కనకదుర్గా ఆలయం
సాక్షి, విజయవాడ: కనకదుర్గా అమ్మవారి ఆలయంలో గందరగోళం నెలకొంది. దేవస్థాన పాలకమండలి సభ్యుడికి, కేశఖండన చేసే క్షురకులకు మధ్య వివాదం రాజుకుంది. వివరాలు.. కేశ ఖండన చేసే సమయంలో భక్తుల నుంచి ఎటువంటి కానుకలు, డబ్బులు తీసుకోకూడదనే నిబంధన పాలకమండలి అమలు చేస్తోంది.
అయితే శుక్రవారం మధ్యాహ్నం ఓ భక్తుడి నుంచి క్షురకుడొకరు పది రూపాయలు తీసుకున్నాడనే ఫిర్యాదు అందడంతో పాలకమండలి సభ్యుడు పెంచలయ్య సదరు క్షురకుడితో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా శృతి మించింది. పెంచలయ్య క్షురకుడి చొక్కా పట్టుకున్నారనీ ఆరోపిస్తూ.. పాలక మండలి సభ్యుడి చర్యలకు నిరసనగా వారు విధులు బహిష్కరించారు. వివాదం సద్దుమణగక పోవడంతో కేఖ ఖండన చేయించుకునే భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment