అన్నింటికీ ఆన్‌లైనే.. | Online matrimony biz to touch Rs 1500cr by 2017: Assocham | Sakshi
Sakshi News home page

అన్నింటికీ ఆన్‌లైనే..

Published Wed, Dec 18 2013 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

అన్నింటికీ ఆన్‌లైనే..

అన్నింటికీ ఆన్‌లైనే..

న్యూఢిల్లీ: భారత్‌లో ఆన్‌లైన్ ప్రాధాన్యత నానాటికీ పెరుగుతోంది. వివాహ సంబంధాలు కుదుర్చుకోవడం, ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం,  రైల్వే టికెట్ల బుకింగ్ (పర్యాటక రంగం).. ఇవన్నీ  కూడా ఆన్‌లైన్ ద్వారా పెరిగిపోతున్నాయి. ఈ విషయమై ఆసోచామ్ తాజా సర్వే పలు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. కొన్ని ముఖ్యాంశాలు....,
 

  •  ఆన్‌లైన్  మ్యాట్రిమొని వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రూ.520 కోట్లుగా ఉన్న ఈ వ్యాపారం 2017 నాటికి 65 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది.
  •  సమయం ఆదా కావడం, సౌకర్యవంతం, అనువైనదిగా ఉండడం వంటి కారణాల వల్ల ఆన్‌లైన్ మ్యాట్రిమొనీకి ఆదరణ పెరుగుతోంది.
  •  గత ఆర్థిక సంవత్సరంలో 5-5.5 కోట్ల మంది వినియోగదారులు ఆన్‌లైన్ మ్యాట్రిమొని వెబ్‌సైట్లలో తమ తమ ప్రొఫైళ్లను రిజిష్ట ర్ చేశారు.
  •  నెలకు 25 లక్షల ప్రొఫైల్స్ నమోదవుతున్నాయి.
  •  ప్రవాస భారతీయులు తమ సంతానానికి పెళ్లి సంబంధాలు వెతకడానికి ఆన్‌లైన్ మ్యాట్రిమొని సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త తరం యువతీ, యువకులదీ అదే దారి.
  •  2011-13 కాలంలో ఆన్‌లైన్ వివాహ సంబంధాల ప్రకటనలు 52 శాతం, ఆన్‌లైన్ ఉద్యోగ ప్రకటనలు 56 శాతం చొప్పున వృద్ధి చెందాయి.  
  •  2012-13లో 2.5 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 2016-17 నాటికి 5 కోట్లకు పెరుగుతుందని అంచనా.  
  •  ఆన్‌లైన్ ద్వారా రైల్వే టికెట్ల బుకింగ్ జోరు పెరుగుతోంది. గత ఏడాది జూన్‌లో 58.3 లక్షల రైల్వే టికెట్లు బుక్ కాగా, ఈ ఏడాది జూన్‌లో 25 శాతం వృద్ధితో  68.1 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement