డాలస్‌లో వైభవం గా యోగాడే వేడుకలు | Yoga Day Celebrations At Mahathma Gandhi Memorial in Dallas | Sakshi
Sakshi News home page

డాలస్‌లో వైభవం గా యోగాడే వేడుకలు

Published Tue, Jun 21 2022 12:52 PM | Last Updated on Tue, Jun 21 2022 12:57 PM

Yoga Day Celebrations At Mahathma Gandhi Memorial in Dallas - Sakshi

డాలస్ (టెక్సాస్): మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన, డాలస్‌లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపారు. 2022 జూన్ 21న ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్‌ ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్‌కి స్వాగతం పలికారు. భారత దేశం ప్రపంచానికి అందించిన యోగా కేవలం జూన్ 21నే కాకుండా నిత్యం అభ్యాసం చెయ్యవలసిన కార్యక్రమమన్నారు. యోగావల్ల శరీరం, మనస్సు స్వాధీనంలో ఉంటాయని తెలియజేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21 వ తేదీన యోగా కార్యక్రమం జరపడం ఎంతో సంతోషదాయకమని ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్ అన్నారు.  ప్రతి రోజూ యోగా చెయ్యడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు వివరించారు. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు దినేష్ హూడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, షబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారను. 

ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్, ఐరిస్, ఆనందీలకు, ముఖ్య అతిథి కాన్సల్ జనరల్ అసీం మహాజన్ కు, మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు దినేష్ హూడా కృతజ్ఞతలు తెలియజేశారు. 

చదవండి: అగ్రరాజ్యాన అంగరంగ వైభవంగా అచ్యుతుడి కల్యాణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement