
Migrants Stranded At Texas Bridge: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టెక్సాస్ సరిహద్దు ప్రాంతంలోని డెల్‌రియోలో వరదల్లో చిక్కుకున్న వేలాది మంది వలసదారులను తరలించడానికీ విమానాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వలసలు, కరోనా పరిస్థితుల దృష్ట్యా అమెరికా ప్రభుత్వం హైతీ, మెక్సికో, ఈక్వెడార్ మరియు మధ్య అమెరికాలోని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) నియంత్రణలోని ప్రాంతమైన డెల్ రియో బ్రిడ్జ్ కింద ఉన్న గ్రాండ్ నదిని దాటి మెక్సికో నగరానికీ వలసదారులు పెద్ద ఎత్తున సముహాలుగా పయనమవుతున్నారు.
(చదవండి: అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి)
ఈ సందర్బంగా డెల్ రియో మేయర్ బ్రూనో లోజానో మాట్లాడుతూ..." 14 వేల మంది వలసదారులు నిర్భంధంలోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారు. అంతేకాదు వలసదారులను తరలించే ఆపరేషన్‌లో భాగంగా స్థానిక , ఫెడరేషన్ అధికారులు బస్సులు, విమానాల పంపించారు. డెల్ రియో ప్రవేశ ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి రియో బ్రిడ్జి పై రద్దీ దృష్ట్య వేరే మార్గం గుండా తరలించే ఏర్పాటు చేశాం" అని పేర్కొన్నారు.
హోంల్యాండ్ సెక్యూరిటీ హైతి, సంబంధిత ప్రాంతాల్లో నిషేధించిన విమానాలను పునరుద్ధరించి త్వరితగతిన వలసదారులను తరలించేందుకు మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. యూఎస్ నేలపై వలసల ఉధృతిని తగ్గించి, పరిస్థితిని తిరిగి మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని బైడెన్ పరిపాలనా యంత్రాంగం పేర్కొంది.
హైతి అధ్యక్షుడి మరణం, తాలిబన్లు అఫ్గనిస్తాన్ ఆక్రమించుకోవడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో అమెరికాలోని మెక్సికో సరిహద్దు ప్రాంతంలోకి అధిక సంఖ్యలో వసలదారులు తాకిడి ఎక్కువైంది. దీంతో యూఎస్ ప్రభుత్వం 2 లక్షలకు మించి వలసదారులకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు వలసలను మొదటగా బహిష్కరించినప్పటికీ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో వారికీ ఆశ్రయం కల్పించి, తరలించే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
(చదవండి: పది కోట్ల ప్రైజ్మనీ రేసులో మన బిడ్డ)