Federation
-
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది. ఈ దినోత్సవం భాషా వైవిధ్యం మరియు బహుభాషావాదం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో, హాంకాంగ్‌లోని వివిధ భాషా సమాజాల నుండి ప్రతినిధులు మరియు అతిథులు పాల్గొన్నారు. వివిధ భాషలలో కవితలు, కథలు, ప్రదర్శనలు, పాటలు మరియు జానపద నృత్యాలు పంచుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న భాషలలో కాంటోనీస్, కుర్దిష్, బంగ్లా, మరాఠీ, రొమేనియన్, కన్నడ, సంస్కృతం, హిందీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ మరియు నేపాలీ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు వీరే.. 1.మిస్టర్ యూజీన్ ఫాంగ్, పార్టనర్షిప్ ఎంగేజ్మెంట్ చైర్ మరియు మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్ గ్లోకల్ పీస్ సెంటర్2. మిస్టర్ మార్కో క్వాంగ్, ప్రాజెక్ట్స్ ఆఫీసర్, యునెస్కో HK అసోసియేషన్-గ్లోకల్ పీస్ సెంటర్3. మిస్టర్ అష్ఫాకుర్ రెహమాన్, బంగ్లాదేశ్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ అధ్యక్షుడు4 శ్రీమతి రీటా గురుంగ్, హాంకాంగ్ నేపాల్ ఫెడరేషన్ చైర్పర్సన్5. మిస్టర్ మెసుట్ టెమెల్, ఆంటోలియా కల్చరల్ అండ్ డైలాగ్ సెంటర్ చైర్మన్6. మిస్టర్ థాపా చురా బహదూర్, సర్ ఎల్లిస్ కడూరీ సెకండరీ స్కూల్ (వెస్ట్ కౌలూన్)లో NET టీచర్, టీచర్/రచయిత/రచయితమిస్టర్.7. తిరుపతి నాచియప్పన్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ & మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్-గ్లోకల్ పీస్ సెంటర్ సహ-చైర్.బాంగ్లాదేశ్ అసోసియేషన్ అఫ్ హంగ్ కాంగ్ ప్రతి సంవత్సరం 1952లో మాతృభాష పవిత్రతను, గుర్తింపును కాపాడే పోరాటంలో అంతిమ త్యాగం చేసిన భాషా అమరవీరులకు కృతజ్ఞతలు తెలుపుతూ 21 ఫిబ్రవరి ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. యునెస్కో వారి గ్లోకల్ పీస్ సెంటర్ కార్యకర్త శ్రీ తిరునాచ్ నాచియప్పన్ గారి సహాయ సహకారాలను మరియు ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. ది హంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు , ఈ కార్యక్రమ రూపకర్తగా మాట్లాడుతూ, హంగ్ కాంగ్ లో మొదటి సారిగా తమ సంస్థ మాత్రమే 2021 నుంచి అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలకి, పిల్లలకు వారి తల్లి తండ్రులకు, గౌరవ్ అతిథులకు మరియు నిర్వహణ లో సహకరించిన వారందరికీ తమ కృతఙ్ఞతలు తెలిపారు. -
వాహన రిటైల్ విక్రయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2024లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 2,61,07,679 యూనిట్లు నమోదైంది. 2023తో పోలిస్తే విక్రయాలు గతేడాది 9 శాతం పెరిగాయని డీలర్ల సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం తెలిపింది. సవాళ్లతో కూడిన వ్యాపార వాతావరణం మధ్య ద్విచక్ర, ప్యాసింజర్ వాహనాలకు బలమైన డిమాండ్ నేపథ్యంలో ఈ వృద్ధి నమోదైందని ఫెడరేషన్ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు 2023తో పోలిస్తే 5 శాతం వృద్ధితో గతేడాది 40,73,843 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 శాతం దూసుకెళ్లి 1,89,12,959 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్స్ రిజిస్ట్రేషన్లు 11 శాతం ఎగసి 12,21,909 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 3 శాతం వృద్ధితో 8,94,112 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 10,04,856 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. నిలకడగా పరిశ్రమ.. వేడిగాలులు, కేంద్రం, రాష్ట్ర స్థాయిలలో ఎన్నికలు, అసమాన రుతుపవనాలతో సహా పలు ఎదురుగాలులు ఉన్నప్పటికీ వాహన రిటైల్ పరిశ్రమ 2024లో నిలకడగా ఉందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. ‘మెరుగైన సరఫరా, తాజా మోడళ్లు, బలమైన గ్రామీణ డిమాండ్ ద్విచక్ర వాహన విభాగంలో వృద్ధిని పెంచాయి. అయినప్పటికీ ఆర్థిక పరిమితులు, ఎలక్ట్రిక్ విభాగం నుంచి పెరుగుతున్న పోటీ సవాళ్లను కలిగిస్తూనే ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ (పీవీ) విభాగం బలమైన నెట్వర్క్ విస్తరణ, ఉత్పత్తి లాంచ్‌ల నుండి ప్రయోజనం పొందింది. అధిక ఇన్వెంటరీ కారణంగా లాభాలపై ఒత్తిళ్లు ఏర్పడి ద్వితీయార్థంలో డిస్కౌంట్ల యుద్ధానికి దారితీసింది. ఎన్నికల ఆధారిత అనిశ్చితి, తగ్గిన మౌలిక సదుపాయాల మధ్య వాణిజ్య వాహనాల విభాగం పనితీరు స్తబ్ధుగా ఉంది’ అని వివరించారు. -
దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కోవిడ్ సమయంలో తెలుగు వారి సత్తా ప్రపంచానికి తెలిసిందని.. కోవిడ్ వ్యాక్సిన్‌ను మన తెలుగువాళ్లే తయారు చేశారన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12 వ మహాసభ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయస్థాయికి ఎదిగిందన్నారు. ఏ దేశానికి వెళ్లిన మన తెలుగు వారు కనిపిస్తారన్నారు.మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. దేశంలోనే హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, కాకా, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. కానీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాభవం తగ్గింది. రాజకీయం, సినీ,వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దు’’ అని రేవంత్ సూచించారు.పరభాషా జ్ఞానం సంపాదించాలి… కానీ మన భాషను గౌరవించాలి. తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో మేం ముందుకు వెళుతున్నాం. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలి’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు -
'నా ప్రేమకు దక్కింది విషమే'..బ్రిజ్ భూషణ్ జీవిత పాఠాలు..!
ఉత్తరప్రదేశ్: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజకీయ జీవితంలో బిజీ అయిపోయారు! ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. 2024లో తాను ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే..ర్యాలీలో బ్రిజ్ భూషణ్ ఓ ఇంట్రెస్టింగ్ కవిత చెప్పారు. బాధ, కన్నీరు,మోసం, ప్రేమలపై సాగింది ఆ కవిత. ఈయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్ల పేర్లు ప్రస్తావించకుండానే ఈ మేరకు మాట్లాడారు. 'కొన్నిసార్లు కన్నీళ్లే మిగులుతాయి. బాధను అనుభవించాల్సి ఉంటుంది. విషాన్నే మింగాల్సి పరిస్థితి ఎదురవ్వొచ్చు. అన్నీ భరిస్తేనే సమాజంలో మనుగడ సాగించగలం. నా ప్రేమకు దక్కిన ప్రతిఫలం ఇదే. కొందరు నన్ను తిడుతున్నారు. పొగుడుతున్నారు. నా పేరే నిత్యం పలుకుతున్నారు.'అంటూ సాగిన ఈ కవితను 2024 ఎన్నికల కోసం బీజేపీ నిర్వహించిన మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా వినిపించారు. 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బ్రిజ్ భూషణ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దేశం కోల్పోయినదంతా ప్రధాని మోదీ తీసుకువస్తున్నారని అన్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి:వీడియో, ఆడియో, వాట్సాప్ చాటింగ్ ఆధారాలుంటే చూపించండి... -
భారత్ ఖాతాలో కాంస్యం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తొలి రోజే కాంస్యంతో బోణీ కొట్టింది. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, నామ్య కపూర్, విభూతి భాటియాలతో కూడిన జట్టు మహిళల 25 మీటర్ల జూనియర్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత బృందం 17–1తో జర్మనీపై గెలిచింది. ముందుగా క్వాలిఫికేషన్లో 856 పాయింట్లతో భారత బృందం నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాతి రౌండ్లో 437 పాయింట్ల స్కోరు చేసిన భారత త్రయం జర్మనీ తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు కాంస్యం కోసం తలపడగా భారత్ విజయం సాధించింది. -
మార్కెట్లో ‘ఫెడ్’ అప్రమత్తత
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు అప్రమత్తత చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు నాలుగోరోజూ నష్టాలను చవిచూశాయి. ద్రవ్యోల్బణ భయాలు, ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి ఆందోళనలు కొనసాగాయి. రూపాయి విలువ 20 నెలల కనిష్టానికి దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 329 పాయింట్లు పతనమై 58వేల దిగువున 57,788 వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 17,221 వద్ద నిలిచింది. ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ, మెటల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. కేంద్రం సెమి కండెక్టర్ల తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రకటించడంతో ఆటో షేర్లు ర్యాలీ చేశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు అరశాతానికి పైగా క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3407 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.1553 కోట్ల షేర్లను కొన్నారు. గడిచిన నాలుగురోజుల్లో సెన్సెక్స్ 1,019 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లను కోల్పోయాయి. ఫెడ్ రిజర్వ్ పాలసీ వెల్లడికి ముందు ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో ఒడిదుడుకులు ..! ఉదయం సెన్సెక్స్ ఐదు పాయింట్ల స్వల్ప లాభంతో 58,122 వద్ద, నిఫ్టీ ఒక పాయింటు స్వల నష్టంతో 17,324 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్లో అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్ 445 పాయింట్లు నష్టపోయి 57,672 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లను కోల్పోయి 17,192 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర రికవరీ అయ్యాయి. మొత్తంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 547 పాయింట్ల పరిధిలో 57,671 వద్ద కనిష్టాన్ని, 58,218 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 17,192 – 17,351 మధ్య కదలాడింది దూసుకెళ్లిన ఆటో షేర్లు కొన్నేళ్లుగా ఆటో పరిశ్రమను వేధిస్తున్న సెమి కండెక్టర్ల కొరతను తీర్చేందుకు కేంద్రం పీఎల్ఐ పథకాన్ని ప్రకటించడంతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. ఈ రంగానికి చెందిన టీవీఎస్ మోటార్స్, మారుతీ సుజుకీ, ఎమ్అండ్ఎం, హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో షేర్లు ఒకటిన్నర శాతం నుంచి అరశాతం ర్యాలీ చేశాయి. ఎన్ఎస్ఈలో అన్ని రంగాల సూచీలు నష్టపోగా ఒక్క నిఫ్టీ ఆటో ఇండెక్స్ మాత్రం అరశాతం లాభంతో ముగిసింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► యాంకర్ ఇన్వెస్టర్ల లాక్ – ఇన్ పీరియడ్ ముగియడంతో పేటీఎం షేరులో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో ఎనిమిది శాతం నష్టపోయి రూ.1380 వద్ద స్థిరపడింది. ► ఇన్వెస్టర్లు, ఆర్థిక విశ్లేషకుల సమావేశం ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవడంతో ఐటీసీ షేరు రెండు శాతం నష్టపోయి రూ.224 వద్ద ముగిసింది. ► జర్మనీ చర్మ సంరక్షణ బ్రాండ్ క్రీమ్21ను భారత మార్కెట్లోకి విడుదల చేయడంతో ఇమామీ షేరు నాలుగుశాతం లాభపడి రూ.548 వద్ద నిలిచింది. ► లుపిన్ షేరులో లాభాల స్వీకరణ జరగడంతో మూడు శాతం నష్టంతో రూ.919 వద్ద ముగిసింది. -
వలసదారుల ఇక్కట్లు.. బైడెన్ ప్రభుత్వ కీలక ప్రకటన
Migrants Stranded At Texas Bridge: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టెక్సాస్ సరిహద్దు ప్రాంతంలోని డెల్రియోలో వరదల్లో చిక్కుకున్న వేలాది మంది వలసదారులను తరలించడానికీ విమానాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వలసలు, కరోనా పరిస్థితుల దృష్ట్యా అమెరికా ప్రభుత్వం హైతీ, మెక్సికో, ఈక్వెడార్ మరియు మధ్య అమెరికాలోని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) నియంత్రణలోని ప్రాంతమైన డెల్ రియో బ్రిడ్జ్ కింద ఉన్న గ్రాండ్ నదిని దాటి మెక్సికో నగరానికీ వలసదారులు పెద్ద ఎత్తున సముహాలుగా పయనమవుతున్నారు. (చదవండి: అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి) ఈ సందర్బంగా డెల్ రియో మేయర్ బ్రూనో లోజానో మాట్లాడుతూ..." 14 వేల మంది వలసదారులు నిర్భంధంలోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారు. అంతేకాదు వలసదారులను తరలించే ఆపరేషన్‌లో భాగంగా స్థానిక , ఫెడరేషన్ అధికారులు బస్సులు, విమానాల పంపించారు. డెల్ రియో ప్రవేశ ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి రియో బ్రిడ్జి పై రద్దీ దృష్ట్య వేరే మార్గం గుండా తరలించే ఏర్పాటు చేశాం" అని పేర్కొన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ హైతి, సంబంధిత ప్రాంతాల్లో నిషేధించిన విమానాలను పునరుద్ధరించి త్వరితగతిన వలసదారులను తరలించేందుకు మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. యూఎస్ నేలపై వలసల ఉధృతిని తగ్గించి, పరిస్థితిని తిరిగి మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని బైడెన్ పరిపాలనా యంత్రాంగం పేర్కొంది. హైతి అధ్యక్షుడి మరణం, తాలిబన్లు అఫ్గనిస్తాన్ ఆక్రమించుకోవడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో అమెరికాలోని మెక్సికో సరిహద్దు ప్రాంతంలోకి అధిక సంఖ్యలో వసలదారులు తాకిడి ఎక్కువైంది. దీంతో యూఎస్ ప్రభుత్వం 2 లక్షలకు మించి వలసదారులకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు వలసలను మొదటగా బహిష్కరించినప్పటికీ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో వారికీ ఆశ్రయం కల్పించి, తరలించే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: పది కోట్ల ప్రైజ్‌మనీ రేసులో మన బిడ్డ) -
జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జాతీయ ఓబిసీ ఫెడరేషన్ సమావేశం
-
‘మనది ఫెడరేషన్ కాదు యూనియన్’
తెలుగు రాష్ట్రాల సీఎంలు భారత యూనియన్ గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తనవంతుగా కేంద్రం మిథ్య రాష్ట్రాలే నిజం అంటూ ఎన్టీరామారావు భావనను మళ్లీ తలకెత్తుకుంటున్నారు. ఇది పూర్తిగా తప్పు భావన. భారతదేశం ఫెడరేషన్ కానేకాదు. అది రాష్ట్రాల యూనియన్ మాత్రమే. 1947కి ముందు దేశంలో రాష్ట్రాలు అనేవే లేవు. బ్రిటిష్ పాలన కింది ప్రాదేశిక ప్రాంతాలు మాత్రమే ఉండేవి. 500 స్థానిక సంస్థానాలు నవాబులు, రాజాలు, మహారాజుల పాలనలో ఉండేవి. 1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం హైదరాబాద్, కశ్మీర్ తప్ప తక్కిన 500 సంస్థానాలు ఇండియన్ యూనియన్ లేక పాకిస్తాన్లో విలీనమయ్యాయి. ఈ విలీనం కూడా ఇండియన్ యూనియన్తోనే కానీ ఫెడరల్ స్టేట్ ఆఫ్ ఇండియాతో కాదన్నది వాస్తవం. భారత రాజ్యాంగం కూడా ఇండియన్ యూనియన్ అనే పదాన్నే ఉపయోగించింది తప్పితే ఇండియన్ ఫెడరేషన్‌ని కాదు. భారత యూనియన్, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది. ఇండియన్ యూనియన్‌తో లేని రాష్ట్రాలు 18వ శతాబ్ది నాటి అస్థిరత్వ కేంద్రాలైన సంస్థానాలనే గుర్తుకు తెస్తాయి. ప్రాంతీయవాదం, భాషా వాదం, కులతత్వం, మతతత్వం వంటి ఆలోచనలను నాయకులు, రాజకీయ పార్టీలు ప్రేరేపించినట్లయితే దేశం మళ్లీ స్వాతంత్య్రాన్ని కోల్పోవడం ఖాయమంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేం ద్రప్రసాద్ రాజ్యాంగ సభ ముగింపు సమావేశంలో చేసిన హెచ్చరికలను మర్చిపోకూడదు. -త్రిపురనేని హనుమాన్ చౌదరి,ప్రజ్ఞాభారతి చైర్మన్, హైదరాబాద్ -
సినిమా షూటింగులు మొదలయ్యేదెన్నడో..?
-
నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు ఇవ్వాలి
ఆర్.కృష్ణయ్య డిమాండ్ దోమలగూడ : నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. చిక్కడపల్లిలోని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కష్ణయ్య, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టరు లక్ష్మణ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, అరుణోదయ విమలక్క, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మహిళా సంఘం అధ్యక్షులు శారదాగౌడ్, తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు డీవీ నరేందర్‌రావు నాయీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మంగళి వృత్తిని ఆధునీకరించడానికి ఒక్కో షాపునకు 10 నుంచి 50 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించాలని, గ్రూపు రుణాలుగా కాకుండా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. బీజేపీ బీసీల అభివద్దికి కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ తెలంగాణ సాధనలో నాయీ బ్రాహ్మణులు తమవంతు పోరాటం చేశారన్నారు. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ అధ్యక్షులు సతీష్నాయీ, ప్రధానకార్యదర్శి రాం బాబు నాయీ, నాయకులు మనోహర్నాయీ, ఓంప్రకాష్నాయీ, కె హరినాధ్, బీసీ నాయకులు కృష్ణ, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వినయ్ తదితరులు పాల్గొన్నారు.