నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు ఇవ్వాలి
- ఆర్.కృష్ణయ్య డిమాండ్
దోమలగూడ : నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. చిక్కడపల్లిలోని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కష్ణయ్య, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టరు లక్ష్మణ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, అరుణోదయ విమలక్క, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మహిళా సంఘం అధ్యక్షులు శారదాగౌడ్, తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు డీవీ నరేందర్‌రావు నాయీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మంగళి వృత్తిని ఆధునీకరించడానికి ఒక్కో షాపునకు 10 నుంచి 50 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించాలని, గ్రూపు రుణాలుగా కాకుండా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. బీజేపీ బీసీల అభివద్దికి కట్టుబడి ఉందన్నారు.
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ తెలంగాణ సాధనలో నాయీ బ్రాహ్మణులు తమవంతు పోరాటం చేశారన్నారు.
బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ అధ్యక్షులు సతీష్‌నాయీ, ప్రధానకార్యదర్శి రాం బాబు నాయీ, నాయకులు మనోహర్‌నాయీ, ఓంప్రకాష్‌నాయీ, కె హరినాధ్, బీసీ నాయకులు కృష్ణ, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వినయ్ తదితరులు పాల్గొన్నారు.