మీతో జీవితం పంచుకోవాలనుకునే వాళ్లెప్పుడూ మిమ్నల్ని తొందరపెట్టరు. మీ స్పేస్‌ను, మీ టైమ్‌ను గౌరవిస్తారు. వీటికి విరుద్ధంగా మీ మీద ఒత్తిడి తెస్తున్నారంటే వాళ్లను అనుమానించాల్సిందే. అలాగే మ్యాట్రిమోనియల్ సైట్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఫేస్బుక్, ఇతర సోషల్‌మీడియా అకౌంట్లను క్లోజ్ చేయడం మంచిది. ఒకవేళ కొనసాగించాలనుకున్నా ఫొటోలతో సహా మీ వ్యక్తిగత వివరాలన్నిటినీ అందులోంచి తొలగించండి. వీలైతే ఆన్లైన్ సైట్ల పెళ్లి సంబంధాలకు దూరంగా ఉండండి. – అనిల్ రాచమల్ల, ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్నెస్ ఎక్స్పర్ట్. నేరస్థులకు శిక్షలు? ‘ఐటీ యాక్ట్ కిందకు వచ్చే ఈ నేరాలకు శిక్షలు ఉన్నాయి. తన అసలు గుర్తింపుతో కాకుండా మరో వ్యక్తిలా నటించి మోసానికి పాల్పడే ఈ నేరాన్ని ఐటీ యాక్ట్ 66 (డి) కింద మోసంగా పరిగణిస్తున్నారు. దీనికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. అలాగే ఇండియన్ పీనల్ కోడ్‌లోనూ దీనికి శిక్షలున్నాయి. ఐపీసీలోని సెక్షన్ 416.. దీన్ని వంచన, మోసం కింద పరిగణించి ఐపీసీలోని సెక్షన్ 417 ప్రకారం యేడాది పాటు జైలు శిక్షను ఖరారు చేస్తోంది. అలాగే ఐపీసీలోని సెక్షన్ 418.. దీన్ని విపరీతమైన నేరంగా పరిగణించి అంటే ఒక వ్యక్తి పోలీస్ అధికారిగా, ఐఏఎస్, ఐఆర్ఎస్ వంటి ప్రభుత్వ ఉన్నతోద్యోగులుగా నటించి మోసం చేసినందుకు ఐపీసీలోని సెక్షన్ 419 ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, జరిమానాను విధిస్తోంది. వీటన్నిటితోపాటు చీటింగ్ పేరుతో ఐపీసీలోని సెక్షన్ 420 కిందా కేసు నమోదు చేయొచ్చు. అంతేకాకుండా.. ఈ మోసాలు జరగడానికి తావిచ్చిన ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్లయిన మ్యాట్రిమోనియల్ పోర్టల్స్కూ ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 79 (3) ప్రకారం శిక్ష పడుతుంది. ఒకవేళ ఇలా మోసం చేసి అవతలి వ్యక్తి పెళ్లి చేసుకుంటే .. పెళ్లయిన యేడాదిలోపు ఆ అమ్మాయిలకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే తమ వివాహాన్ని రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది చట్టం. – ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్. దీనికి విరుగుడు ఏంటి? ‘మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో వ్యక్తిగత వివరాలను పూర్తిగా ఇవ్వకూడదు. అలాగే తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు ఇవ్వాలి. అవతలి వ్యక్తి వివరాలను కూడా జాగ్రత్తగా చూడాలి. వరుడి వైపు నుంచి కూడా అతని తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లు ఉంటేనే సంప్రదించాలి. ఇప్పుడు నేరుగా వరుడిగా అవతారమెత్తిన వ్యక్తి మోసానికి పాల్పడడం లేదు. డబ్బు లావాదేవీల కోసం మధ్యవర్తులను పెట్టుకుంటున్నారు. ఆ మధ్యవర్తులకు కమీషన్ ఆశ చూసి వాళ్ల అకౌంట్లోకి డబ్బులు వేయిస్తున్నారు. దాంతో అసలు నేరస్థులు దొరకడం లేదు. మోసం చేసిన వెంటనే అన్నీ మార్చేస్తారు నంబర్ల నుంచి స్థావరాల దాక. సాధారణంగా దీని వెనక నైజీరియన్లు, ఇతర ఆఫ్రికన్ దేశాల వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో కూడా వివరాలను, ఫొటోలను పోస్ట్ చేయకూడదు. అమ్మాయిలు, అమ్మాయి తరపు వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. – కేవీఎమ్ ప్రసాద్, ఏసీపీ (సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, తెలంగాణ) -
ఫేక్ ప్రొఫైల్‌తో కుచ్చుటోపీ
బెంగళూర్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఉద్యోగులుగా చెప్పుకుంటూ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరు వ్యక్తులను మంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను షౌకత్ అహ్మద్ (కశ్మీర్), బల్జీందర్ సింగ్(పంజాబ్)లుగా గుర్తించారు. షౌకత్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్‌గా, సింగ్ ఆయన డ్రైవర్‌గా చెబుతూ దేశవ్యాప్తంగా పలువురిని బురిడీ కొట్టించారని పోలీసులు వెల్లడించారు. గోవా, ముంబై, కర్ణాటక, చత్తీస్‌గఢ్, హైదరాబాద్, అమృత్సర్ వంటి పలు ప్రాంతాల్లో తాము పలువురిని మోసగించినట్టు విచారణలో నిందితులు అంగీకరించారు. డబ్ల్యూహెచ్ఓలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారు ప్రజల నుంచి పెద్దమొత్తంలో డబ్బు సేకరించారు. ఒక్కొక్కరి నుంచి రూ 5 నుంచి రూ 10 లక్షల వరకూ డబ్బులు గుంజినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు మ్యాట్రిమోనీ సైట్లో డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్‌గా ప్రొఫెల్ తెరిచిన షౌకత్ ఆ హోదాను అడ్డుపెట్టుకుని పలువురు మహిళలను మోసగించాడు. ఈనెల 17న మంగుళూర్‌లో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ నేమ్ ప్లేట్‌తో కూడిన కారులో ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డబ్ల్యుహెచ్ఓకు షౌకత్ గురించిన సమాచారం అందించగా ఆ పేరుతో తమ సంస్థలో ఎలాంటి ఉద్యోగి లేడన్న సమాధానం రాగా పోలీసులు తమదైన శైలిలో విచారించి నిందితుల నిర్వాకం బయటకులాగారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఈ అర్చన వలలో పడితే ఇక అంతే
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు యువతులను వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతూ మ్యాట్రి మోనీ వెబ్సైట్లలో వివరాలు అప్లోడ్ చేసే విదేశీ వరులను పెళ్లి పేరుతో నమ్మించి రూ. లక్షల్లో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న కిలాడీ లేడీని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. అందమైన యువతుల ఫొటోలతో టోకరా.. నెల్లూరు జిల్లా, ఇనమడుగుకు చెందిన అర్చన ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2016లో నెల్లూరులోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న కొరమ్ దుర్గా ప్రవీణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే అప్పటికే జల్సాలకు అలవాటు పడిన అర్చన సులువుగా డబ్బులు సంపాదించేందుకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుంది. గూగుల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అందమైన యువతుల ఫొటోలను డౌన్లోడ్ చేసుకుని ‘తెలుగు మ్యాట్రిమోనీ’ వెబ్సైట్లో ఫుష్‌తాయి పేరుతో ప్రొఫైల్ నిక్షిప్తం చేసింది. కేవలం విదేశీ వరులను మాత్రమే పెళ్లి చేసుకుంటానన్న అప్షన్ కూడా పొందుపరిచింది. అర్చన ఇచ్చిన ఫోన్నంబర్లో సంప్రదించిన వరుడి తల్లిదండ్రులతో గూగుల్ యాప్‌లలో అందుబాటులో ఉన్న మొబైల్ అప్లికేషన్ల ద్వారా పలు రకాల వాయిస్‌లతో మాట్లాడేది. తన మాటలను వరుడు, లేదా వారి తల్లిదండ్రులు నమ్మినట్లు గుర్తిస్తే పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పేది. కొన్నిరోజులు మాట్లాడిన అనంతరం వరుడికి ఫొటోలు పంపించేది. ఆ తర్వాత ఎంగేంజ్‌మెంట్ రింగ్‌లు, బంగారు నగలు, బహుమతుల పేరుతో లక్షల్లో దండుకునేది. ఇదే తరహాలో అమెరికాలో ఉంటున్న సింహద్రి పవన్‌కుమార్ అనే యువకుడిని భారత్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఫుష్‌తాయి పేరుతో పరిచయం చేసుకుంది. వెస్ట్‌పామ్ బీచ్, సీస్కో క్లెయింట్ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న తాను ఇల్లు మారేందుకు రూ.నాలుగు లక్షలు అవసరమని చెప్పడంతో పవన్‌కుమార్ ఆమె ఇచ్చిన బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేశాడు. అనంతరం అతడితో సంబంధాలు కట్ చేయడంతో ఆనుమానం వచ్చిన పవన్‌కుమార్ తాను మోసపోయినట్లు గుర్తించి, ఈ విషయాన్ని తన సోదరుడైన కొత్తపేటకు చెందిన మధుమోహన్ దృష్టికి తెచ్చాడు. దీంతో ఈ నెల 12న మధుమోహన్ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇటీవల ఇదే తరహా కేసులో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితురాలు పుష్తాయి పేరుతో చలామణి అవుతున్న అర్చనను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మంగళవారం ఆమె బెయిల్‌పై బయటికి రాగానే రాచకొండ పోలీసులు మళ్లీ అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. గతంలోనే ఇదే తరహా కేసుల్లో నగర సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించగా, 2018 డిసెంబర్లో ఓ అడ్వకేట్ సహాయంతో బయటకు వచ్చిందని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు.