బీసీలకు అన్యాయం చేస్తే సహించం | don't do unfair to BC | Sakshi
Sakshi News home page

బీసీలకు అన్యాయం చేస్తే సహించం

Published Sat, Oct 18 2014 2:58 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

బీసీలకు అన్యాయం చేస్తే సహించం - Sakshi

బీసీలకు అన్యాయం చేస్తే సహించం

తెయూ(డిచ్‌పల్లి): దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీ వర్గాలకు సామాజిక రక్షణ చట్టం అమలు చేయాలని, బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఁనవ తెలంగాణ నిర్మాణం- బీసీలు-సవాళ్లు* అన్న అంశంపై  శుక్రవారం నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బీసీలు ఐకమత్యంగా, చైతన్యవంతంగా ఉండాలన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చిన బీసీ రిజర్వేషన్లకు క్రిమిలేయర్ పెట్టారని విమర్శించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడితే బీసీలకు న్యాయం జరుగుతుందని అనేక మంది బీసీ ఉద్యమకారులు త్యాగాలు చేశారని గుర్తుచేశారు.

కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలకు గానూ కేవలం 19మంది మాత్రమే బీసీలు ఉన్నారన్నారు. ఉద్యోగాలలో క్రిమిలేయర్ లేని రిజర్వేషన్, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బడ్జెట్‌లో 50 శాతం బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 50శాతం రిజర్వేషను కల్పించాలని పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని, సామాజిక రక్షణ కోసం బీసీ యాక్ట్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

ఫీజు రీయింబర్స్‌మెంట్ జోలికి రావొద్దు
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీ జు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరు గార్చేం దుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కృష్ణయ్య విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం జోలికొస్తే ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమని హెచ్చరించారు. విద్యార్థులకు మొత్తం మెస్ చార్జీలను చెల్లించాలని, విద్యార్థులకు పాకెట్‌మనీ ఇవ్వాలన్నారు. వ ర్సిటీలలో వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
త్వరలోనే బీసీ టోల్‌ఫ్రీ నంబర్
బీసీలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే స హించేది లేదని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. త్వరలోనే 24గంటల టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, అధ్యాపకులు ఐకమత్యంతో ఉండాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ  రాష్ట్రంలోని బీసీలందరూ చైతన్యంతో పనిచేయాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫాస్ట్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సభకు అధ్యక్షత వహించిన తెయూ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ ధర్మరాజు మాట్లాడుతూ ఉద్యోగాలలో క్రిమిలేయర్ నిబంధన ఎత్తివేత, ఓబీసీలకు పరిశోధనా గ్రాంట్లు, స్కాలర్‌షిప్‌లు, చ ట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. టూటా అధ్యక్షుడు ప్రొఫెసర్ శివశంకర్,  తె యూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ యాదగిరి, బీసీ సం క్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మారయ్య గౌడ్, తెయూ కళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య, బీసీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజారామ్, ప్రభంజన్ కుమార్ యాదవ్, ఆంజనేయులు,  తెయూ టీచింగ్, నాన్-టీచింగ్ అసోసియేషన్ సభ్యులు, అకడమిక్ కన్సల్టెంట్లు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

రూ.వందకోట్లు కేటాయించేలా చూడండి
తెలంగాణ యూనివర్సిటీకి త్వరలో జరుగనున్న రాష్ట్ర బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించేలా కృషి చేయాలని ఆర్.కృష్ణయ్యకు బీ సీ విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.  మెస్ బిల్లులు రూ. వెయ్యి పెంచాలన్నారు. బీసీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్‌లు మంజూరు, నెట్, సెట్ పరీక్షలలో కటాఫ్ మార్కులు తగ్గించేలా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు కె.రమణ, అనిల్‌కుమార్, తిరుపతి, రాజు,రాజేంధర్, వెంకటస్వామి, సంతోశ్ తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement