బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య
హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయకపోతే రాష్ట్రం అంధకారంగా మారుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రా క్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని టీఆర్‌ఎస్ తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొందని, ఆ మేరకు కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవాలని సూచించారు.
విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిం చారు. కొన్ని శాఖల్లో క్రమబద్ధీకరించి విద్యుత్ శాఖలో పర్మినెంట్ చేయకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సమాజానికి వెలుగులను అందించే కార్మికుల జీవితాల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయన్నారు. సమావేశంలో కాం ట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు శ్రీధర్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, ఎం.పృథ్వీరాజ్ గౌడ్, రాజేందర్ పాల్గొన్నారు.
పర్మనెంట్ చేయకపోతే రాష్ట్రం చీకటే
Published Mon, Oct 13 2014 1:26 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement