
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా ఉత్సవాల్లో అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం జరిగిన లెక్కింపులో రూ.3,95,06,500 నగదుతోపాటు 532 గ్రాముల బంగారం, 13.680 కిలోల వెండి లభించిందని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. 22 హుండీల ద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు.
మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన లెక్కింపులో సేవా సిబ్బందితోపాటు ఆలయానికి చెందిన వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. బుధ, గురువారాల్లోనూ కానుకల లెక్కింపు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.