BC Welfare Association national president
-
‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు.. బీసీల మద్దతు ఆయనకే’
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే బీసీలకు వంద శాతం న్యాయం జరుగుతుందని ఆల్ఇండియా బీసీ ప్రజాసంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. తణుకు ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...41 అసెంబ్లీ స్థానాలు, ఏడు పార్లమెంటు స్థానాలు బీసీలకు కేటాయించిన వైఎస్ జగన్‌కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘చంద్రబాబును ఐదుసార్లు కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ చేయమని కోరాం. కానీ ఆయన స్పందించలేదు. కనీసం జయహో బీసీ సదస్సులోనైనా బీసీలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటిస్తారని చూశాం. కానీ అలా జరగలేదు. టీడీపీ బీసీల పార్టీ అంటూ ఇన్నాళ్లు నమ్మిస్తూ వచ్చారు. ఇకపై వాళ్లను ప్రజలు నమ్మరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే బీసీల పక్షపాతి అని విశ్వసిస్తున్నాం’ అని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జగన్‌కు ఒక బ్రాండ్ ఉంది... ఒక బీసీ నాయకుడిగా వైఎస్సార్ సీపీ గెలుపునకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వెంకటేశ్వరరావు అన్నారు. ‘ వైఎస్ జగన్‌ను పాదయాత్రలో ఏడుసార్లు కలిశాను. ప్రతీ సందర్భంలోనూ బీసీలుగా మీరు ఏ విషయంలో దిగువన ఉన్నామని భావిస్తున్నారో నాకు చెప్పమని ఆయన అడిగేవారు. దివంగత మహానేత వైఎస్సార్‌ను బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కోరితే కేవలం బీసీలకే కాదు.. అగ్రవర్ణ పేదలకు కూడా వర్తింపచేసిన మహానుభావుడు. మళ్లీ అలాంటి నాయకుడిని కేవలం వైఎస్ జగన్‌లో మాత్రమే చూడగలం. మాట ఇస్తే తప్పడనే బ్రాండ్ వైఎస్ జగన్‌కు ఉంది. అందుకే మా సంపూర్ణ మద్దతు ఆయనకే’ అని స్పష్టం చేశారు. -
త్వరలో కొత్త పార్టీ పెడతాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎన్.చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు బీసీలపట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ త్వరలో రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ బహిరంగ సభ పెట్టినా బీసీలంతా మన కోసం పార్టీ పెట్టన్నా..’అని అడుగుతున్నారని చెప్పా రు. పార్టీ ఏర్పాటుపై చర్చలు సాగుతున్నాయన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న గుంటూరు, నిన్న విజయవాడ, అంతకుముందు వరంగల్‌లో పెట్టిన సభల్లో చాలామంది ‘ఈ అగ్రకుల పార్టీల నేతలు మనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు, ఎంతసేపు మనల్ని అడుక్కుతినే వాళ్లల్లానే చేస్తున్నారు, సీట్ల విషయంలో మొండిచెయ్యి చూపుతున్నారు, కాబట్టి నువ్వు పార్టీ పెట్టాల్సిందే’అని అంటున్నారని చెప్పారు. పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఏపీలోనే పెడతాననిç Ü్పష్టం చేశారు. ఏపీలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారి ఎక్కడ నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించి వారంలోగా వెల్లడిస్తానన్నారు. రద్దు చేసి సీఎంగా కొనసాగడమా? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. అసెంబ్లీని రద్దు చేసి 125 మంది ఎమ్మెల్యేలను రోడ్డున పడేసి, ఆయన మాత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగడమేమిటని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీసీలకు 65 సీట్లు ఇవ్వాలని, లేదంటే బీసీలందరం కలసి ఓడిస్తామని వ్యాఖ్యానించారు. -
బడ్జెట్లో బీసీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 60 వేల కోట్ల బడ్జెట్లో బీసీలకు 4800 కోట్లు కేటాయించారని, ఇప్పుడు లక్ష కోట్లలో బీసీలకు కేవలం రెండువేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ప్రతి ఏటా నిధుల కేటాయింపులు పెరగాల్సిందిపోయి తగ్గడం ఎంతవరకు సమంజసమన్నారు. గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల వ్యతిరేకిగా మారిందన్నారు. బడ్జెట్లో కొత్త పథకం ఒక్కటికూడా లేదన్నారు. సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, శారదా గౌడ్, విక్రంగౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు అన్యాయం చేస్తే సహించం
తెయూ(డిచ్పల్లి): దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీ వర్గాలకు సామాజిక రక్షణ చట్టం అమలు చేయాలని, బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఁనవ తెలంగాణ నిర్మాణం- బీసీలు-సవాళ్లు* అన్న అంశంపై శుక్రవారం నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బీసీలు ఐకమత్యంగా, చైతన్యవంతంగా ఉండాలన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చిన బీసీ రిజర్వేషన్లకు క్రిమిలేయర్ పెట్టారని విమర్శించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడితే బీసీలకు న్యాయం జరుగుతుందని అనేక మంది బీసీ ఉద్యమకారులు త్యాగాలు చేశారని గుర్తుచేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలకు గానూ కేవలం 19మంది మాత్రమే బీసీలు ఉన్నారన్నారు. ఉద్యోగాలలో క్రిమిలేయర్ లేని రిజర్వేషన్, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బడ్జెట్లో 50 శాతం బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 50శాతం రిజర్వేషను కల్పించాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని, సామాజిక రక్షణ కోసం బీసీ యాక్ట్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ జోలికి రావొద్దు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీ జు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరు గార్చేం దుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కృష్ణయ్య విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జోలికొస్తే ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమని హెచ్చరించారు. విద్యార్థులకు మొత్తం మెస్ చార్జీలను చెల్లించాలని, విద్యార్థులకు పాకెట్‌మనీ ఇవ్వాలన్నారు. వ ర్సిటీలలో వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే బీసీ టోల్‌ఫ్రీ నంబర్ బీసీలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే స హించేది లేదని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. త్వరలోనే 24గంటల టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, అధ్యాపకులు ఐకమత్యంతో ఉండాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీలందరూ చైతన్యంతో పనిచేయాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫాస్ట్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సభకు అధ్యక్షత వహించిన తెయూ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ ధర్మరాజు మాట్లాడుతూ ఉద్యోగాలలో క్రిమిలేయర్ నిబంధన ఎత్తివేత, ఓబీసీలకు పరిశోధనా గ్రాంట్లు, స్కాలర్షిప్లు, చ ట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. టూటా అధ్యక్షుడు ప్రొఫెసర్ శివశంకర్, తె యూ ఇన్చార్జి రిజిస్ట్రార్ యాదగిరి, బీసీ సం క్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మారయ్య గౌడ్, తెయూ కళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య, బీసీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజారామ్, ప్రభంజన్ కుమార్ యాదవ్, ఆంజనేయులు, తెయూ టీచింగ్, నాన్-టీచింగ్ అసోసియేషన్ సభ్యులు, అకడమిక్ కన్సల్టెంట్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రూ.వందకోట్లు కేటాయించేలా చూడండి తెలంగాణ యూనివర్సిటీకి త్వరలో జరుగనున్న రాష్ట్ర బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించేలా కృషి చేయాలని ఆర్.కృష్ణయ్యకు బీ సీ విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. మెస్ బిల్లులు రూ. వెయ్యి పెంచాలన్నారు. బీసీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్‌లు మంజూరు, నెట్, సెట్ పరీక్షలలో కటాఫ్ మార్కులు తగ్గించేలా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు కె.రమణ, అనిల్‌కుమార్, తిరుపతి, రాజు,రాజేంధర్, వెంకటస్వామి, సంతోశ్ తదితరులు ఉన్నారు. -
పర్మనెంట్ చేయకపోతే రాష్ట్రం చీకటే
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయకపోతే రాష్ట్రం అంధకారంగా మారుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రా క్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొందని, ఆ మేరకు కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిం చారు. కొన్ని శాఖల్లో క్రమబద్ధీకరించి విద్యుత్ శాఖలో పర్మినెంట్ చేయకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సమాజానికి వెలుగులను అందించే కార్మికుల జీవితాల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయన్నారు. సమావేశంలో కాం ట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు శ్రీధర్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, ఎం.పృథ్వీరాజ్ గౌడ్, రాజేందర్ పాల్గొన్నారు.