ఖరీదైన భవంతి కొనుగోలుతో ఎన్ఆర్ఐ రికార్డు
చికాగో: భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ అమెరికన్ గా మారడానికే తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చానని సంచలన ప్రకటన చేస్తే..చికాగోలో స్థిరపడిన ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త సంజయ్ షా మాత్రం తన తల్లి దండ్రులు భారతీయ అమెరికన్ గా ఉండే కలను నిజం చేశాడు. ఇందుకోసం చికాగోలోని ట్రంప్ టవర్ లో 17 మిలియన్ డాలర్లు(దాదాపు 104 కోట్లు)తో అత్యంత ఖరీదైన ఇళ్లును కొనుగోలు చేసిన సంజయ్ అరుదైన రికార్డు సృష్టించాడు. 15,000 చదరపు అడుగుల స్థలంలో 89 అంతస్తుల భవనాన్ని తాజాగా కొన్నాడు. సంజయ్ కొనుగోలు చేసిన ఆ సువిశాల ఆకాశహర్మ్యం అతని తల్లి దండ్రుల కోసమేనట.
ప్రస్తుతం అతని తల్లిదండ్రులు ముంబైలోని 1,200 స్వేర్ ఫీట్ల ఓ అపార్టమెంట్ లో నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా సంజయ్ కు మాత్రం కొత్తగా కొనుగోలు చేసిన ఆ భారీ భవంతిలో ఉండే ఉద్దేశం లేదట. భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి చికాగోని సౌత్ బారింగ్టన్ లో నివసిస్తున్న సంజయ్ తన పాత భవంతిలోనే ఉండాడట.