nayi Brahmin
-
నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి తదితరాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ జీవో బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వత్రా హర్షం కులదూషణను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో ఎంఎస్ 50ను విస్తృతంగా ప్రచారం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. (క్లిక్: ఏదినిజం.. గోబెల్స్‌ను మించిన రామోజీ!) తెలంగాణలోనూ అమలు చేయండి నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలను ఏపీ ప్రభుత్వం నిషేధించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలంగాణలోనూ ఇటువంటి జీవో తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. (క్లిక్: గోరంట్ల మాధవ్ పేరిట వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు) -
సమ్మెను విరమింపజేయండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. 13 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేసుందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వం పంతానికి పోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మద్దికుంట లింగం అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు గత నెల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. ఆర్టీసీని రక్షించేందుకు కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. సమ్మెతో సామాన్య ప్రజలు, పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమ్మె పేరు చెప్పి ప్రైవేటు వాహనదారులు ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారని, విచ్చలవిడిగా తిరుతున్న ప్రైవేటు వాహనాలపై అజమాయిషీ కరువైందన్నారు. ప్రైవేటు సిబ్బందితో ఆర్టీసీ బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలన్నారు. విలేకరుల సమావేశంలో సీనియర్ నేత మహేష్‌చంద్ర, కార్టూనిస్ట్ నారూ, రమేశ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యంగా ముందుకు సాగుదాం
సాక్షి, హైదరాబాద్: ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని నాయీ బ్రాహ్మణ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆబిడ్స్‌లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన దసరా ఆత్మీయ సమ్మేళనంలో నాయీ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో తమకు సరైన అవకాశాలు దక్కడం లేదని, తమ వాటా తమకు ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేస్తూనే, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకోస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని కోరారు. తమను అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల జాబితాలో చేర్చాలని జస్టిస్ రోహిణి కమిషన్‌కు వినతులు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నాయీ బ్రాహ్మణులు తమ సంఘీభావం తెలిపారు. 25న ధన్వంతరి జయంతి వేడుకలు వైద్య వృత్తికి ఆదిదేవుడు, నాయీ బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతి వేడుకలను ఈ నెల 25న నిర్వహించనున్నామని డాక్టర్ బీర్ఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసి నాయీ బ్రాహ్మణుల ఐక్యతను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ధన్వంతరి స్ఫూర్తితో అన్ని రంగాల్లో ముందుడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. తమ సంఘీయుల మధ్య సృహృద్భావ సంబంధాలు ఏర్పాలడాలన్న ఉద్దేశంతో దసరా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్రచంద్ర, కె. వెంకటేశ్వరరావు, జి. అశోక్, గంగాధర్, సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, మద్దికుంట లింగం, సీనియర్ కార్టూనిస్ట్ నారూ, రాపోలు సుదర్శన్, వెంకట్రాయుడు, సూర్యనారాయణ, బాలరాజు, ధనరాజ్, శ్రీధర్, రాజేశ్, పసుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాయీ బ్రాహ్మణుల అలయ్ బలయ్
సాక్షి, హైదరాబాద్: నాయీ బ్రాహ్మణుల దసరా ఆత్మీయ సదస్సు(అలయ్ బలయ్) ఆదివారం ఆబిడ్స్‌లోని హోటల్ మందాకిని జయ ఇంటర్నేషనల్‌లో జరగనుంది. నాయీ జాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణులు తరలి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఆత్మీయ సదస్సు జరుగుతుందని తెలిపారు. నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణుల ఐక్యమత్యానికి, సృహృద్భావ సంబంధాల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
నాయి బ్రాహ్మణులను బెదిరిస్తారా?
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తెలుగుదేశం పార్టీ(టీడీపీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లు మోసం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. బీజేపీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా లాలూచీ పడ్డారని ఆరోపించారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిలదీస్తే ఆయన చిత్తశుద్ధి ప్రజలకు తెలిసివుండేదని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించిన అంశాలను అధికార పార్టీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దుబారా ఖర్చుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందని దుయ్యబట్టారు. న్యాయం కోసం సచివాలయానికి వచ్చిన నాయి బ్రాహ్మణులను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదా? అని నిలదీశారు. బలహీన వర్గాలపై చంద్రబాబుకు గౌరవం లేదని బొత్స మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఈ నెల 30వ తేదీన అనంతపురంలో నయవంచన దీక్ష చేపట్టనున్నట్లు బొత్స ప్రకటించారు. -
చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను
-
కనకదుర్గా ఆలయంలో నిరసన..
సాక్షి, విజయవాడ: కనకదుర్గా అమ్మవారి ఆలయంలో గందరగోళం నెలకొంది. దేవస్థాన పాలకమండలి సభ్యుడికి, కేశఖండన చేసే క్షురకులకు మధ్య వివాదం రాజుకుంది. వివరాలు.. కేశ ఖండన చేసే సమయంలో భక్తుల నుంచి ఎటువంటి కానుకలు, డబ్బులు తీసుకోకూడదనే నిబంధన పాలకమండలి అమలు చేస్తోంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఓ భక్తుడి నుంచి క్షురకుడొకరు పది రూపాయలు తీసుకున్నాడనే ఫిర్యాదు అందడంతో పాలకమండలి సభ్యుడు పెంచలయ్య సదరు క్షురకుడితో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా శృతి మించింది. పెంచలయ్య క్షురకుడి చొక్కా పట్టుకున్నారనీ ఆరోపిస్తూ.. పాలక మండలి సభ్యుడి చర్యలకు నిరసనగా వారు విధులు బహిష్కరించారు. వివాదం సద్దుమణగక పోవడంతో కేఖ ఖండన చేయించుకునే భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. -
ఏప్రిల్ 1న నాయీ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 1న తెలుగు రాష్ట్రాల నాయీ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంక్షేమ మరియు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.రామానంద స్వామి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్మన్‌ఘాట్ దుర్గానగర్ కాలనీలోని నాయీ బ్రాహ్మణ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి గలవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని నాయీ బ్రాహ్మణ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9848781602 నంబర్లో సంప్రదించవచ్చు. -
నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు ఇవ్వాలి
ఆర్.కృష్ణయ్య డిమాండ్ దోమలగూడ : నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. చిక్కడపల్లిలోని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కష్ణయ్య, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టరు లక్ష్మణ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, అరుణోదయ విమలక్క, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మహిళా సంఘం అధ్యక్షులు శారదాగౌడ్, తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు డీవీ నరేందర్‌రావు నాయీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మంగళి వృత్తిని ఆధునీకరించడానికి ఒక్కో షాపునకు 10 నుంచి 50 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించాలని, గ్రూపు రుణాలుగా కాకుండా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. బీజేపీ బీసీల అభివద్దికి కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ తెలంగాణ సాధనలో నాయీ బ్రాహ్మణులు తమవంతు పోరాటం చేశారన్నారు. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ అధ్యక్షులు సతీష్నాయీ, ప్రధానకార్యదర్శి రాం బాబు నాయీ, నాయకులు మనోహర్నాయీ, ఓంప్రకాష్నాయీ, కె హరినాధ్, బీసీ నాయకులు కృష్ణ, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వినయ్ తదితరులు పాల్గొన్నారు.