
బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: బడ్జెట్‌లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 60 వేల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు 4800 కోట్లు కేటాయించారని, ఇప్పుడు లక్ష కోట్లలో బీసీలకు కేవలం రెండువేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ప్రతి ఏటా నిధుల కేటాయింపులు పెరగాల్సిందిపోయి తగ్గడం ఎంతవరకు సమంజసమన్నారు.
గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల వ్యతిరేకిగా మారిందన్నారు. బడ్జెట్‌లో కొత్త పథకం ఒక్కటికూడా లేదన్నారు. సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, శారదా గౌడ్, విక్రంగౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.