
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోని ద్వారా ప్రకటనలు ఇస్తూ మహిళలను పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొక్కరిని ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుని మరో మహిళను మోసం చేసిన అప్పలరాజు అలియాస్ విజయ్ బాగోతం తాజాగా బయటపడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... దమ్మాయిగూడలోని అయోధ్యనగర్ కాలనీలో నివాసముంటున్న అప్పలరాజు అలి యాస్ విజయ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి సంతానం కలగలేదు.
మ్యాట్రిమోని, పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ మహిళలను మోసం చేస్తు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలిసి సదరు మహిళ అప్పలరాజును నిలదీసింది. చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేస్తున్న విషయం బాధితురాలు తెలసుకుని మహిళా సంఘాల నాయకులతో అప్పలరాజు ఇంటి ఎదుట శుక్రవారం నిరసనకు దిగింది. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment