తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మొదటిసారిగా నిర్వహించిన సోలో మెగా కన్వెన్షన్ ఘనంగా జరిగింది. న్యూజెర్సీ ఎక్స్‌పో & కన్వెన్షన్ సెంటర్‌లో మే 27 నుంచి 29 వరకు జరిగిన ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకులతో గ్రాండ్ సక్సెస్ అయింది. వివిధ కేటగిరీల కింద పలువురికి అవార్డులు అందచేశారు. సాంస్కృతిక విందులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఫ్యాషన్ షోలు మెగా ఈవెంట్‌కు రంగులద్దాయి. విందు రాత్రి ముగింపులో సంగీత దర్శకుడు కోటి ట్రూప్ చేపట్టిన కార్యక్రమం ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ గర్వకారణమైన బతుకమ్మ, బోనాలు, పోతరాజులతో టీటీఏ మెగా కన్వెన్షన్‌ను అధికారికంగా ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్ ముఖద్వారాన్ని చార్మినార్, కాకతీయ కళా తోరణం, తెలంగాణ తల్లి, ఆరు అడుగుల బతుకమ్మ, సమ్మక్క, సారక్కల ప్రతిరూపాలతో ఉత్సవ కమిటీ చక్కగా అలంకరించింది. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ స్థానిక సెనేటర్లు సామ్ థామ్సన్, ఈస్ట్ బ్రున్స్విక్ మేయర్ బ్రాడ్ కోహెన్, తెలంగాణ మంత్రులు మరియు రాజకీయ నాయకులు ఈ వేడుకల్లో భాగమయ్యారు.
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో డాక్టర్ మల్లారెడ్డి పైళ్ల ఆధ్వర్యంలో డాక్టర్ విజయపాల్‌రెడ్డి, డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల, టీటీఏ అధ్యక్షుడు డాక్టర్ మోహన్‌రెడ్డి పట్లోళ్ల, కన్వీనర్ శ్రీనివాస్ గనగోని, అధ్యక్షుడు ఎలెక్ట్ వంశీరెడ్డి, కోఆర్డినేటర్ గంగాధర్ వుప్పల, కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, ఈర్‌వీపీలు, స్టాండింగ్ కమిటీలు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్‌లు కృషి చేశారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రతి మూలకు చెందిన వాలంటీర్లు గత రెండు దశాబ్దాల చరిత్రలో అత్యుత్తమ మెగా కన్వెన్షన్‌ను అందించడానికి ఆరు నెలలకు పైగా తమ వ్యక్తిగత సమయాన్ని వెచ్చించారు. తెలంగాణపై అలంకరణలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్వెన్షన్ అంతటా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించడంలో టీటీఏ విజయవంతమైంది.
చదవండి: పెట్రోల్‌పై డిస్కౌంట్! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు
Comments
Please login to add a commentAdd a comment