సాక్షి, విజయవాడ: దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఆరో రోజు దుర్గదేవి అమ్మవారు శ్రీ లలితాత్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదాశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతిదేవీ ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్య జితోష్ణలను చిందిస్తూ, చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్ధలంపై కూర్చుని శ్రీ లలితాత్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. చదవండి: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ఇంద్రకీలాద్రి:
ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం
బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్!!
Comments
Please login to add a commentAdd a comment