సాక్షి, హైదరాబాద్: డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి, పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాణ్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన చిన్నిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి పలు డేటింగ్ యాప్‌లలో సందీప్ సన్నీ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు.
ఆకర్షితురాలైన ఓ బాధితురాలికి గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని నమ్మించాడు. స్నేహం పేరుతో బంధాన్ని ప్రారంభించి తర్వాత ప్రేమ, పెళ్లి వరకూ తీసుకెళ్లాడు. వ్యక్తిగత, కుటుంబ కష్టాలు ఉన్నాయని కట్టుకథలు చెప్పి బాధితురాలి నుంచి రూ.6.41 లక్షలు వసూలు చేశాడు. కొట్టేసిన సొమ్మును మేజిస్టిక్ ప్రైడ్, క్యాసినో ప్రైడ్ వంటి ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో పెట్టి పోగొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశారు. సెల్‌ఫోన్, సిమ్ కార్డులను స్వా«దీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment