రూ.21.2 లక్షలు స్వాహా
గచ్చిబౌలి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపిన ప్రకారం..ఖాజాగూడలోని సాయి వైభవ్ లేఅవుట్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి డాక్టర్‌గా పనిచేస్తున్న తన కూతురుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు మ్యాట్రిమోనిలో అమ్మాయి వివరాలు ఉంచాడు. ఈ వివరాలు తెలుసుకున్న రాయపాటి కృష్ణ చౌదరి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయి నచ్చిందిని చెప్పాడు. తన అక్క మాధురి, నాన్న రంగ ప్రసాద్, అమ్మ రాణిదేవి ఆ్రస్టేలియా ఉంటున్నారని నమ్మించాడు.
ఫోన్‌లో వారితో మాట్లాడించి అమ్మాయి నచ్చిందిని చెప్పించాడు. ఆగస్టు 14న ఇంటికి వచ్చి త్వరలోనే ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందామని చెప్పాడు. అమ్మాయికి కేజీ బంగారు నగలు తీసుకుంటున్నామని, కొంత డబ్బు తక్కువ పడిందని చెప్పాడు. దీంతో తమ అమ్మాయికే నగలు పెడుతున్నారని నమ్మి బాధితులు నవంబర్ 28,29,30 తేదీల్లో రూ.19 లక్షల నగదు, ఆన్‌లైన్‌లో రూ.2.2 లక్షలు ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తి కాంటాక్ట్‌లోకి రాకపోవడంతో అనుమానం వచ్చి రెండు నెంబర్లకు ఫోన్ చేయగా రెస్పాండ్ కాలేదు. దీంతో ఈ నెల 12న యువతి తండ్రి రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో బీఎన్‌ఎస్ 318(40, 316(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మోసానికి పాల్పడిన వ్యక్తి బాచుపల్లిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇప్పటికే పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లోనూ అతనిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తెలుగు మ్యాట్రిమోనిలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు పెట్టి..పెళ్లి పేరిట ఇతను మోసాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment