ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఘనంగా దసరా | ATA Dussera Dhamaka in New Jersey | Sakshi
Sakshi News home page

ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఘనంగా దసరా

Published Tue, Oct 19 2021 3:43 PM | Last Updated on Tue, Oct 19 2021 3:52 PM

ATA Dussera Dhamaka in New Jersey - Sakshi

న్యూజెర్సీ: అమెరికా తెలుగు అసోసియేషన్‌​ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయల్‌గ్రాండ్‌ మ్యానర్‌లో జరిగిన ఈ వేడుకలకు న్యూజెర్సీ పరిసర ప్రాంతాలకు చెందిన వెయ్యికి మందికి పైగా తెలుగు వారు హాజరయ్యారు. దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వేడుకలను న్యూజెర్సీ కాన్సులేట్‌ జనరల్‌ విజయ్‌ కృష్ణన్‌, ప్రారంభించారు. 

ఈ సందర్భంగా అటా అధ్యక్షుడు భువనేశ్‌ బూజాల మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న అటా మెగా సదస్సుకు రావాల్సిందిగా ప్రతీ ఒక్కరిని ఆహ్వానించారు. అటా తరఫున చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ దసరా వేడుకల్లో వివిధ తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement