చికాగోలో క్రైస్తవుల వివాహా పరిచయ వేదిక | Eliezer Ministry Of Matrimony Organized Matriy Meet For Indian Christians | Sakshi
Sakshi News home page

చికాగోలో క్రైస్తవుల వివాహా పరిచయ వేదిక

Published Sat, Apr 21 2018 11:43 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Eliezer Ministry Of Matrimony Organized Matriy Meet For Indian Christians - Sakshi

చికాగో : అమెరికాలోని భారతీయ క్రైస్తవ యువతి, యువకుల కోసం వివాహా పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఎలిజర్‌ మినిస్ట్రి ఆఫ్‌ మాట్రిమోనీ చికాగో(ఈఎంఎం) ఆధ్వర్యంలో యునైటెడ్‌ తెలుగు క్రిస్టియన్‌ కమ్యూనిటీ ఆఫ్‌ చికాగో, క్లెర్జి కౌన్సిల్‌ ఆఫ్‌ చికాగో (సీసీసీ) ల సహకారంతో ఈ నెల 7న ఇల్లినాయిస్‌లో ఏర్పాటు చేసినట్టు నిర్వాహాకులు తెలిపారు. ఈ పరిచయ వేదికకు పెద్ద సంఖ్యలో యువతి, యువకులు వారి తల్లిదండ్రులు హాజరైయ్యారు. పరివార్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సామ్‌ జార్జ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈఎంఎం సమన్వయకర్తలైన ప్రభు, జాన్‌సన్‌ సుక్కు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన యువతీయువకులకు, తల్లిదండ్రులకు, శ్రేయేభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement