షికాగో: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), షికాగో టీం ఆధ్వర్యంలో అరోరా బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇల్లినాయిస్ 11 వ డిస్ట్రిక్ట్ కాంగ్రెసు మాన్ బిల్ ఫాస్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ౩5౦ మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు.
మంగళ వాయిద్యాల మధ్యన కాంగ్రెస్ మాన్ బిల్ ఫాస్టర్ జ్యోతి ప్రజ్వాలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఇంజనీరింగ్, మెడికల్, వ్యాపార రoగాలలో తెలుగు వారు ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించారన్నారు. మిలియన్‌కి పైగా జనాభా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంతో తమ సంస్కృతి, పండుగలు అమెరికాలో నిర్వహించడం శ్లాఘనీయమన్నారు.
బతుకమ్మ, దసరా వేడుకలను పురస్కరించుకుని మహిళలు, పిల్లలు సంద్రయాద దుస్తులు ధరించి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. కోలాటం, డోలు వాయిద్యాల హోరు మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. జమ్మి పూజ నిర్వహించి అందరికి ప్రసాదాలు అందించారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియచేసారు.
ఆటా బోర్డు అఫ్ ట్రస్టీ డాక్టర్ మెహర్ మేడవరం, ఆటా ట్రెజరర్, ట్రస్టీ సాయినాథ్ రెడ్డి బోయపల్లి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ఆఫీస్ కోఆర్డినేటర్ మహీధర్ ముస్కుల తోడ్పాటుని అందించారు. రీజినల్ కోఆర్డినేటర్స్ వెంకట్‌రామిరెడ్డి రావి, వెంకటేశ్వర రామిరెడ్డి, సుచిత్ర రెడ్డిలు సహకారం అందించారు. వీరితో పాటు చల్మారెడ్డి బండారు, వెంకట్ థుడి, మహిపాల్ వంఛ, భాను స్వర్గం, నరసింహ చిత్తలూరి, లక్ష్మి బోయపల్లి, కరుణాకర్ దొడ్డం, అమరేంద్ర నెట్టం, రమణ అబ్బరాజు, సతీష్ యెల్లమిల్లి, విశ్వనాధ్ చిత్ర, హరి రైని, జగన్ బుక్కరాజు, భీమి రెడ్డిలు కూడా తమ వంతు కృషిని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment