సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయితేనే బీసీలకు వంద శాతం న్యాయం జరుగుతుందని ఆల్‌ఇండియా బీసీ ప్రజాసంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. తణుకు ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...41 అసెంబ్లీ స్థానాలు, ఏడు పార్లమెంటు స్థానాలు బీసీలకు కేటాయించిన వైఎస్ జగన్‌కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘చంద్రబాబును ఐదుసార్లు కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయమని కోరాం. కానీ ఆయన స్పందించలేదు. కనీసం జయహో బీసీ సదస్సులోనైనా బీసీలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రకటిస్తారని చూశాం. కానీ అలా జరగలేదు. టీడీపీ బీసీల పార్టీ అంటూ ఇన్నాళ్లు నమ్మిస్తూ వచ్చారు. ఇకపై వాళ్లను ప్రజలు నమ్మరు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే బీసీల పక్షపాతి అని విశ్వసిస్తున్నాం’ అని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
జగన్‌కు ఒక బ్రాండ్ ఉంది...
ఒక బీసీ నాయకుడిగా వైఎస్సార్ సీపీ గెలుపునకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వెంకటేశ్వరరావు అన్నారు. ‘ వైఎస్ జగన్‌ను పాదయాత్రలో ఏడుసార్లు కలిశాను. ప్రతీ సందర్భంలోనూ బీసీలుగా మీరు ఏ విషయంలో దిగువన ఉన్నామని భావిస్తున్నారో నాకు చెప్పమని ఆయన అడిగేవారు. దివంగత మహానేత వైఎస్సార్‌ను బీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోరితే కేవలం బీసీలకే కాదు.. అగ్రవర్ణ పేదలకు కూడా వర్తింపచేసిన మహానుభావుడు. మళ్లీ అలాంటి నాయకుడిని కేవలం వైఎస్ జగన్‌లో మాత్రమే చూడగలం. మాట ఇస్తే తప్పడనే బ్రాండ్ వైఎస్ జగన్‌కు ఉంది. అందుకే మా సంపూర్ణ మద్దతు ఆయనకే’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment