
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 1న తెలుగు రాష్ట్రాల నాయీ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంక్షేమ మరియు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.రామానంద స్వామి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కర్మన్‌ఘాట్ దుర్గానగర్ కాలనీలోని నాయీ బ్రాహ్మణ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి గలవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని నాయీ బ్రాహ్మణ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9848781602 నంబర్‌లో సంప్రదించవచ్చు.